
కన్నడ సూపర్ హిట్ కాంతార సినిమాకు ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న కాంతార చాప్టర్ -1 సినిమా పై అంచనాలు పెరిగాయి. జాతీయ అవార్డు గ్రహీత దిల్జిత్ దోసాంజ్ ఈ సినిమాలో ఒక పాట పాడారు. దసరా కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.
Key Points
కాంతార చాప్టర్ -1 దసరా కానుకగా విడుదల
జాతీయ అవార్డు గ్రహీత దిల్జిత్ దోసాంజ్ పాట పాడారు
రిషబ్ శెట్టి దర్శకత్వంలో అత్యధిక బడ్జెట్ సినిమా
అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్త విడుదల
కాంతార చాప్టర్ -1 విడుదల తేదీ
కన్నడ ఇండస్ట్రీలో నుంచి బ్లాక్‌బస్టర్ మూవీ కాంతార. ఈ సినిమాను రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రం కర్ణాటకలోనే కాకుండా అన్ని దేశవ్యాప్తంగా అనూహ్య విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని హోంబలే సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే. కాగా.. తాజాగా ఆ చిత్రానికి ప్రీక్వెల్‌గా కాంతారా చాప్టర్– 1 పేరుతో అత్యంత భారీ బడ్జెట్‌లో రూపొందిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తయిన ఈ సినిమా దసరా కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక పాటను ఇటీవల రికార్డ్ చేశారు.
దిల్జిత్ దోసాంజ్ పాట
ఈ సాంగ్‌ను జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత నటుడు, గాయకుడు దిల్జిత్ దోసాంజ్ పాడడం విశేషం. ఈ సందర్భంగా ఈయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాంతార వంటి అద్భుతమైన చిత్రాన్ని రూపొందించిన తన సోదరుడు రిషబ్ శెట్టికి తన ప్రణామాలు అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి తనకు ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. అదేమిటి అన్నది ఇప్పుడే చెప్పలేనని అయితే వారాహరూపం అనే పాట ధ్వనిస్తున్నప్పుడు మాత్రం ఆనందభాష్వాలు వచ్చాయన్నారు. ఇకపోతే త్వరలో తెరపైకి రానున్న కాంతార చాప్టర్ –1 లో పాడిన అనుభవం మరువలేనిదన్నారు.
సినిమా విశేషాలు
ఈ సందర్భంగా ఈ చిత్ర సంగీత దర్శకుడు బి. అజనీష్ లోకనాథ్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అని అన్నారు. ఒక్క రోజులోనే ఆయన నుంచి తాను చాలా నేర్చుకున్నట్లు చెప్పారు. దీంతో నటుడు దర్శకుడు రిషబ్ శెట్టి, గాయకుడు దిల్జిత్ దోసాంజ్, హోంబలే ఫిల్మ్స్ కాంబోలో రూపొందిన ఈ చిత్ర ఆల్బమ్‌పై ఆసక్తి నెలకొంది. కాగా ఈ చిత్రం అక్టోబర్ రెండో తేదీన ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది.
కాంతార చాప్టర్ -1 సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. దిల్జిత్ దోసాంజ్ పాటతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో విజయం సాధిస్తుందో చూడాలి.


