|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Kanchana 4: కాంచన 4 లోకి మరో ఇద్దరు యంగ్ బ్యూటీస్.. భయాన్ని పోగొట్టేందుకు వస్తున్నారంటూ పోస్ట్

Published: 03-11-2025, 8:13 AM
Kanchana 4: కాంచన 4 లోకి మరో ఇద్దరు యంగ్ బ్యూటీస్.. భయాన్ని పోగొట్టేందుకు వస్తున్నారంటూ పోస్ట్

రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రాబోతున్న హర్రర్ ప్రాంచైజీ ‘కాంచన 4’పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే పూజా హెగ్డే, నోరా ఫతేహి వంటి తారలు జాయిన్ అవగా, తాజాగా స్వక్ష అయ్యర్, హిమబిందు కూడా చిత్రంలోకి అడుగుపెట్టారు. వీరు హాస్యంతో భయాన్ని పోగొట్టేందుకు వస్తున్నారంటూ మేకర్స్ పోస్ట్ విడుదల చేశారు.

Key Points

1

'కాంచన 4' షూటింగ్ సగానికి పైగా పూర్తి అయ్యింది.

2

పూజా హెగ్డే, నోరా ఫతేహి ఇప్పటికే చిత్రంలో భాగమయ్యారు.

4

హాస్యంతో భయాన్ని మరచిపోయేలా చేస్తామని మేకర్స్ పోస్టర్‌లో పేర్కొన్నారు.

కాంచన 4 లోకి కొత్త అందాల రాక

హర్రర్ ప్రాంచైజీలో రాబోతున్న ‘కాంచన 4’ కోసం ప్రేక్షకులు ఎంతో ఈరగ్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే కాంచన ప్రాంచైజీలో వచ్చిన.. కాంచన 2, కాంచన 3 సూపర్ హిట్ సక్సెస్ అందుకోగా.. ఇప్పుడు కాంచన 4ను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చే పనిలో ఉన్నాడు రాఘవ లారెన్స్. ఈయన స్వీయ డైరెక్షన్‌లో తెరకెక్కబోతున్న కాంచన 4 షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తి అయినట్లు తెలుస్తుండగా.. వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగానే తాజాగా ఈ చిత్రంలో పూజా హెగ్డే, నోరా ఫతేహి భాగం అయినట్లు తెలుపుతూ పోస్టర్లు రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా మరో ఇద్దరు ముద్దుగుమ్మలు ఇందులో భాగం అయినట్లు తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ‘అందమైన మనోహరమైన గార్జీయస్ ఏంజెల్స్ స్వక్ష అయ్యర్ అండడ్ హిమబిందు.. హాస్యంతో మీ భయాన్ని మరచిపోయేలా చెయ్యడానికి వస్తున్నాను.. కాంచన 4 ఒక అందమైన కుటుంబం త్వరలో మిమ్మల్ని కలుస్తుంది’ అంటూ షేర్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటున్నాయి. లింక్

భయాన్ని పోగొట్టేందుకు హాస్య తారలు

ప్రాంచైజీలో స్టార్స్ సందడి

కాంచన 4 చిత్రానికి వస్తున్న వరుస అప్డేట్స్ ప్రేక్షకులలో ఉత్సుకతను రేకెత్తిస్తున్నాయి. స్టార్ క్యాస్ట్‌తో పాటు హాస్యాన్ని జోడించి భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.