
📌 Key Points
- పవన్ కళ్యాణ్ కెరీర్ బెస్ట్ మూవీగా ఉస్తాద్ భగత్ సింగ్?
- శ్రీలీల, రాశి ఖన్నా గ్లామర్ డోస్ అదిరింది!
- దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్రాణం పోసింది
- మార్చి 19న గ్రాండ్ రిలీజ్.. థియేటర్లలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హంగామా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ భారీ అంచనాలతో విడుదలైంది. గబ్బర్ సింగ్ తర్వాత ఈ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం!
పవన్ కళ్యాణ్ మాస్ అవతార్!
Ustaad Bhagat Singh Review In Telugu: గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా భారీ అంచనాలతో ఇవాళ థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందో నేటి ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూలో తెలుసుకుందాం.
టైటిల్: ఉస్తాద్ భగత్ సింగ్
నటీనటులు: పవన్ కల్యాణ్, శ్రీలీల, రాశీ ఖన్నా, పార్తిబన్, రావు రమేశ్, గౌతమి, కేఎస్ రవికుమార్, టెంపర్ వంశీ తదితరులు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: అయానకా బోస్
ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్
హరీష్ శంకర్ మ్యాజిక్ రిపీట్?
నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
విడుదల తేది: మార్చి 19, 2026
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్‌లో గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఆ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ హరీష్ శంకర్. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన గబ్బర్ సింగ్ కాంబో పవన్ కల్యాణ్-హరీష్ శంకర్ నుంచి ఓ సినిమా వస్తుందంటే ఎలాంటి అంచనాలు ఉంటాయో అలాగే ఉస్తాద్ భగత్ సింగ్‌పై ఏర్పడ్డాయి.
డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల , బ్యూటిపుల్ రాశీ ఖన్నా హీరోయిన్లుగా చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ ఇవాళ (మార్చి 19) ఉగాది పండుగ సందర్బంగా థియేటర్లలో చాలా గ్రాండ్‌గా విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? పవన్-హరీష్ కాంబో వర్కౌట్ అయిందా? గబ్బర్ సింగ్‌లా మ్యాజిక్ క్రియేట్ చేసిందా? లేదా? అనేది నేటి ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ లో తెలుసుకుందాం.
ఉస్తాద్ భగత్ సింగ్ కథ ఏంటి?
ఇంతకీ ఉస్తాద్ భగత్ సింగ్ ఎవరు? ముఖ్యమంత్రిని కాపాడటానికి నాగప్ప కొడుకు మిస్సింగ్‌కు సంబంధం ఏంటీ? సీఎంకు భగత్ సింగ్‌కు ఉన్న సంబంధం ఏంటీ? భయంకరమైన టెర్రరిస్ట్‌తో నాగప్ప వేసిన ప్లాన్ ఏంటీ? ఈ క్రమంలో లీల (శ్రీలీల), శ్లోక (రాశీ ఖన్నా) పాత్రలు ఏంటీ? ఉస్తాద్ భగత్ సింగ్ అసలు పేరు ఏంటీ? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.
ఓజీ, భీమ్లా నాయక్, వకీల్ సాబ్ వంటి తరహలో సీరియల్స్ రోల్స్ కాకుండా ఈ మూవీలో వింటేజ్ పవన్ కల్యాణ్‌ను చూపించే ప్రయత్నం చేశారు. తనపై తాను సెటైర్లు వేసుకోవడం, మహేశ్ బాబు వంటి ఇతర హీరోల పాటలకు డ్యాన్స్ చేయడం వంటి ఎలిమెంట్స్‌తో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు.
ముఖ్యమంత్రిపై అటాక్, నాగప్ప ఇంటెన్షన్, అతని కొడుకును భగత్ సింగ్ అడ్డుపెట్టుకోవడం, చంద్రశేఖర్‌కు భగత్ సింగ్‌కు ఉన్న సంబంధం వంటి సీన్లతో రెగ్యులర్ కమర్షియల్ మూవీ ఫార్మాట్‌లోనే ఉస్తాద్ భగత్ సింగ్ సాగుతుంది. కొన్నిచోట్ల గబ్బర్ సింగ్ కనిపిస్తాడు.
ఫస్టాఫ్‌లో రాశీ ఖన్నా పాత్ర గ్లామర్‌తో ఆకట్టుకుంటుంది. పవన్ కల్యాణ్, శ్రీలీల కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ అలరిస్తాయి. పవన్ కల్యాణ్‌ను శ్రీలీల ఇమిటేట్ చేసే సీన్స్ విజిల్స్ పెట్టించేలా ఉన్నాయి. తమిళ అగ్ర నటుడు, దర్శకుడు పార్థిబన్ యాక్టింగ్ బాగుంది. తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు.
మరో డైరెక్టర్ కేఎస్ రవికుమార్ నటన కూడా మెప్పిస్తుంది. గౌతమి, రావు రమేష్ వంటి సీనియర్ నటీనటులు పర్ఫామెన్స్ తన పరిధి మేర ఆకట్టుకుంటుంది. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. తన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీలతో విజిల్స్ వేయించేలా ఉంది.
ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక పండుగలాంటి సినిమా. మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లతో సినిమా అదరగొట్టింది. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


