|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గుండెలు పిండే విషాదం: ప్రముఖ మలయాళ నటుడు సలీం కుమార్ అకాల మరణం!

Published: 07-06-2026, 5:16 AM
గుండెలు పిండే విషాదం: ప్రముఖ మలయాళ నటుడు సలీం కుమార్ అకాల మరణం!
  • మలయాళ కమెడియన్ సలీం కుమార్ 57 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
  • శ్వాస సంబంధిత అనారోగ్యం, న్యుమోనియా, గుండెపోటు మరణానికి కారణం.
  • కొచ్చిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు సమాచారం.
  • నేడు కేరళలో సలీం కుమార్ అంత్యక్రియలు భారీ ఎత్తున నిర్వహించనున్నారు.

మలయాళ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కమెడియన్, నటుడు సలీం కుమార్ 57 ఏళ్ల వయసులో కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యలు, న్యుమోనియాతో బాధపడుతూ గుండెపోటు రావడంతో ఆయన మరణించారు. ఈ వార్త సినీ లోకాన్ని, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

మలయాళ ఇండస్ట్రీలో విషాద ఛాయలు

Mollywood : మలయాళ ఇండస్ట్రీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.. ఇండస్ట్రీలో కమెడియన్గా ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకున్న నటుడు సలీం కుమార్ నిన్న కన్నుమూశారు. ఈయన గత కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది.. తీవ్రమైన న్యుమోనియాతో బాధపడుతూ కొచ్చిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో గుండె పోటు రావడంతో ఆయన శనివారం రాత్రి ఆసుపత్రిలోనే మరణించారు. స్త్రీలు పేరున నటుడు కావడంతో ఆయన మరణ వార్త విన్న పలువురు సినీ ప్రముఖులతో పాటుగా అభిమానులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆలయాల ఇండస్ట్రీ గొప్ప నటుడు నీ కోల్పోయింది అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. సలీం భౌతికకాయాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళిన కుటుంబ సభ్యులు అభిమానుల సందర్శనార్థం ఇవాళ మధ్యాహ్నం వరకి అక్కడే ఉంచి సాయంత్రం లోపల మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు అని సమాచారం. ఇప్పటికే ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు సలీం భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. అయితే ఈ నేడు జరగనున్న అంత్యక్రియల కార్యక్రమానికి భారీ ఎత్తున అభిమానులు హాజరుకానున్నట్లు సమాచారం..

మలయాళ ఇండస్ట్రీలో పలు సినిమాలలో అలాగే తమిళనాడులో కూడా నటించడం ప్రముఖ నటుడు సలీం కారణంగా నిన్న రాత్రి మరణించిన విషయం తెలిసిందే. 57 ఏళ్ల వయసులోనే ఆయన మరణించడంతో పలువురు అభిమానులు బాధపడుతున్నారు.. విలక్షణ పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఇప్పుడు చనిపోయిన వార్త విని అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ సంతాపం తెలిపారు.. సలీం చనిపోవడానికి కాలేయ వ్యాధి కారణం అని తెలుస్తుంది. ఈయన గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారని తెలిమి ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కూడా మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి నటుడుగా ఎదిగిన ఆయన సినీ ప్రస్థానం ఎంతో గొప్పది. ఇప్పటివరకు ఆయన నటించిన సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. నటుడిగా మిమిక్రీ ఆర్టిస్టుగా జనాల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు సలీం. నేడు సాయంత్రం ఈయన అంత్యక్రియలు కేరళలో జరగనున్నాయి.. కార్యక్రమానికి భారీ ఎత్తున సినీ ఇండస్ట్రీ నుంచి ప్రముఖులతో పాటుగా అభిమానులు కూడా హాజరుకానున్నారని మీడియా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

సలీం కుమార్ మరణానికి కారణం

సినీ ప్రముఖులు, అభిమానుల సంతాపం

​1969 అక్టోబర్ 9న వడక్కన్ పరవూర్‌లో జన్మించారు సలీం కుమార్. కుటుంబార్దిక పరిస్థితులు కారణంగా ఈయన పెద్దగా చదువుకోలేకపోయాడని తెలుస్తుంది. ఆ తర్వాత ఫేమస్ అవ్వాలన్న కోరికతో మిమిక్రి ఆర్టిస్ట్ గా మారారు. కొచ్చిన్ కళాభవన్ వేదికలపై మిమిక్రీ కళాకారుడిగా మొదలుపెట్టారు. ఆ విధంగా కెరియర్ ని మొదలుపెట్టిన సలీం ఎన్నో స్టేజీల పైన తన మిమిక్రీతో జనాలని ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఆయన సినిమాల్లోకి అడుగుపెట్టి తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ జనాలలో నటుడిగా ముద్ర వేసుకున్నారు. ‘ఇష్టం నూరొట్టం’ సినిమాతో వెండితెరకు పరిచయమైనా, 2000లో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘తెన్కాశిపట్టణం ‘ మూవీ అతని కెరియర్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన తర్వాత దాదాపు 300 పైగా సినిమాలను చేసి నటుడిగా ఎన్నో అవార్డులను రివార్డులను సొంతం చేసుకున్నాడు.. అలాంటి గొప్ప వ్యక్తి ఇప్పుడు మన మధ్య లేకపోవడం బాధాకరం..

మిమిక్రీ ఆర్టిస్ట్ నుండి గొప్ప నటుడిగా ఎదిగిన సలీం కుమార్ మరణం మలయాళ సినీ లోకానికి తీరని లోటు. ఆయన విలక్షణ నటన, హాస్యం ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నేడు ఆయన అంత్యక్రియలు కేరళలో జరగనున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.