|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Kantara Chapter 1 Movie: కాంతార ప్రీక్వెల్‌ సెట్‌లో ప్రమాదం.. నిర్మాణ సంస్థ క్లారిటీ!

Published: 15-06-2025, 10:19 AM
Kantara Chapter 1 Movie: కాంతార ప్రీక్వెల్‌ సెట్‌లో ప్రమాదం.. నిర్మాణ సంస్థ క్లారిటీ!

రిషబ్ శెట్టి నటించిన కాంతార సినిమా ప్రీక్వెల్ షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగిందన్న వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ స్పందించింది.

Key Points

1

కాంతార చాప్టర్ 1 సెట్ లో ప్రమాదం జరిగిందన్న వార్తలకు హోంబలే ఫిల్మ్స్ క్లారిటీ ఇచ్చింది.

2

మాణి జలాశయం వద్ద ఉన్న సెట్ గాలి వల్ల దెబ్బతింది.

4

షూటింగ్ ప్రమాద రహితంగా జరుగుతోందని హామీ ఇచ్చింది.

సెట్‌లో ప్రమాదంపై నిర్మాణ సంస్థ స్పందన

రిషబ్‌ శెట్టి కాంతార చాప్టర్-1 సెట్‌లో ప్రమాదం జరిగిందని వస్తున్న వార్తలపై చిత్ర నిర్మాణ సంస్థ స్పందించింది.  ఈ సినిమా సెట్‌లో ప్రమాదం చోటు చేసుకుందని.. 30 మంది కళాకారులతో ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయిందని మీడియాలో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ క్లారిటీ ఇచ్చింది. తాజాగా హోంబలే ఫిల్మ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత ఆదర్శ్‌ ఈ అంశంపై మాట్లాడారు.

ప్రస్తుతం కాంతార చాప్టర్‌ 1 షూటింగ్‌ కర్ణాటకలోని మాణి జలాశయం వద్ద జరుగుతోంది. ఈ సినిమా సెట్‌లో ప్రమాదం చోటు చేసుకుందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు. చిత్రీకరణలో భాగంగా జలాశయం వద్ద తాము సెట్‌ వేశామని.. అయితే వీపరీతమైన గాలి వీయడంతో అది పాడైపోయిందని వెల్లడించారు. ఈ ఘటన జరిగినప్పుడు సెట్‌లో నటీనటులు కానీ.. సిబ్బంది లేరన్నారు. ఈ రోజు యథావిధిగా షూటింగ్‌ జరుగుతున్నట్లు వెల్లడించారు. షూటింగ్ జరిగే ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. గజ ఈతగాళ్లు, స్కూబా డైవర్స్‌ సమక్షంలోనే మూవీ షూట్‌ చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రకటనలో ఉదయం నుంచి వస్తున్న రూమర్స్‌కు నిర్మాణ సంస్థ చెక్ పెట్టేసింది.

గాలి వల్ల సెట్ దెబ్బతింది

షూటింగ్ యథావిధిగా కొనసాగుతోంది

కాగా.. 2022లో సూపర్‌ హిట్‌గా నిలిచిన కాంతార మూవీకి  ప్రీక్వెల్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. హీరో రిషభ్‌ శెట్టి దర్శకత్వంలోనే తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌గా రూపొందిస్తున్నారు. ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరంగదూర్‌ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌ నెలలో  విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ ప్లాన్ చేస్తున్నారు.

కాంతార చాప్టర్ 1 షూటింగ్ సమయంలో జరిగిన ఘటనపై నిర్మాణ సంస్థ స్పష్టతనిచ్చింది. సెట్ దెబ్బతిన్నప్పటికీ, ప్రమాదం ఏమీ లేదని, షూటింగ్ కొనసాగుతుందని తెలిపింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.