
అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం తీవ్ర దుఃఖాన్ని కలిగించింది. ఈ విషాద సంఘటన నేపథ్యంలో మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ సినిమా ట్రైలర్ విడుదల వాయిదా పడింది.
Key Points
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత కన్నప్ప ట్రైలర్ విడుదల వాయిదా
మంచు విష్ణు సంతాపం వ్యక్తం చేస్తూ ట్రైలర్ విడుదల వాయిదా వేశారు
ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు
విమాన ప్రమాదం నేపథ్యం
అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. 242 మందితో ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో కన్నప్ప సినిమా బృందం కీలక నిర్ణయం తీసుకుంది. కన్నప్ప ట్రైలర్ విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
కన్నప్ప ట్రైలర్ వాయిదా
ఈ మేరకు మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తనను తీవ్రంగా కలిచి వేసిందని… హీరో మంచు విష్ణు వెల్లడించారు. ఈ విమాన ప్రమాదంలో గాయపడిన అలాగే మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఇక సంఘటన నేపథ్యంలో సంతాపంగా….కన్నప్ప ట్రైలర్ విడుదలను ఎల్లుండికి వాయిదా వేస్తున్నట్లు మంచు విష్ణు ప్రకటన చేశారు.
మంచు విష్ణు ప్రకటన
అలాగే రేపు ఇండోర్ లో జరిగే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా రద్దు చేస్తున్నట్లు వివరించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు… పోస్ట్ పెట్టారు మంచి విష్ణు. కాగా ఈ విమాన ప్రమాదంలో ఇప్పటివరకు 110 మంది మరణించినట్లు చెబుతున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో కన్నప్ప చిత్ర బృందం తీసుకున్న నిర్ణయం సముచితమే. బాధిత కుటుంబాలకు మన ప్రగాఢ సానుభూతి తెలియజేద్దాం.


