|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కన్నడ, తమిళ భాషపై కమల్‌ వ్యాఖ్యలు.. కర్నాటకలో దుమారం

Published: 28-05-2025, 12:19 AM
కన్నడ, తమిళ భాషపై కమల్‌ వ్యాఖ్యలు.. కర్నాటకలో దుమారం

ప్రముఖ నటుడు కమల్ హాసన్ కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలను కన్నడ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. కమల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి.

Key Points

1

కమల్ హాసన్ కన్నడ భాషకు తమిళమే మాతృక అన్న వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర దుమారం రేపాయి.

2

కన్నడ సంఘాలు కమల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.

4

బీజేపీ నేతలు కూడా కమల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

కమల్‌ వ్యాఖ్యలపై నిరసనలు

చెన్నై: కన్నడ భాషకు తమిళమే మాతృక అంటూ ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. కమల్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం కర్నాటక వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు జరిగాయి. కమల్‌ కార్యక్రమానికి కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌ కుమార్‌ కూడా హాజరయ్యారు. ఆయన ఎదుటే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఆదివారం చెన్నైలో జరిగిన తన సినిమా థగ్‌లైఫ్‌ ఆడియో విడుదల వేడుకలో కమల్‌ హాసన్‌, శివరాజ్‌ కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కమల్‌ మాట్లాడుతూ.. కన్నడ భాషకు తమిళమే మాతృక. ఇక్కడ ఉన్నది నా కుటుంబం. అందుకే ఆయన (శివరాజ్‌ కుమార్) ఇక్కడకి వచ్చారు. అందుకే నా జీవితం, బంధం, తమిళ్ అని మొదలుపెట్టాను. మీ భాష (కన్నడ) తమిళం నుంచి పుట్టింది కాబట్టి మీరు కూడా దానిలో భాగమే’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

కన్నడ సంఘాల ఆగ్రహం

ఈ క్రమంలో కమల్‌ వ్యాఖ్యలను పలు కన్నడ సంఘాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశాయి. లేదంటే కర్నాటకలో కమల్‌ సినిమాలను బహిష్కరిస్తామని కన్నడ రక్షణ వేదిక హెచ్చరించింది. బెంగళూరు వ్యాప్తంగా థగ్‌లైఫ్‌ సినిమా బ్యానర్లను నిరసన కారులు చించేశారు. ఆ సినిమాను రాష్ట్రంలో నిషేధించాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం సాయంత్రం బెంగళూరులో జరిగిన థగ్‌లైఫ్‌ ప్రీ రిలీజ్‌ కార్యక్రమ వేదిక వద్ద భారీ సంఖ్యలో గుమిగూడారు. కమల్‌పై నల్ల ఇంకు పోస్తామంటూ హెచ్చరించారు. తమకు భయపడి ఆయన వేడుకకు గైర్హాజరయ్యారని ఎద్దేవా చేశారు.

కర్ణాటకలో బహిష్కరణ హెచ్చరికలు

మరోవైపు.. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర యడియూరప్ప, తదితరులు కమల్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. విజయేంద్ర యడియూరప్ప స్పందిస్తూ..‘కమల్ హాసన్‌ సంస్కారం లేని వ్యక్తి. కన్నడ భాషను అవమానించారు. మాతృ భాషను ప్రేమించడం మంచిదే కానీ, ఇతర భాషలను అవమానించడం సంస్కారం కాదు. కన్నడ, సహా అనేక భారతీయ భాషల్లో నటించిన కమల్ హాసన్, తన ప్రసంగంలో తమిళాన్ని గొప్పగా చెబుతూ శివరాజ్‌కుమార్‌ను అందులో భాగం చేయడం కన్నడను అవమానించడమే కాదు.. అహంకారం ఉన్నట్టు స్పష్టమవుతోంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కమల్ హాసన్ వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర వివాదానికి దారితీశాయి. క్షమాపణలు లేదా సినిమా బహిష్కరణతో ఈ వివాదం ముగియనుందో లేదో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.