
📌 Key Points
- రాఘవ లారెన్స్ ‘కాంచన 4’ రిలీజ్ కు సిద్ధం! ఈసారి మరింత భయం, నవ్వు గ్యారెంటీ!
- మార్చి 13న ‘కాంచన 4’ విడుదల కానుందనే వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్!
- ప్రమోషన్స్ లేకుండానే లారెన్స్ సార్ సర్ ప్రైజ్ ప్లాన్! అంచనాలు లేకుండానే బ్లాక్ బస్టర్ కొట్టే ఆలోచనలో మేకర్స్.
- కాంచన సిరీస్ లో ముని, కాంచన, గంగ, కాంచన 3 సినిమాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే!
రాఘవ లారెన్స్ కాంచన సిరీస్ తో మరోసారి ప్రేక్షకులను భయపెట్టడానికి వస్తున్నాడు. కాంచన 4 త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కాంచన 4 రిలీజ్ ఎప్పుడో తెలుసా?
Kanchana 4: ముని సిరీస్ కి ఆడియన్స్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. హారర్ అండ్ కామెడీ కంటెంట్ తో వచ్చిన ఈ సిరీస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. రాఘవ లారెన్స్ హీరోగా చేస్తూ దర్శకత్వం వచ్చిన ఈ సిరీస్ లో ఇప్పటికే నాలుగు సినిమాలు వచ్చాయి. ముని, కాంచన, గంగ, కాంచన 3. ఈ మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.
ఇప్పుడు మరోసారి ఆడియన్స్ భయపెట్టడానికి కాంచన 4(Kanchana 4)తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు రాఘవ లారెన్స్. ఇప్పటివరకు వచ్చిన సినిమాల కంటే ఎక్కువగా భయపెట్టి, మరింత నవ్వించేలా ఉంటుందట ఈ సినిమా. నిజానికి చాలా కాలం క్రితమే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది కానీ చిత్రీకరణ చాలా ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యింది ఈ సినిమా.
లారెన్స్ సార్ సర్ ప్రైజ్ ప్లాన్!
ఈ సినిమా మార్ఛి 13న విడుదల కానున్నట్టుగా తెలుస్తోంది. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే, ఈ సినిమా ఒకటి ఉందని చాలా మందికి తెలియదు. విడుదలకు ఇంకా 10 రోజులే ఉంది ఇంకా కూడా ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. అందుకే, ఈ సినిమా విషయంలో చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఆడియన్స్. అసలు ఆ డేట్ నిజమా కాదా అని కూడా అనుకుంటున్నారు.
ప్రమోషన్స్ లేకుండానే రిలీజా?
అయితే, కాంచన 4 విషయంలో కావాలనే మేకర్స్ ఇలా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే, అంచనాలు లేకుండా విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట. కాంచన సమయంలో కూడా ఎలాంటి హంగామా లేకుండా వచ్చి భారీ విజయాన్ని సాధించాడు లారెన్స్. ఇప్పుడు కాంచన 4 విషయంలో కూడా అదే ప్లాన్ చేస్తున్నాడట. అందుకే, విడుదల వారం ముందు వరకు ఎలాంటి ప్రమోషన్స్ చేయొద్దని ఫిక్స్ అయ్యారట. మరి లారెన్స్ ప్లాన్ ఈ సినిమా విషయంలో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
కాంచన 4 రిలీజ్ దగ్గర పడుతుంది. లారెన్స్ సర్ ఏం చేస్తారో చూడాలి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


