|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Kantara Chapter 1: కాంతార చాప్టర్-1 కలెక్షన్స్.. జైలర్‌, లియో రికార్డ్స్ గల్లంతు!

Published: 13-10-2025, 9:40 AM
Kantara Chapter 1: కాంతార చాప్టర్-1 కలెక్షన్స్.. జైలర్‌, లియో రికార్డ్స్ గల్లంతు!

రిషబ్ శెట్టి నటించిన ‘కాంతార చాప్టర్-1’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. 11 రోజుల్లోనే రూ.600 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. రజినీకాంత్ ‘జైలర్’, విజయ్ ‘లియో’ రికార్డులను అధిగమించి కొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఈ సినిమా కలెక్షన్ల వివరాలపై ఒక లుక్.

Key Points

1

'కాంతార చాప్టర్-1' 11 రోజుల్లో రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

2

ఈ సినిమా రజినీకాంత్ 'జైలర్', విజయ్ 'లియో' రికార్డులను అధిగమించింది.

4

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది.

కాంతార చాప్టర్-1: కలెక్షన్ల సునామీ

రిషబ్ శెట్టి కాంతార ప్రీక్వెల్‌ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే పలు సూపర్ హిట్ సినిమాలను రికార్డ్స్ తుడిచిపెట్టిన ఈ మూవీ అరుదైన మార్క్ చేరుకుంది. ఈ సినిమా రిలీజైన 11 రోజుల్లోనే రూ.600 కోట్ల క్లబ్‌లో చేరింది. రెండో వారంలోనూ కలెక్షన్స్ పరంగా తగ్గేదేలే అంటోంది. ఇప్పటికే కన్నడలో కేజీఎఫ్-2 తర్వాత రెండో స్థానంలో కాంతార చాప్టర్-1 నిలిచింది. ఈ వారంలో పెద్ద సినిమాలేవీ లేకపోవడం మరింత కలిసి రానుంది.

జైలర్, లియో రికార్డులు బ్రేక్

కాంతారా చాప్టర్ 1 ఆదివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ.615 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో రజినీకాంత్ జైలర్(రూ.605 కోట్లు), విజయ్ లియో(రూ.606 కోట్లు) లాంటి బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ను అధిగమించింది. అంతేకాకుండా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా ఘనత సాధించింది.  ఈ మూవీకంటే విక్కీ కౌశల్, రష్మిక నటింటిన ఛావా (రూ.808 కోట్లు) తొలిస్థానంలో ఉంది. అయితే త్వరలోనే ఈ రికార్డ్‌ను సైతం బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది. దేశవ్యాప్తంగా చూస్తే రూ.439 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా.. రూ.525 కోట్ల గ్రాస్ రాబట్టింది.అంతేకాకుండా ఓవర్‌సీస్‌లో అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది.

ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు

రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 2022 బ్లాక్‌బస్టర్ కాంతారకు ప్రీక్వెల్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.  ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు.

మొత్తం మీద, ‘కాంతార చాప్టర్-1’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఇతర పెద్ద చిత్రాల రికార్డులను బద్దలు కొట్టి, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ విజయపరంపరను కొనసాగిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.