|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘Kannappa’ Box Office Collection Day 1: కన్నప్ప ఫస్ట్ డే కలెక్షన్స్ ?

Published: 28-06-2025, 6:46 AM
'Kannappa' Box Office Collection Day 1: కన్నప్ప ఫస్ట్ డే కలెక్షన్స్ ?

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప సినిమా ఇటీవల విడుదలైంది. సినిమాకు మిశ్రమ స్పందన లభించగా, మొదటి రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి.

Key Points

1

మంచు విష్ణు నటించిన 'కన్నప్ప' సినిమా రిలీజ్ అయింది.

2

మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు అంచనా.

4

వీకెండ్ కావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

కన్నప్ప సినిమా రిలీజ్ మరియు టాక్

మంచు విష్ణు ( Machu vishnu) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కన్నప్ప ( Kannappa). ఈ కన్నప్ప సినిమా.. రిలీజ్ అయి మిక్స్డ్ టాక్.. తెచ్చుకుంటుంది. ఈ సినిమాలో హీరోగా మంచు విష్ణు చేయగా… మోహన్ బాబు, ప్రభాస్, కాజల్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటివాళ్ళు కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాకు మోహన్ బాబు ( Mohan babu) ప్రొడ్యూసర్ గా ఉండగా.. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు.

మొదటి రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

కన్నప్ప సినిమా భక్తి నేపథ్యంలో రిలీజ్ అయి… మంచి కలెక్షన్స్ రాబడుతోంది. అయితే ఈ నేపథ్యంలోనే మొదటి రోజు కలెక్షన్స్.. పైన సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కర్లు కొడుతోంది. తొలి రోజు కన్నప్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 కోట్లు వసూలు చేసినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.

వీకెండ్ లో వసూళ్ల అంచనాలు

ఇక ఇండియాలో అన్ని భాషల్లో కలిపి 10 కోట్లు వచ్చినట్లు చెబుతున్నారు. వీకెండ్ కావడంతో ఇవాళ అలాగే రేపు కలెక్షన్స్ మళ్లీ పెరిగే ఛాన్సులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక ఇప్పటివరకు 15 లక్షల టికెట్లు అమ్ముడు అయినట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమాకు ప్రభాస్ కోసం మాత్రమే వెళుతున్నట్లు చాలామంది చెబుతున్నారు.

మొత్తంగా, కన్నప్ప సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వసూళ్లు ఆశాజనకంగా ఉన్నాయి. వీకెండ్ లో మరింత పెరిగే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.