|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

`కన్నప్ప` హార్డ్ డ్రైవ్‌ దొంగతనం తమ్ముడు మనోజ్‌కి లింక్‌.. రఘు, చరితలపై మంచు విష్ణు సంచలన ఆరోపణలు

Published: 30-05-2025, 1:49 PM
`కన్నప్ప` హార్డ్ డ్రైవ్‌ దొంగతనం తమ్ముడు మనోజ్‌కి లింక్‌.. రఘు, చరితలపై మంచు విష్ణు సంచలన ఆరోపణలు

మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా VFX కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్ దొంగతనం కలకలం రేపుతోంది. రఘు, చరిత అనే ఇద్దరు ఉద్యోగులపై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనకు మంచు మనోజ్ కూడా సంబంధం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Key Points

1

మంచు విష్ణు కన్నప్ప సినిమా VFX హార్డ్ డ్రైవ్ దొంగతనం గురించి పోలీసులకు ఫిర్యాదు.

2

రఘు, చరిత అనే ఇద్దరు ఉద్యోగులు హార్డ్ డ్రైవ్ దొంగిలించారని ఆరోపణ.

4

కోట్ల విలువైన VFX కంటెంట్‌తో హార్డ్ డ్రైవ్‌ను కొరియర్ ద్వారా పంపడంపై ప్రశ్నలు.

కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్ దొంగతనం

మంచు విష్ణు, మంచు మోహన్‌బాబు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం `కన్నప్ప`. సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

ఇందులో మంచు విష్ణుతోపాటు ప్రభాస్‌, మోహన్‌లాల్‌, అక్షయ్‌ కుమార్‌ వంటి స్టార్స్ నటించడంతో సినిమాపై భారీ హైప్‌ నెలకొంది. వచ్చే నెలలో(June 27) సినిమా కూడా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో షాకిచ్చే విషయం ఇటీవల బయటకు వచ్చింది.

`కన్పప్ప` వీఎఫ్‌ఎక్స్ చేసిన కంటెంట్‌ ని ముంబయింకి చెందిన హెచ్‌ఐవీఈ స్టూడియోస్‌ సంస్థ హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో ఉన్న మంచు విష్ణు ప్రొడక్షన్‌ ఆఫీస్‌ 24 ఫ్రేమ్స్ సంస్థకి డీటీడీసీ కొరియర్‌ ద్వారా పంపించారు.

రఘు, చరితపై మంచు విష్ణు ఆరోపణలు

ఈ డ్రైవ్‌ని తీసుకుని రఘు, చరిత అనే ఇద్దరు పారిపోయారని, ఇప్పుడు కనిపించడం లేదని `కన్నప్ప` సినిమాకి సంబంధించిన ఎగ్జిక్యూటీవ్‌ ప్రొడ్యూసర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయం లేట్‌గా బయటకు వచ్చింది.

ఈ క్రమంలో ఈ దొంగతనంపై ఇప్పటికే మంచు విష్ణు సోషల్‌ మీడియా ద్వారా స్పందించారు. ఇది పెద్ద కుట్ర అని తెలిపారు. అదే సమయంలో శివయ్యా మాకే ఎందుకు ఈ పరీక్ష అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు.

తాజాగా దీనిపై స్పందించారు మంచు విష్ణు. `కన్నప్ప` చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఈ విషయంపై మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. ఆఫీస్‌లో పనిచేసే రఘు, చరితనే ఈ హార్డ్ డ్రైవ్ దొంగిలించారని ఆయన స్పష్టం చేశారు.

మంచు మనోజ్ పాత్రపై అనుమానాలు

అయితే వీరిద్దరు మంచు మనోజ్‌ ఇంట్లోనే పని చేస్తారని, వాళ్లు సొంతంగానే ఈ పని చేశారా? ఎవరైనా చెబితే చేశారా? అనేది తెలియాల్సి ఉందన్నారు. పరోక్షంగా తమ్ముడు మనోజ్‌పై మంచు విష్ణు ఆరోపణలు చేశారు. ఆయన చెప్పడం వల్లే వీళ్లు చేశారా? అనే అనుమానాన్ని మంచు విష్ణు వ్యక్తం చేయడం రచ్చ అవుతుంది.

ఇదిలా ఉంటే ఎప్పుడో రెండు నెలల క్రితం పంపిన ఈ హార్డ్ డ్రైవ్‌ ఇప్పుడు ఎలా మిస్‌ అయ్యింది? ఇక కోట్ల విలువ చేసే సినిమాకి సంబంధించిన హార్డ్ డ్రైవ్‌ని కొరియర్‌ ద్వారా పంపించడం ఏంటి? ఆ సమాచారం మంచు విష్ణుకి తెలియకపోవడమేంటి?

అదే సమయంలో ప్రస్తుతం టీమ్‌ పని చేస్తున్న కంపెనీ అడ్రస్‌కి కాకుండా మరో ఆఫీస్‌ అడ్రెస్‌కి ఆ హార్డ్ డ్రైవ్‌లను పంపడమేంటనేది అనుమానంగా మారంది. మరి ఏం జరగబోతుందో మున్ముందు తేలనుంది.

కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్ దొంగతనం వెనుక ఉన్న నిజం ఏంటో తెలియాల్సి ఉంది. మంచు విష్ణు ఆరోపణలు, మనోజ్ పాత్రపై అనుమానాలు సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ఈ ఘటన త్వరలోనే వెలుగులోకి వస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.