|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Kantara Chapter 1: నిజమైన మాస్టర్ పీస్.. కాంతార: ఛాప్టర్ 1 సినిమాపై ప్రభాస్, సందీప్ ప్రశంసలు

Published: 03-10-2025, 3:48 AM
Kantara Chapter 1: నిజమైన మాస్టర్ పీస్.. కాంతార: ఛాప్టర్ 1 సినిమాపై ప్రభాస్, సందీప్ ప్రశంసలు

నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి తెరకెక్కించిన ‘కాంతార: ఛాప్టర్ 1’ సినిమాకు విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసలు అందుకోగా, తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాపై తమ మెప్పును తెలిపారు. వారి ప్రశంసల వివరాలు ఇక్కడ చూడండి.

Key Points

1

నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి 'కాంతార: ఛాప్టర్ 1' సినిమాతో మరో భారీ విజయాన్ని అందుకున్నారు.

2

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ వంగా సినిమాను చూసి ప్రశంసలు కురిపించారు.

4

ప్రభాస్, రిషబ్ శెట్టి నటన, విజయం సాధించిన చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రశంసలు

Kantara Chapter 1: కాంతార: ఛాప్టర్ 1 సినిమాతో మరో భారీ విజయాన్ని అందుకున్నాడు నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి. దసరా పండుగ కానుకగా అక్టోబర్‌ 2న విడుదలైన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది. డివోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాపై ఆడియన్స్ నుంచి, స్టార్స్ నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటికే, ఈ సినిమా గురించి మ్యాన్ అఫ్ మాసెస్ జూనియర్‌ ఎన్టీఆర్‌ రియాక్ట్‌ అయ్యారు. సినిమా చాలా బాగుంది అంటూ ట్వీట్(Kantara Chapter 1) చేశాడు. తాజాగా ఈ లిస్టులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌, దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా చేరారు.

Sagar: తెరపైకి సింగరేణి కార్మికుల జీవితం.. హీరోగా సాగర్.. పాన్ ఇండియా లెవల్లో కొత్త సినిమా

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రియాక్షన్

రిలీజ్ రోజే సినిమా చూసి సినిమాపై ప్రశంసలు కురిపించారు. దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కాంతార చాప్టర్‌1 గురించి మాట్లాడుతూ.. “కాంతార: చాప్టర్ 1 నిజమైన మాస్టర్ పీస్. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి సినిమా చూడలేదు. ఇది సినిమాటిక్ ప్రభంజనం. స్వచ్ఛమైన భక్తి అంటే ఎలా ఉంటుందో సినిమాలో చూపించారు. ఈ సినిమా రిషబ్ శెట్టి వన్-మ్యాన్ షో. ఒంటి చేత్తో ముందుకు తీసుకెళ్లాడు. ఇక కాంతార బీజీఎమ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే” అంటూ రాసుకొచ్చాడు.

కాంతార: ఛాప్టర్ 1 విజయ రహస్యం

ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. “కాంతార: ఛాప్టర్ 1 అనేది ఒక బ్రిలియంట్ మూవీ. నటీనటుల ప్రతిభ చాలా బాగుంది. కాంతార1 ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది. ఈ సినిమాకు ప్రధాన బలం అంటే రిషబ్ శెట్టి నటన. నిర్మత విజయ్ కిరగండూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంత భారీ విజయం సాధించిన చిత్ర యూనిట్‌కు నా శుభాకాంక్షలు” అంటూ పోస్ట్ పెట్టాడు ప్రభాస్. ప్రస్తుతం ఆయన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

మొత్తంమీద, ‘కాంతార: ఛాప్టర్ 1’ సినిమా రిషబ్ శెట్టి దర్శకత్వ ప్రతిభకు, నటనకు నిదర్శనం. ప్రభాస్, సందీప్ వంగా వంటి ప్రముఖుల ప్రశంసలతో ఈ చిత్రం విజయం మరింత ఖాయమైంది. ఈ సినిమా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఒక మైలురాయిగా నిలవడం పక్కా.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.