
టాలీవుడ్‌లో యువ హీరో తిరువీర్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు! వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న ఈ హీరో ఇప్పుడు ‘ఓ సుకుమారి’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ రివ్యూలు ఎలా ఉన్నాయో చూద్దాం!
Key Points
తిరువీర్ 'ఓ సుకుమారి' జూలై 17న విడుదల. మరో హిట్టు పక్కా అంటున్నారు!
ఐశ్వర్య రాజేష్, తిరువీర్ కొత్త కాన్సెప్ట్ తో ఆకట్టుకున్నారు. కెమిస్ట్రీ హైలైట్!
మీడియాతో పాటు సెన్సార్ సభ్యులు సినిమాపై ప్రశంసలు. హిట్ టాక్!
రెండు నెలలకో సినిమాతో దూసుకెళ్తున్న తిరువీర్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్!
తిరువీర్ ‘మాస్’ ప్లానింగ్! రెండు నెలలకో హిట్టు!
టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఏటా రెండు మూడు సినిమాలతో ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ లో పాపం ప్రతాప్ మూవీతో ప్రేక్షకులను అలరించిన తిరువీర్ ఇప్పుడు ఓ.. సుకుమారి అనే చిత్రంతో రానున్నాడు. ఈ మూవీ జూలై 17న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీలో తిరువీర్ సరసన హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ నటించింది. ఈ చిత్రానికి భరత్ దర్శన్ దర్శకత్వం వహించారు. అలాగే శివం భాజే సినిమా తర్వాత గంగా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మహేశ్ రెడ్డి మూలీ ఈ చిత్రాన్ని నిర్మించారు.
‘ఓ.. సుకుమారి’ మూవీ ట్రైలర్ ను టాలీవుడ్ స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీ పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. రొమాన్స్, పల్లెటూరి అందాలు, హిలేరియస్ కామెడీతో మూవీ సాగుతుందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఓ అమ్మాయి గుండె వేగం సాధారణ స్థాయిని దాటితే ఆమె శరీరం నుంచి ఎలక్ట్రిక్ షాక్ జనరేట్ అవుతుంది. అలాంటి అమ్మాయి లైఫ్ లోకి ఓ అబ్బాయి వచ్చాక ఏం జరిగింది..? అనే కొత్త కాన్సెప్ట్ తో ఈ మూవీని తెరకెక్కించారు.
‘ఓ సుకుమారి’ కథేంటి? ఫస్ట్ రివ్యూ ఎలా ఉంది?
స్టోరీ విషయానికి వస్తే.. సీతాపురం గ్రామంలో సుకుమారి( ఐశ్వర్య రాజేష్) చేసే అల్లరి పనులతో గ్రామస్థులు ఇబ్బంది పడుతుంటారు. సుకుమారికి పెళ్లి చేస్తేనే దారికి వస్తుందని గ్రామ పెద్దలు నిర్ణయించి యాదగిరి(తిరువీర్) అనే యువకుడితో పెళ్లి కుదుర్చుతారు. అయితే పెళ్లి తర్వాత సుకుమారి నుంచి యాదగిరికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. సుకుమారికి ఉన్న సమస్య ఏంటి..? అనేదే సినిమా కథ. ఇక ఈ సినిమా చూసిన మీడియా ప్రముఖులు, సెన్సార్ సభ్యులు.. సినిమాను వినోదభరితంగా రూపొందించిన తీరుపై ప్రశంసించారట.
ఐశ్వర్య రాజేష్, తిరువీర్ కెమిస్ట్రీ.. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ!
అలాగే మూవీలో ఐశ్వర్య రాజేశ్, తిరువీర్ పాత్రలు బాగా వచ్చాయని ఈ మేరకు చిత్ర యూనిట్ ను ప్రత్యేక అభినందించారు అని సమాచారం. మొత్తానికి తిరువీర్ ఖాతాలో మరో హిట్టు సినిమా గ్యారంటీ అని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం తిరువీర్ భగవంతుడు అనే సినిమాతో పాటు మరో రెండు సినిమాలు కూడా పూర్తి చేస్తున్నాడు. అవి కూడా త్వరలోనే విడుదల కానున్నాయి.
‘ఓ సుకుమారి’ తో తిరువీర్ మరోసారి తన మార్క్ చూపించడం ఖాయం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం మా పేజీని చూస్తూ ఉండండి!

