|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ట్రైలర్‌ రెడీ: కాంతార: చాప్టర్ 1

Published: 22-09-2025, 2:20 AM
ట్రైలర్‌ రెడీ: కాంతార: చాప్టర్ 1

రిషబ్ శెట్టి నటించిన ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రం ట్రైలర్ సెప్టెంబర్ 22న విడుదల కానుంది. ఈ చిత్రంలో భారీ యుద్ధ సన్నివేశం ప్రధాన ఆకర్షణ. ప్రభాస్, హృతిక్ రోషన్ వంటి ప్రముఖ తారలు ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.

Key Points

1

రిషబ్ శెట్టి నటించిన ‘కాంతార: చాప్టర్ 1’ ట్రైలర్ రిలీజ్!

2

ప్రభాస్, హృతిక్ రోషన్, శివకార్తికేయన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ట్రైలర్ విడుదల చేస్తున్నారు!

4

భారతీయ సినిమా చరిత్రలోనే అతిపెద్ద యుద్ధ సన్నివేశం ఈ చిత్రంలో ఉంది!

కాంతార: చాప్టర్ 1 ట్రైలర్ రిలీజ్ డేట్

రిషబ్‌ శెట్టి హీరోగా నటించి, స్వీయ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కాంతార: చాప్టర్‌1’. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటించగా, గుల్షన్‌ దేవయ్య, జయరాం ఇతర ప్రధాన  పాత్రల్లో నటించారు. హోంబలే ఫిలింస్‌ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ను రేపు (సెప్టెంబరు 22) రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ వెల్లడించి, ఓ కొత్త  పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. కాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను ప్రభాస్, హిందీ ట్రైలర్‌ను హృతిక్‌ రోషన్, తమిళ ట్రైలర్‌ను శివకార్తికేయన్, మలయాలం ట్రైలర్‌ను పృథ్వీరాజ్‌ సుకు మారన్‌లు డిజిటల్‌గా విడుదల చేయనున్నారు.

స్టార్స్ విడుదల చేస్తున్న ట్రైలర్

‘‘ఈ సినిమా కోసం 3వేలమంది ప్రజలు, 500 మంది యోధులు  పాల్గొన్న ఓ భారీ యుద్ధ సన్నివేశాన్ని తెరకెక్కించాం. ఇందుకోసం 25 ఎకరాల స్థలంలో ఓ పట్టణాన్ని నిర్మించి, దాదాపు 50 రోజుల  పాటు షూటింగ్‌ చేశాం. భారతీయ సినిమా చరిత్రలోనే అతి పెద్ద సన్నివేశాల్లో ఈ యుద్ధ సన్నివేశం ఒకటిగా నిలుస్తుంది.

పాన్ ఇండియా రిలీజ్

‘కాంతార’ (‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘కాంతార: ఛాప్టర్‌ 1’ చిత్రం తెరకెక్కింది) విజయాన్ని కొనసాగించడంలో హోంబలే ఫిలింస్‌ రాజీ పడటం లేదు. ఆడియన్స్‌కు థియేటర్స్‌లో గొప్ప అనుభూతిని ఇచ్చేలా ఈ సినిమా ఉంటుంది’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. కన్నడతో  పాటు హిందీ, తెలుగు, మలయాళ, తమిళ, బెంగాలీ, ఇంగ్లిష్‌ భాషల్లో  ‘కాంతార: ఛాప్టర్‌ 1’ చిత్రం అక్టోబరు 2న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది.

‘కాంతార: చాప్టర్ 1’ ట్రైలర్‌తో అంచనాలు మరింత పెరిగాయి. అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.