
‘కాంతార ఛాప్టర్ 1’ చిత్రం భారీ అంచనాలతో విడుదలైంది. ఈ సినిమాలో బడ్జెట్, నటీనటుల పారితోషిక వివరాలపై చర్చ జరుగుతోంది. రూ.125 కోట్ల భారీ వ్యయంతో నిర్మితమైన ఈ చిత్రంలో రిషభ్ శెట్టి పారితోషికం తీసుకోకుండా లాభాల్లో వాటా పొందనున్నారు. రుక్మిణి వసంత్, ఇతర నటుల రెమ్యునరేషన్ వివరాలు ఇక్కడ చూడండి.
Key Points
'కాంతార ఛాప్టర్ 1' చిత్రం రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించినట్లు తెలుస్తోంది.
రిషభ్ శెట్టి పారితోషికం తీసుకోకుండా, సినిమా లాభాల్లో వాటా పొందే ఒప్పందం కుదుర్చుకున్నారు.
రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్యలకు రూ.కోటి చొప్పున రెమ్యునరేషన్ ఇచ్చినట్లు టాక్.
తొలి భాగం కంటే 'కాంతార ఛాప్టర్ 1' లో విజువల్స్, సెట్స్, కంటెంట్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.
కాంతార ఛాప్టర్ 1 బడ్జెట్ వివరాలు
దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ‘కాంతార’ ఫ్రాంచైజీ నుంచి మరో సినిమా థియేటర్లలోకి వచ్చింది. అదే ‘కాంతార ఛాప్టర్ 1’. తొలి పార్ట్ కంటే ఈసారి భారీ హంగులు, స్టోరీలో మరిన్ని ఎలిమెంట్స్ జోడించారు. దసరా కానుకగా అక్టోబరు 02న పాన్ ఇండియా లెవల్లో రిలీజైంది. అయితే ఈ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ అయితే రాలేదు. కొందరు ప్రేక్షకులు ఆహా ఓహో అంటుండగా.. మరికొందరు మాత్రం ఓకే ఓకే అని అంటున్నారు.
మరోవైపు తొలి పార్ట్ కేవలం రూ.15-20 కోట‍్లతో నిర్మిస్తే ఏకంగా రూ.400 కోట్ల వరకు కలెక్షన్ అందుకుంది. ఇప్పుడు మాత్రం భారీగా బడ్జెట్ పెట్టారు. ఏకంగా రూ.125 కోట్ల వరకు నిర్మాతలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లే ప్రతి సీన్‌లోనూ రిచ్‌నెస్ కనిపించింది. అడవిలో సెట్ కావొచ్చు, బాంగ్రా రాజ్యం సెట్ కావొచ్చు స్క్రీన్‌పై అద్భుతంగా కనిపించాయి. కంటెంట్‌తో పాటు విజువల్స్, సెట్స్‌కి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు.
రిషభ్ శెట్టి పారితోషికం వెనుక కథ
ఈ సినిమా రెమ్యునరేషన్ విషయానికొస్తే తొలి పార్ట్ కోసం హీరో, దర్శకుడిగా చేసినందుకు రిషభ్ శెట్టి అప్పట్లో కేవలం రూ.4 కోట్లు తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. ఈసారి మాత్రం రూపాయి పారితోషికం తీసుకోకుండానే దాదాపు మూడేళ్ల పాటు కష్టపడ్డాడని అంటున్నారు. అలా అని ఫ్రీగా ఏం చేసేయలేదు. రిలీజ్ తర్వాత లాభాల్లో వచ్చే వాటాని తీసుకోవాలని ముందే నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకున్నాడట.
రుక్మిణి వసంత్, ఇతర నటుల రెమ్యునరేషన్
సినిమాలో రిషభ్ శెట్టితో పాటు రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య లీడ్ రోల్స్ చేశారు. వీళ్లందరికీ తలో రూ.కోటి వరకు రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్ నడుస్తోంది. వీళ్లు తప్పితే అందరూ పెద్దగా పేరున్న యాక్టర్స్ అయితే కనిపించలేదు. అయితే సినిమాలో అటు రిషభ్ ఇటు రుక్మిణి వసంత్ యాక్టింగ్ జనాలకు బాగా నచ్చుతోంది. పబ్లిక్ టాక్‌లోనూ ఎక్కువ మంది వీళ్లిద్దరినే మెచ్చుకుంటుండటం విశేషం.
మొత్తంగా, ‘కాంతార ఛాప్టర్ 1’ భారీ బడ్జెట్, ప్రత్యేకమైన పారితోషిక ఒప్పందాలతో వార్తల్లో నిలిచింది. రిషభ్ శెట్టి లాభాల్లో వాటా, ఇతర నటుల రెమ్యునరేషన్ వివరాలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. ఈ వివరాలు సినిమా విజయాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి.


