|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కన్యా కుమారి రివ్యూ.. హీరోయిన్ మధు శాలిని సమర్పించిన విలేజ్ లవ్ స్టోరీ ఎలా ఉందంటే?

Published: 27-08-2025, 12:10 PM
కన్యా కుమారి రివ్యూ.. హీరోయిన్ మధు శాలిని సమర్పించిన విలేజ్ లవ్ స్టోరీ ఎలా ఉందంటే?

మధు శాలిని ప్రజెంటర్‌గా తెరకెక్కిన కన్యా కుమారి సినిమా ఆగష్టు 27న విడుదలైంది. శ్రీచరణ్ రాచకొండ, గీత్ సైని జంటగా నటించిన ఈ గ్రామీణ ప్రేమకథ ఎలా ఉందో తెలుసుకుందాం.

Key Points

1

గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ నటించిన గ్రామీణ ప్రేమకథ.

2

రెండు వేరు వేరు లక్ష్యాలున్న జంట ప్రేమకథా చిత్రం.

4

మధు శాలిని ప్రజంటర్ గా వ్యవహరించిన చిత్రం.

కథాంశం మరియు నటీనటులు

నటీనటులు: శ్రీచరణ్ రాచకొండ, గీత్ సైని, భద్రం, మురళిధర్ గౌడ్, తదితరులు

రచన, దర్శకత్వం: సృజన్ అట్టాడ

సినిమాటోగ్రఫీ: శివ గాజుల, హరి చరణ్ కె

రిలీజ్ డేట్: ఆగస్ట్ 27, 2025

తెలుగులో ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన మధు శాలిని ప్రజెంటర్‌గా మారిన సినిమా కన్యా కుమారి. శ్రీచరణ్ రాచకొండ, గీత్ సైని హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు కథ, దర్శకత్వం, నిర్మాతగా సృజన్ అట్టాడ వ్యవహరించారు.

కథలోని ప్రధాన అంశాలు

రూరల్ బ్యాక్‌డ్రాప్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన కన్యా కుమారి ఇవాళ (ఆగస్ట్ 27) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి కన్యా కుమారి రివ్యూ లో తెలుసుకుందాం.

స్కూల్‌లో చదువుకుంటున్నప్పుడు కన్యా కుమారి(గీత్ సైని)ని తిరుపతి (శ్రీచరణ్) ప్రేమిస్తాడు. అయితే, రైతు కావాలని తిరుపతి, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావాలని కన్యా కుమారి కలలు కంటారు. అయితే, చదువు మానేసి తిరుపతి రైతు అయితే ఇంట్లో సమస్యల వల్ల కన్యా కుమారి డిగ్రీ మాత్రం చేసి బట్టల షాపులో పని చేస్తుంటుంది. తిరుపతి రైతు అనే కారణంగా పెళ్లి సంబంధాలు కుదరకపోతే తనను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేయడానికి సపోర్ట్ చేసే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని కన్యా కుమారి అనుకుంటుంది.

ఈ క్రమంలో ఓసారి తిరుపతి, కన్యా కుమారి కలుసుకుంటారు. ముందుగా తిరుపతిని పట్టించుకోని కన్యా కుమారి తర్వాత ప్రేమలో పడుతుంది. మరో వైపు తనను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేయడానికి ఒప్పుకున్న పెళ్లి సంబంధానికి ఓకే చెబుతుంది కన్యా కుమారి.

ఆ తర్వాత తిరుపతి, కన్యా కుమారి ప్రేమ ఎలాంటి మలుపు తీసుకుంది? కన్యా కుమారి కోసం తిరుపతి ఎలాంటి త్యాగం చేశాడు? కన్యా కుమారికి వచ్చిన పెళ్లి సంబంధం ఏమైంది? చివరికి తిరుపతి కన్యా కుమారి ప్రేమ నిలబడిందా? అనే విషయాలు తెలియాలంటే ఈ కన్యా కుమారిని చూడాల్సిందే.

రెండు డిఫరెంట్ గోల్స్, క్యారెక్టర్స్ ఉన్న ఇద్దరు మనుషులు ఎలా ప్రేమలో పడి గెలిచారనేదే కన్యా కుమారి కథ. అయితే, ఇలాంటి తరహా సినిమాలు అన్ని ఇండస్ట్రీలో ఎన్నో వచ్చాయి. కన్యా కుమారి ప్లాట్ చాలా రొటీన్‌దే. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో కూడా ఎన్నో ప్రేమకథా చిత్రాలను తెరపై చూశాం.

చిత్రం యొక్క బలాలు మరియు బలహీనతలు

అయితే, రెగ్యులర్ స్టోరీ అయినప్పటికీ చూపించిన సన్నివేశాలు మాత్రం ఫ్రెష్‌గా ఉంటాయి. కథలో కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. తిరుపతి, కన్యా కుమారి మధ్య వచ్చే సీన్స్, లవ్ ట్రాక్‌ను ఆకట్టుకునేలా తెరకెక్కించారు డైరెక్టర్. ఫస్టాఫ్ అంతా ఎక్కడా బోర్ కొట్టకుండా లవ్ సీన్లతో సాగిపోతుంది.

సెకండాఫ్‌లో హీరోయిన్ కోసం హీరో చేసే సీన్స్, త్యాగాలు బాగానే ఉంటాయి. అయితే, చాలా వరకు ఊహించిన విధంగానే స్క్రీన్ ప్లే సాగుతుంది. అయితే, సినిమా క్లైమాక్స్‌కు వచ్చినట్లే అనిపిస్తుంది కానీ కంటిన్యూ అవుతుంది. ముగింపు పర్వాలేదు. అప్పటివరకు వచ్చిన సీన్లతో చూస్తే ఎండింగ్ ఇంకాస్తా బెటర్‌గా ఉంటే బాగుంటుందనే ఫీలింగ్ కలుగుతుంది.

సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సాంకేతిక విలువలు బాగున్నాయి. సంగీతం బాగుంది. ఇక హీరోగా చేసిన శ్రీచరణ్ రాచకొండ బాగా చేశాడు. ప్రేమించే అమ్మాయి కోసం తపన పడే అబ్బాయిగా ఆకట్టుకున్నాడు.

హీరోయిన్ గీత్ సైని తన నటనతో డామినేట్ చేసిందని చెప్పాలి. పల్లెటూరి అమ్మాయిగా సాఫ్ట్‌వేర్ జాబ్ చేయాలనే లక్ష్యంతో మంచి ఈజ్‌తో అలరించింది. ఫైనల్‌గా చెప్పాలంటే రొటీన్ స్టోరీలో ఫ్రెష్ సీన్లతో సాగే కన్యాకుమారి .

మొత్తంగా, కన్యా కుమారి సినిమా రొటీన్ కథాంశంతో సాగుతున్నప్పటికీ, కొత్తగా తెరకెక్కించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ప్రేమకథలను ఇష్టపడే వారికి ఈ సినిమా బాగుంటుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.