|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Kannappa making video: కన్నప్ప మేకింగ్ వీడియో..బాబోయ్ ఇంత కష్టపడ్డారా?

Published: 21-06-2025, 12:01 PM
Kannappa making video: కన్నప్ప మేకింగ్ వీడియో..బాబోయ్ ఇంత కష్టపడ్డారా?

మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో రియల్ లొకేషన్స్, అద్భుతమైన విజువల్స్, మరియు నటీనటుల కష్టపడిన తీరు కనిపిస్తున్నాయి.

Key Points

1

మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా మేకింగ్ వీడియో విడుదలైంది.

2

రియల్ లొకేషన్స్‌లో చిత్రీకరించిన అద్భుతమైన విజువల్స్.

4

కొన్ని సన్నివేశాలు నిరాశపరిచాయని నెటిజన్ల అభిప్రాయం.

కన్నప్ప మేకింగ్ వీడియో విడుదల

మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నేడు జరుగుతోంది. ఈ ఈవెంట్‌లో కన్నప్ప సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేశారు. కాగా ఈ వీడియో ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంది. సినిమాలోని చాలా సన్నివేశాలను రియల్ లొకేషన్స్‌లో తీసినట్టు కనిపిస్తోంది. విజువల్స్ చూడ్డానికి ఎంతో బాగున్నాయి. సినిమాను దాదాపు విదేశాల్లోనూ షూట్ చేసినట్టు కనిపిస్తోంది. అంతే కాకుండా సినిమా కోసం మంచు విష్ణు మాత్రమే కాకుండా ఇతర నటీనటులు సైతం ప్రాణం పెట్టి నటించినట్టు కనిపిస్తోంది.

గుర్రాలపై చేసే స్టంట్స్ కోసం చాలా కష్టపడినట్టు ఉంది. అయితే కొన్ని సన్నివేశాలు మాత్రం డిసప్పాయింట్ చేసే విధంగా కనిపిస్తున్నాయి. కొన్ని సీన్లు షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్‌లా ఉన్నాయంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే కన్నప్ప ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో ప్రభాస్ ముఖ్యమైన పాత్రలో నటించారు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, మలయాల స్టార్ మోహన్ లాల్ సైతం సినిమాలో నటించారు. దీంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను కన్నప్ప రీచ్ అవుతాడా లేదా చూడాలి.

రియల్ లొకేషన్స్ మరియు విజువల్స్

నటీనటుల ప్రదర్శన మరియు నెటిజన్ల అభిప్రాయాలు

మొత్తంగా, కన్నప్ప సినిమాపై అంచనాలు ఉన్నాయి. మేకింగ్ వీడియో ప్రకారం, సినిమాలోని విజువల్స్ మరియు నటన ఆకట్టుకునేలా ఉన్నాయి. చివరి నిర్ణయం ప్రేక్షకులదే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.