
📌 Key Points
- టెక్నో పోవా 8 జూన్ 11న భారత మార్కెట్లోకి విడుదల కానుంది.
- ఈ ఫోన్ 8,000mAh భారీ బ్యాటరీతో వస్తుందని ధృవీకరించబడింది.
- మీడియాటెక్ డైమెన్సిటీ 7100 చిప్‌సెట్, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.
- నథింగ్ ఫోన్ల మాదిరిగా మ్యాట్రిక్స్-స్టయిల్ డాట్స్ లైటింగ్ ఎలిమెంట్.
టెక్నో లవర్స్‌కు శుభవార్త! భారత మార్కెట్లోకి టెక్నో పోవా 8 స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. జూన్ 11న లాంచ్ కానున్న ఈ ఫోన్, భారీ 8,000mAh బ్యాటరీతో పాటు అధునాతన ఫీచర్లతో వస్తుందని కంపెనీ ప్రకటించింది. దీని డిజైన్, కీలక స్పెసిఫికేషన్లు ఇప్పటికే లీక్ అయ్యాయి.
టెక్నో పోవా 8: లాంచ్ తేదీ, డిజైన్ వివరాలు
Tecno Pova 8 Launch : టెక్నో లవర్స్ కు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లోకి సరికొత్త టెక్నో పోవా 8 స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. లాంచ్ తేదీని కంపెనీ ధృవీకరించింది. ఈ ఫోన్ వచ్చే వారం రానుంది. రీడిజైన్ రియర్ కెమెరా మాడ్యూల్, భారీ బ్యాటరీతో పాటు, కంపెనీ ఫోన్ డిజైన్ వివరాలను కూడా వెల్లడించింది. అలాగే, ఈ స్మార్ట్‌ఫోన్‌లో చిప్‌సెట్, ఛార్జింగ్ కెపాసిటీ, సాఫ్ట్‌వేర్ వెర్షన్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లతో సహా అనేక హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్ల వివరాలు కూడా బయటకు వచ్చాయి.
భారత్‌లో టెక్నో పోవా 8 లాంచ్ : టెక్నో పోవా 8 జూన్ 11న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో (Tecno Pova 8 Launch) రాబోయే ఈ మోడల్‌కు సంబంధించి బ్యానర్ కూడా ఉంది. ఈ టీజర్ స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ను ముందుగానే రివీల్ చేసింది. ఇందులో 8,000mAh బ్యాటరీ ఉంటుందని ధృవీకరించింది.
నివేదికల ప్రకారం.. గ్రీన్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో టెక్నో పోవా 8 ఫోన్, టెక్నో పోవా 7 మాదిరిగానే రియర్ కెమెరా లేఅవుట్‌తో రానుంది. అయితే, ఈ కొత్త మోడల్‌లో కెమెరా మాడ్యూల్‌లోనే మ్యాట్రిక్స్-స్టయిల్ డాట్స్ లైటింగ్ ఎలిమెంట్ ఉన్నట్టుగా కనిపిస్తోంది.
కీలక ఫీచర్లు, స్పెసిఫికేషన్లు లీక్
Read Also : Redmi Turbo 5 : ఫోన్ కాదు పవర్‌బ్యాంక్ బాస్.. 100W ఛార్జింగ్, 7,560mAh బ్యాటరీతో రెడ్‌మి టర్బో 5 వస్తోందోచ్!
టెక్నో పోవా 8 ఫీచర్లు, స్పెషిఫికేషన్లు : నథింగ్ ఫోన్ 3 , నథింగ్ ఫోన్ 4a ప్రోలోని గ్లిఫ్ మ్యాట్రిక్స్ సిస్టమ్ మాదిరిగా ఉన్నట్లు కనిపిస్తోంది. నోటిఫికేషన్‌ల కోసం మైక్రో-ఎల్ఈడీ గ్రిడ్ ఉంటుంది. యూజర్లు స్క్రీన్ ఆన్ చేయకుండానే అప్‌డేట్‌లను చూడొచ్చు.
టెక్నో పోవా 8 ఫోన్ 6GB ర్యామ్, ఆండ్రాయిడ్ 16తో మీడియాటెక్ డైమెన్సిటీ 7100 చిప్‌సెట్‌తో గీక్‌బెంచ్‌లో కనిపించింది. అలాగే, 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో టెక్నో ఫోన్ FCC సర్టిఫికేషన్ డేటాబేస్‌లో కనిపించినట్లు సమాచారం.
బ్యాటరీ, ఛార్జింగ్, కనెక్టివిటీ వివరాలు
ఈ ఫోన్ 3G, 4G, 5G నెట్‌వర్క్ సపోర్ట్, బ్లూటూత్, NFC, Wi-Fi,GPS కనెక్టివిటీతో కూడా వస్తుందని అంచనా.
దేశీయ మార్కెట్‌ను బట్టి NFC ఆప్షన్ మారొచ్చు. రాబోయే ఈ ఫోన్ 6GB+128GB, 8GB+128GB, 8GB+256GB వేరియంట్లలో రావొచ్చు.
మొత్తం మీద, టెక్నో పోవా 8 భారీ బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్, వినూత్న డిజైన్‌తో మార్కెట్లో సంచలనం సృష్టించే అవకాశం ఉంది. జూన్ 11న దీని పూర్తి వివరాలు, ధర వెల్లడి కానున్నాయి.


