|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఈ ఓటీటీలోకే కాంతార చాప్టర్ 1.. డిజిటల్ రైట్స్ కు రికార్డు రేటు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published: 03-10-2025, 12:47 AM
ఈ ఓటీటీలోకే కాంతార చాప్టర్ 1.. డిజిటల్ రైట్స్ కు రికార్డు రేటు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కాంతార చాప్టర్ 1 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న వేళ, దీని ఓటీటీ రైట్స్, స్ట్రీమింగ్ తేదీపై ఆసక్తి నెలకొంది. అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు డిజిటల్ హక్కులను దక్కించుకుంది.

Key Points

1

కాంతార చాప్టర్ 1 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.

2

ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది.

4

నవంబర్ మొదటి వారంలో ఓటీటీ రిలీజ్ అయ్యే అవకాశం.

కాంతార చాప్టర్ 1 ఓటీటీ రైట్స్ ఎవరికి?

బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది లేటెస్ట్ మూవీ ‘కాంతార చాప్టర్ 1’. దసరా సందర్భంగా గురువారం (అక్టోబర్ 2) ఈ సినిమా రిలీజైంది. భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లు అదరగొడుతోంది. సూపర్ హిట్ రివ్యూస్ అందుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ దండయాత్ర కొనసాగించే అవకాశముంది. మరి ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఎంతకు దక్కించుకుందో చూద్దాం.

2022లో వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచిన కాంతారకు ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్ 1 ను తెరకెక్కించాడు రిషబ్ శెట్టి . ఆయనే హీరో కూడా. గురువారం వచ్చిన మూవీకి ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. మరోవైపు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడనే ప్రశ్న కూడా వస్తోంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది.

కాంతార చాప్టర్ 1 ఓటీటీ రేటు

డిజిటల్ హక్కులకు భారీ రేటు

కాంతార సూపర్ హిట్ కావడంతో కాంతార చాప్టర్ 1 సినిమాకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం టఫ్ కాంపిటీషన్ నడిచింది. చివరకు అమెజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా రూ.125 కోట్ల భారీ మొత్తం చెల్లించి మరీ ఓటీటీ హక్కులు దక్కించుకుంది. ఇక కాంతార 1 శాటిలైట్స్ రైట్స్ రూ.80 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలిసింది.

కాంతార చాప్టర్ 1 ఓటీటీ రిలీజ్ డేట్ పై ఇప్పటి నుంచే బజ్ నెలకొంది. అయితే మూవీకి వస్తున్న పాజిటివ్ టాక్, ఆదరణ కారణంగా ఓటీటీ రిలీజ్ లేటయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా అయితే సౌత్ సినిమాలు థియేటర్లో రిలీజైన నాలుగు వారాల తర్వాత, హిందీ మూవీస్ 8 వారాల తర్వాత ఓటీటీలోకి వస్తున్నాయి.

ఓటీటీలో కాంతార చాప్టర్ 1 ఎప్పుడు?

అయితే కాంతార చాప్టర్ 1 లాంగ్ రన్ పై ఓటీటీ రిలీజ్ ఆధారపడి ఉంటుంది. నాలుగు వారాల విండో తర్వాత రిలీజ్ చేయాలనుకుంటే ఈ సినిమా కన్నడ, తమిళ, తెలుగు, మలయాళం భాషల్లో నవంబర్ ఒకటో వారంలో ఓటీటీలోకి రిలీజ్ కానుంది. ఆ తర్వాత రెండు లేదా మూడు వారాలకు హిందీలో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.

ఇలాంటి సినిమాను థియేటర్లలోని బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఆడియన్స్ ఎక్కువగా ప్రిఫర్ చేసే అవకాశముంది. కాంతార చాప్టర్ 1 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ పై అమెజాన్ ప్రైమ్ వీడియో ఎలాంటి అనౌన్స్ మెంట్ చేస్తుందో చూడాలి.

కాంతార చాప్టర్ 1 ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో రికార్డు ధరకు దక్కించుకుంది. సినిమా థియేట్రికల్ రన్ ఆధారంగా నవంబర్ మొదటి వారంలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.