
బాలీవుడ్ నటి షెఫాలీ జరివాలా గుండెపోటుతో మరణించారు. ‘కాంటా లగా’ పాటతో ఆమె ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ‘ముజ్సే షాదీ కరోగి’ సినిమాతో పాటు హిందీ బిగ్ బాస్ 13లో కూడా ఆమె కనిపించారు.
Key Points
'కాంటా లగా' పాటతో పాపులర్ అయిన షెఫాలీ జరివాలా గుండెపోటుతో మరణించారు.
42 ఏళ్ల షెఫాలీ జరివాలా 'ముజ్సే షాదీ కరోగి' సినిమాలో నటించారు.
నటి మృతికి సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
షెఫాలీ జరివాలా మృతి
బాలీవుడ్ నటి, కాంటా లగా సాంగ్ ఫేమ్ షెఫాలీ జరివాలా (42) గుండెపోటుతో మరణించారు. శుక్రవారం రాత్రి ఆమె తీవ్ర అస్వస్థతకు గురికావడంతో భర్త పరాగ్ త్యాగి వెంటనే ఆమెను అంధేరిలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే నటి మృతి చెందినట్లు వెల్లడించారు. పోస్టుమార్టమ్ కోసం ఆమె మృతదేహాన్ని కూపర్ ఆస్పత్రికి తరలించారు. నటి మృతి పట్ల సెలబ్రిటీలు, అభిమానులు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు.
‘కాంటా లగా’ గర్ల్ ప్రయాణం
నటి ప్రయాణం సాగిందిలా.. షెఫాలీ జరివాలా 2002లో వచ్చిన కాంటా లగా సాంగ్‌తో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. అప్పటినుంచి అభిమానులు ఆమెను కాంటా లగా గర్ల్ అనే పిలుచుకుంటున్నారు. ఈ గుర్తింపుతోనే ముజ్సే షాదీ కరోగి చిత్రంలో షెఫాలీకి నటించే ఛాన్స్ వచ్చింది. అలాగే కన్నడలో హుడుగరు మూవీలో యాక్ట్ చేశారు. బేబీ కమ్‌నా అనే వెబ్ సిరీస్‌లోనూ కనిపించారు. హిందీ బిగ్‌బాస్ 13వ సీజన్‌లోనూ పాల్గొన్నారు. షెఫాలి.. 2004లో సంగీత దర్శకుడు హర్మీత్ సింగ్‌ను పెళ్లాడారు. కానీ ఈ బంధం ఎంతోకాలం నిలవలేదు. 2009లో విడిపోయారు. అనంతరం 2015లో నటుడు పరాగ్ త్యాగిని రెండో పెళ్లి చేసుకున్నారు.
సినీ ప్రముఖుల సంతాపం
షెఫాలీ జరివాలా అకాల మరణం సినీ ప్రేమికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె సినీ ప్రయాణం ఎల్లప్పుడూ జ్ఞాపకం లో ఉంటుంది.


