|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వారణాసిలో మహేష్ ఒక్కడే కాదు.. ఎద్దుపై ఎంట్రీ ఇచ్చిన తెలుగు హీరోలు ఇంకెవరో తెలుసా?

Published: 19-11-2025, 8:07 AM
వారణాసిలో మహేష్ ఒక్కడే కాదు.. ఎద్దుపై ఎంట్రీ ఇచ్చిన తెలుగు హీరోలు ఇంకెవరో తెలుసా?

మహేష్ బాబు ‘వారణాసి’ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత అభిమానుల్లో కొత్త చర్చ మొదలైంది. ఎద్దుపై కూర్చుని త్రిశూలం పట్టుకున్న మహేష్ పోస్టర్ వైరల్ కాగా, ఇలాంటి సీన్లు గతంలో పలువురు తెలుగు హీరోలు చేశారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఈ విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.

Key Points

1

మహేష్ బాబు 'వారణాసి' పోస్టర్‌లో ఎద్దుపై కూర్చున్న లుక్ వైరల్ అయ్యింది.

2

బెల్లంకొండ శ్రీనివాస్ 'సాక్ష్యం' సినిమాలోనూ ఎద్దుపై ఇలాంటి సీన్ చేశారు.

4

చిరంజీవి, నాగార్జున వంటి సీనియర్ హీరోలు కూడా ఎద్దులతో యాక్షన్ సీక్వెన్స్‌లు చేశారు.

మహేష్ బాబు ‘వారణాసి’ పోస్టర్ వైరల్

మహేష్ బాబు – రాజమౌళి కాంబో మూవీ వారణాసి. ఈ భారీ బడ్జెట్ మూవీ టైటిల్ టీజర్ లాంచ్ ఈవెంట్ రీసెంట్ గా రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. వారణాసి ఈవెంట్‌లో చిత్రం టైటిల్ గ్లింప్స్‌తో పాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్‌ను కూడా అధికారికంగా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్‌లో మహేష్ బాబు ఎద్దుపై కూర్చొని త్రిశూలం పట్టుకొని విలన్ల పైకి దూసుకెళుతున్నట్టు చూపించారు. పైగా ఈవెంట్ లో మహేష్ ఎంట్రీ కూడా ఎద్దుపైన ప్లాన్ చేసేవరకు.. ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యారు. ఇక మహేష్ బాబు ఎద్దుపై వస్తున్న పోస్టర్ కూడా వైరల్ అయ్యింది. ఈ పోస్టర్ ను మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. వైరల్ చేస్తున్నారు.

మహేష్ బబు ఫస్ట్ లుక్ బయటకు వచ్చిన తరువాతనెటిజన్లలో మరో చర్చ మొదలైంది. ఇలా ఎద్దుపై ఫోజ్ ఇచ్చిన హీరోలు చాలామంది ఉన్నారని కామెంట్స్ చేస్తూనే.. మహేష్ ను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో పోల్చుతున్నారు. “మా బెల్లం బాబు ఇదే సీన్ ఎప్పుడో చేసి చూపించాడు” అంటూ టీజ్ చేస్తున్నారు. . హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన సాక్ష్యం సినిమాలో ఆయన కూడా ఎద్దుపై కూర్చొని త్రిశూలం చేత పట్టుకుని ప్రత్యర్థులపైకి వెళ్లే సీన్ ఉందని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.

ఎద్దుపై ఎంట్రీ: బెల్లంకొండ, పవన్ కళ్యాణ్

టాలీవుడ్‌లో ఇదే తరహా సీన్లు గతంలో కూడా కనిపించాయి. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమాలో కూడా ఇదే తరహా సీన్ కనిపిస్తుంది. విలన్లతో ఫైట్ చేసే టైమ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీదకు పశువుల గుంపు వస్తుంది. వాటిని తప్పించుకున్న పవన్ కళ్యాన్.. అందోలో ఒకఎద్దునుపట్టుకుని… దాని మీదకు ఎక్కి స్వారీ చేస్తూ వెళ్తాడు. ఈసీన్ కు థియేర్లో విజిల్స్ కూడా పడ్డాయి.

సీనియర్ హీరోల మాస్ ఎంట్రీలు

అలాగే గోపీచంద్ ప్రధాన పాత్రలో వచ్చిన భీమాలో హీరోలు ఎద్దులపై కనిపించే సన్నివేశాలు ఉన్నాయి. గోపీచంద్ పోలీస్ డ్రెస్ లో ఎద్దుపై కూర్చుని స్వరీ చేసిన సీన్ కనిపిస్తుంది. ఇక వీళ్లే కాదు.. గతంలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోలు కూడా ఎద్దులతో కూడిన యాక్షన్ సీక్వెన్స్‌లు చేశారు. కానీ ప్రస్తుతం మహేష్ బాబు పోస్టర్‌లో కనిపించిన లుక్‌ మాత్రం ప్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది.

మహేష్ బాబు ఎద్దుపై ఎంట్రీ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. అయితే, తెలుగు సినిమా చరిత్రలో ఎద్దులతో కూడిన పవర్ ఫుల్ సీన్లు కొత్త కాదని ఈ కథనం స్పష్టం చేస్తుంది. ఈ పోకడ భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.