|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Kannappa : ఎవ్వరి ఫ్యాన్స్ నిరాశచెందరు.. ‘కన్నప్ప’పై మరింత హైప్ పెంచేసిన డైరెక్టర్

Published: 24-06-2025, 10:53 AM
Kannappa : ఎవ్వరి ఫ్యాన్స్ నిరాశచెందరు.. ‘కన్నప్ప’పై మరింత హైప్ పెంచేసిన డైరెక్టర్

విష్ణు మంచు నటించిన ‘కన్నప్ప’ సినిమా జూన్ 27న విడుదల కానుంది. దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ చిత్రంపై అంచనాలను మరింత పెంచే విషయాలు వెల్లడించారు. ఈ సినిమాలో మోహన్ బాబు, ప్రభాస్ వంటి నటీనటులు కూడా నటించారు.

Key Points

1

విష్ణు మంచు 'కన్నప్ప' జూన్ 27న విడుదలవుతుంది.

2

దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ చిత్రీకరణ అనుభవాలను పంచుకున్నారు.

4

అన్ని పాత్రలూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

‘కన్నప్ప’ విడుదల తేదీ ప్రకటన

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న గ్రాండ్ థ్రియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ మీడియాతో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ‘‘కన్నప్ప’ కోసం ప్రతీ ఒక్కరూ అద్భుతంగా పని చేశారు. అందరూ ఎంతో అంకిత భావంతో సెట్స్ మీద వర్క్ చేశారు. వారి వల్లే నా పని చాలా ఈజీగా మారిపోయింది. అక్షయ్, మోహన్‌లాల్, ప్రభాస్, మోహన్ బాబు, విష్ణు, బ్రహ్మానందం ఇలా అందరితో పని చేయడం మరిచిపోలేని అనుభూతి. మోహన్ బాబు ఈ వయసులోనూ ఎంతో ప్యాషనేట్‌గా పని చేశారు.

నిర్మాతగా ఒకలా ఉండేవారు.. నటించేటప్పుడు ఇంకోలా అనిపించేవారు. ‘కన్నప్ప’ మీద ఇంత వరకు వచ్చిన కన్నడ, తెలుగు, హిందీ చిత్రాలన్నీ చూశాను. అన్నింటినీ గమనించాను. వారిలానే నేను కూడా న్యాయం చేయాలని అనుకున్నాను. విష్ణు కన్నప్ప పాత్రకు వంద శాతం న్యాయం చేశారు. చివరి గంట అద్భుతంగా ఉంటుంది. ప్రభాస్ పాత్ర ఎంతో పవర్ ఫుల్‌గా ఉంటుంది. ఇందులో ఎవరి క్యారెక్టర్ కూడా అలా వచ్చి ఇలా వెళ్లేలా ఉండదు. అన్ని పాత్రలు ప్రేక్షకులపై కచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తాయి. ఎవ్వరి ఫ్యాన్స్ కూడా ఈ మూవీని చూసి నిరాశచెందరు. ఇప్పటి వరకు చాలా మందికి ఈ మూవీని చూపించాం. అందరూ అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు’ అని తెలిపారు.

దర్శకుడితో ప్రత్యేక ఇంటర్వ్యూ

నటీనటుల పాత్రల గురించి వివరణ

చివరిగా, దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ‘కన్నప్ప’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, ఎవరి అభిమానులూ నిరాశపోరని విశ్వాసం వ్యక్తం చేశారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.