
యంగ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్ ‘కన్నప్ప’ సినిమా తర్వాత బంపర్ ఆఫర్ అందుకుంది. మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీతో కలిసి నటించనుంది. ‘సర్వం మాయ’ అనే సినిమాలో ఆమె పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు.
Key Points
‘కన్నప్ప’ సినిమా తర్వాత ప్రీతి ముకుందన్‌కు బంపర్ ఆఫర్.
మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీతో కలిసి నటించనున్నారు.
‘సర్వం మాయ’ అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
క్రిస్మస్ కానుకగా సినిమా విడుదల కానుంది.
ప్రీతి ముకుందన్‌కు బంపర్ ఆఫర్
యంగ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్(Preethi Mukundan)కు పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడు ‘ఓం భీమ్ బుష్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మెప్పించలేకపోయింది. డిజాస్టర్‌గా నిలవడంతో ప్రీతికి అనుకున్నంత పాపులారిటీ దక్కలేదు. అయినప్పటికీ ఈ అమ్మడు భారీ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’(Kannappa)లో హీరోయిన్‌గా నటించే అవకాశం కొట్టేసింది. ఈ చిత్రాన్ని మోహన్ బాబు(Mohan Babu) అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ బ్యానర్‌పై నిర్మించారు.
నివిన్ పౌలీతో కలిసి నటన
అయితే ఇందులో అన్ని అక్షయ్ కుమార్(Akshay Kumar), మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్(Kajal Aggarwal), బ్రహ్మానందం, వంటి స్టార్స్ కీలక పాత్రలో నటించారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 27న థియేటర్స్‌లో విడుదలైంది. మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీసు వద్ద రాణిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ప్రీతి ముకుందన్ ఓ బంపర్ ఆఫర్ అందుకుంది. మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ(Nivin Pauly) మూవీలో ప్రీతి హీరోయిన్‌గా నటిస్తోంది. అఖిల్ సత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.
‘సర్వం మాయ’ సినిమా విడుదల
ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. క్రిస్మస్ కానుకగా థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈక్రమంలో.. మూవీ మేకర్స్ ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ ప్రీతి ముకుందన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ చిత్రానికి ‘సర్వం మాయ’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలిపింది. ఈ పోస్ట్‌కు ‘‘పక్కనే ఉన్న దెయ్యం నివిన్ పౌలీ’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఇక విడుదలైన పోస్టర్‌లో ఆయన నామాలు పెట్టుకుని వెరైటీగా చూస్తూ కనిపించారు. ఇక ప్రీతి పోస్ట్ చూసిన నెటిజన్లు ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
ప్రీతి ముకుందన్ కెరీర్ లో మరో మంచి అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. ‘సర్వం మాయ’ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెస్తుందని ఆశిద్దాం.


