
మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా థియేటర్లలో విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. తొలి రోజు నుంచే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. రెండు రోజుల్లోనే సినిమా ఎంత వసూలు చేసిందో తెలుసుకుందాం.
Key Points
మంచు విష్ణు 'కన్నప్ప' రెండు రోజుల్లో రూ. 16.35 కోట్లు వసూలు చేసింది.
మొదటి రోజు రూ. 9.35 కోట్లు, రెండవ రోజు రూ. 7 కోట్లకు పైగా వసూలు.
ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి తారాగణం సినిమాకు ప్రాచుర్యం కల్పించింది.
విష్ణు మంచు కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించే చిత్రంగా 'కన్నప్ప' నిలవనుందని భావిస్తున్నారు.
కన్నప్ప బాక్సాఫీస్ వసూళ్లు
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా థియేటర్లలోకి వచ్చిన కన్నప్ప బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా రాణిస్తోంది. మొదటి రోజు రూ. 9.35 కోట్ల నికర వసూళ్లు సాధించింది. అయితే రెండో రోజు రూ.7 కోట్లకు పైగా రాబట్టింది. దీంతో రెండు రోజుల్లో కలిపి ఇండియా వ్యాప్తంగా రూ. 16.35 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. రాబోయే రోజుల్లోనూ ఇదే జోరు కొనసాగితే విష్ణు మంచు కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కన్నప్ప నిలవనుంది. గతంలో మంచు విష్ణు చిత్రాలైన జిన్నా, మోసగాళ్లు సినిమాలకు చాలా తక్కువ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాలో ప్రభాస్ రుద్ర పాత్రలో మెప్పించగా.. మంచు విష్ణు తిన్నడు పాత్రలో ఆకట్టుకున్నారు. ఈ మూవీలో విష్ణు సరసన ప్రీతి ముకుందన్ కనిపించింది. అంతేకాకుండా మోహన్ బాబు, అర్పిత్ రంకా, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, శివ బాలాజీ, కౌశల్ మంద, రాహుల్ మాధవ్, దేవరాజ్, ముఖేష్ రిషి, రఘు బాబు, మధు కీలక పాత్రల్లో నటించారు.
రెండు రోజుల కలెక్షన్స్
తారాగణం మరియు సినిమా విశేషాలు
మొత్తంమీద, కన్నప్ప సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే, మంచు విష్ణు కెరీర్ లో ఇది ఒక మైలురాయి అవుతుంది.


