|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దళపతి విజయ్‌ కొంప ముంచిన కమల్‌ హాసన్‌.. `జన నాయగన్‌` చిత్రానికి కూడా బ్యాన్‌ తప్పదా?

Published: 03-06-2025, 11:41 AM
దళపతి విజయ్‌ కొంప ముంచిన కమల్‌ హాసన్‌.. `జన నాయగన్‌` చిత్రానికి కూడా బ్యాన్‌ తప్పదా?

కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ చిత్రం కర్ణాటకలో బ్యాన్ అయింది. కమల్ చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం. ఇప్పుడు ఈ బ్యాన్ విజయ్ ‘జన నాయగన్’ సినిమాను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది.

Key Points

1

కమల్ హాసన్ 'థగ్ లైఫ్' చిత్ర ప్రమోషన్ లో చేసిన వ్యాఖ్యల వల్ల కర్ణాటకలో బ్యాన్.

2

కన్నడ సంఘాల ఆగ్రహం, కమల్ క్షమాపణలు కోరుతున్నాయి.

4

తమిళనాడులో 'జన నాయగన్', 'టాక్సిక్' సినిమాలకు బ్యాన్ అయ్యే అవకాశం.

‘థగ్ లైఫ్’ కు కర్ణాటకలో బ్యాన్

మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్‌, శింబు నటించిన సినిమా `థగ్‌ లైఫ్‌`.  అభిరామి, త్రిష, జోజు జార్జ్, అశోక్ సెల్వన్, నాజర్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ  జూన్ 5న  విడుదల కానుంది.

గత ఇరవై రోజులుగా టీమ్‌ వరుస ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఇక ప్రమోషన్స్ కూడా ముగింపుకి చేరుకుంది. మరో రెండు రోజుల్లో సినిమా ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.

`థగ్‌ లైఫ్‌` సినిమా పాన్‌ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది.  కానీ కర్ణాటకలో ఈ మూవీపై బ్యాన్‌ పడింది. ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా కమల్, “కన్నడ భాష తమిళం నుంచి వచ్చింది” అని అన్నారు.

కమల్ హాసన్ క్షమాపణలు

దీన్ని కన్నడ సంఘాలు వ్యతిరేకించి, ఈ మూవీని కర్ణాటకలో ఆడనివ్వం అని తేల్చి చెప్పాయి. కమల్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నాయి. కర్ణాటక ఫిలిం ఛాంబర్ కూడా సినిమాని ఆడనివ్వమని అధికారికంగా చెప్పింది. దీంతో కమల్ కోర్టుకి వెళ్లారు. కోర్ట్ కూడా సారీ చెప్పాలని తెలిపింది.

కమల్ క్షమాపణ చెప్పాలని కర్ణాటక హైకోర్టు చెప్పింది. తాను అన్నది తప్పుగా అర్థం చేసుకున్నారని, అందుకు బాధగా ఉందని కమల్ అన్నారు. ఈ గొడవ జరుగుతుండగా, `థగ్‌ లైఫ్‌’  కారణంగా విజయ్ ‘జన నాయగన్‌’ సినిమాకి కొత్త సమస్య వచ్చింది. ఈ చిత్రాన్ని బెంగళూరుకి చెందిన కె.వి.ఎన్. ప్రొడక్షన్స్ వాళ్ళు నిర్మించారు.

విజయ్ ‘జన నాయగన్’ కు ముప్పు

`థగ్‌ లైఫ్‌` చిత్రాన్ని కర్ణాటకలో ఆడనిస్తే, తమిళనాడులో కె.వి.ఎన్. ప్రొడక్షన్స్ నిర్మించిన `జన నాయగన్‌’ సినిమాని ఆడనివ్వమని నెటిజన్లు అంటున్నారు. కె.వి.ఎన్. ప్రొడక్షన్స్ వాళ్ళు తీస్తున్న ఇంకో సినిమా ‘టాక్సిక్’. ఇందులో యష్ హీరో. వీటిపై కూడా ఈ ప్రభావం ఉండనుందని తెలుస్తుంది.

`థగ్‌ లైఫ్‌` సినిమాకి ఇబ్బంది పెడితే,  కర్ణాటకలో ఆడనివ్వకపోతే, తమిళనాడులో ‘జన నాయగన్‌’ ని, ‘టాక్సిక్’ ని ఆడనివ్వమని కమల్  ఫ్యాన్స్ అంటున్నారు.  ఇది ఇప్పుడు పెద్ద రచ్చ అవుతుంది. వివాదం మరో వైపు టర్న్ తీసుకుంటుంది. మరి ఇది మున్ముందు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.

కమల్ హాసన్ వ్యాఖ్యల వల్ల ‘థగ్ లైఫ్’ కు కలిగిన ఇబ్బందులు, విజయ్ ‘జన నాయగన్’ సినిమా భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయి. ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.