|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇలాంటివి ఎన్నో చూశాను.. తప్పు చేస్తేనే క్షమాపణ అడుగుతాను: కన్నడ వివాదంపై కమల్ హాసన్

Published: 30-05-2025, 9:11 AM
ఇలాంటివి ఎన్నో చూశాను.. తప్పు చేస్తేనే క్షమాపణ అడుగుతాను: కన్నడ వివాదంపై కమల్ హాసన్

కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ‘థగ్ లైఫ్’ సినిమా నిషేధం ముప్పు నేపథ్యంలో కమల్ హాసన్ తాజాగా స్పందించారు. తనకు తప్పుంటేనే క్షమాపణ అడుగుతానని స్పష్టం చేశారు.

Key Points

1

కమల్ హాసన్ 'థగ్ లైఫ్' సినిమా వివాదంపై స్పందించారు.

2

కన్నడ భాష మూలంపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పేందుకు నిరాకరించారు.

4

జూన్ 5న విడుదల కానున్న 'థగ్ లైఫ్' భవిష్యత్తు అనిశ్చితంగా మారింది.

థగ్ లైఫ్ సినిమాపై వివాదం

తాను నటించిన థగ్ లైఫ్ మూవీని నిషేధిస్తామని బెదిరిస్తున్నా.. కమల్ హాసన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అతడు క్షమాపణ చెప్పడానికి శుక్రవారం (మే 30) వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. అయినా కమల్ మాత్రం అందుకు నిరాకరిస్తూనే ఉన్నాడు.

కన్నడ భాష పుట్టిందే తమిళం నుంచి అని కామెంట్స్ చేసిన కమల్ హాసన్ పై కన్నడ సంఘాలు మండిపడుతూనే ఉన్నాయి. అతని సినిమాలను నిషేధించాలని సాక్షాత్తూ ఆ రాష్ట్ర మంత్రి శివరాజ్ తంగదగియే కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు లేఖ రాయడం గమనార్హం. ఈ నేపథ్యంలో థగ్ లైఫ్ సినిమాను తాము నిషేధిస్తామని ఛాంబర్ వార్నింగ్ ఇచ్చింది.

కమల్ హాసన్ స్పందన

దీనిపై తాజాగా కమల్ హాసన్ మరోసారి స్పందించాడు. “ఇది ప్రజాస్వామ్యం. నేను చట్టం, న్యాయాన్ని విశ్వసిస్తాను. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళపై నా ప్రేమ నిజం. ఏదో ఎజెండా ఉన్న వాళ్లే దానిని శంకిస్తారు. ఇలాంటి బెదిరింపులు గతంలో ఎన్నో చూశాను. నేను తప్పు చేస్తే క్షమాపణ చెబుతాను. చేయకపోతే చెప్పను” అని కమల్ స్పష్టం చేశాడు.

దీనిపై కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, కన్నడ సంఘాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. జూన్ 5వ తేదీనే థగ్ లైఫ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో వాళ్లు చెప్పినట్లుగా ఆ సినిమాను నిషేధిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ నిషేధిస్తే మాత్రం కమల్ పాన్ ఇండియా మూవీకి పెద్ద దెబ్బ పడినట్లే అని చెప్పొచ్చు.

సినిమా నిషేధం ముప్పు

మణిరత్నం డైరెక్షన్ లో 37 ఏళ్ల తర్వాత కమల్ హాసన్ నటించిన మూవీ ఈ థగ్ లైఫ్. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగానే కన్నడ భాష గురించి కమల్ స్పందించాడు.

అసలు తమిళం నుంచే కన్నడ పుట్టిందని అతడు అనడంతో కన్నడ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అప్పటి నుంచే కమల్ సినిమాలను నిషేధించాలన్న డిమాండ్లు మొదలయ్యాయి. రోజురోజుకూ వివాదం ముదురుతున్నా.. కమల్ మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో ఇది ఎంత వరకూ వెళ్తుందో చూడాలి.

కమల్ హాసన్ వైఖరితో కన్నడ సంఘాల ప్రతిస్పందన, ‘థగ్ లైఫ్’ సినిమా భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.