
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ సరోగసి ద్వారా కవలల తండ్రి అయిన విషయం తెలిసిందే. తన పిల్లలకు తల్లి ప్రేమ లేకపోవడంపై వచ్చిన విమర్శలు, ఆయన ఆత్మగౌరవాన్ని ప్రశ్నించాయి. అయితే, పిల్లల ప్రతిస్పందన ఆయనకు ధైర్యాన్ని ఇచ్చింది.
Key Points
కరణ్ జోహార్ సరోగసి ద్వారా కవలలకు తండ్రయ్యారు.
తల్లి లేని విషయంపై కరణ్‌ను విమర్శించారు.
పిల్లల ప్రతిస్పందన కరణ్‌కు ధైర్యం ఇచ్చింది.
సింగిల్ పేరెంటింగ్‌పై తన అనుభవాలను పంచుకున్నారు.
సరోగసి ద్వారా కవలల తండ్రి
సింగిల్ పేరెంటింగ్ అన్నది చాలా కష్టం. తల్లి/తండ్రి లేని లోటు తెలియకుండా పిల్లల్ని పెంచాలి. అమ్మానాన్న అన్నీ ఒక్కరై పిల్లల్ని చూసుకోవాలి. ఇద్దరి ప్రేమను ఒక్కరే పంచాలి. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ( Karan Johar ) కూడా అదే పని చేస్తున్నాడు. 2017లో సరోగసి ద్వారా కవలలకు తండ్రయ్యాడు. అప్పటినుంచి అన్నీ తానై పిల్లల్ని చూసుకుంటున్నాడు. కానీ కొందరు దీన్ని కూడా తప్పుపట్టారు. ఆ చిన్నారులకు తల్లి లేకుండా చేశావని నిర్మాతను విమర్శించారు. ఆ మాటలు తననెంతగానో బాధపెట్టాయంటున్నాడు కరణ్ జోహార్.
నాపై నాకే అనుమానం తాజాగా ఓ ఇంటర్వ్యూలో కరణ్ మాట్లాడుతూ.. నీ పిల్లలకు తల్లి లేకుండా చేస్తున్నావన్న విషయం నీకర్థమవుతోందా? అన్న కామెంట్లు చూసి భరించలేకపోయాను. నేనేమైనా తప్పు చేస్తున్నానా? అని నామీద నాకే అనుమానమేసింది. అప్పుడు వెంటనే పిల్లల గదిలోకి వెళ్లాను. అప్పుడు వారి వయసు ఐదేళ్లుంటాయంతే! మీరు సంతోషంగానే ఉన్నారా? అని అడిగాను. నువ్వు మా నాన్నవి కాబట్టి హ్యాపీగా ఉన్నామన్నారు. నేను ఆ సమాధానం కోసమే ఎదురుచూశాను.
విమర్శలు మరియు ఆత్మగౌరవం
సింగిల్ పేరెంట్‌గా.. వారి రెస్పాన్స్ విన్నాక నాకు కొండంత ధైర్యం వచ్చింది. ఎవరేమనుకున్నా నాకనవసరం అనిపించింది. సింగిల్ పేరెంట్‌గా ఉన్నందుకు గర్వంగా ఫీలయ్యాను. మా అమ్మానాన్నకు నేను ఒక్కడినే సంతానం. ఇప్పుడు నేను సింగిల్ పేరెంట్‌గా ఉన్నాను. నాకు అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, లైఫ్ పార్ట్‌నర్ అంటూ ఎవరూ లేరు. ఉన్నదల్లా నా కుటుంబం, స్నేహితులు.. వీళ్లెప్పుడూ నా వెన్నంటే ఉంటారు. అందుకు గర్విస్తున్నాను అని చెప్పుకొచ్చాడు.
పిల్లల ప్రతిస్పందన మరియు ధైర్యం
తల్లి ప్రేమ లేకపోవడంపై వచ్చిన విమర్శలను ఎదుర్కొంటూ, కరణ్ జోహార్ తన పిల్లల ప్రేమతో ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. సింగిల్ పేరెంటింగ్ సవాళ్లను అధిగమించడంలో ఆయన అనుభవం ఇతరులకు స్ఫూర్తినిస్తుంది.


