
మీటూ ఉద్యమంతో వార్తల్లో నిలిచిన సింగర్ చిన్మయి సోషల్ మీడియాలో మరోసారి సంచలనం సృష్టించారు. డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్, సింగర్ కార్తీక్‌లకు ఇండస్ట్రీలో మళ్లీ అవకాశాలు ఇవ్వడంపై ఆమె తీవ్రంగా స్పందించారు. కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదని ఆమె వ్యాఖ్యానించారు.
Key Points
చిన్మయి సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది.
జానీ మాస్టర్, సింగర్ కార్తీక్‌లకు అవకాశాలు ఇవ్వడంపై చిన్మయి విమర్శలు.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్నవారికి మద్దతు ఇవ్వొద్దని చిన్మయి పిలుపు.
జానీ మాస్టర్ గతంలో జైలుకు వెళ్లి, ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాకు కొరియోగ్రాఫర్‌గా ఉన్నాడు.
చిన్మయి కెరీర్, మీటూ వివాదం
టాలీవుడ్ సింగర్‌గా ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న చిన్మయి (Chinmayi)డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ చేసింది. సమంతకు డబ్బింగ్ చెప్పిన ఆమె పలు చిత్రాల్లో తన ముద్దు ముద్దు మాటలతో అందరినీ ఆశ్చర్యపరిచింది. తెలుగు, తమిళంలో పలు పాటలు పాడిన చిన్మయి కెరీర్ మంచి ఫామ్‌లో ఉండగానే కోలీవుడ్ నిషేధం విధించింది. మీటూ ఉద్యమం పట్ల చిన్మయి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపడంతో నిషేధం విధించగా.. గత కొద్ది కాలంగా ఫ్రొఫెషనల్ లైఫ్‌కు దూరంగా ఉంటుంది. కానీ పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న చిన్మయి.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం పలు వివాదాస్పద పోస్టులతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, చిన్మయి ఓ ఇద్దరి గురించి సెన్సేషనల్ పోస్ట్ పెట్టింది.
జానీ మాస్టర్, కార్తీక్‌లపై చిన్మయి పోస్ట్
ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, సింగర్ కార్తీక్‌కు అవకాశాలు ఇవ్వడంపై తనదైన స్టైల్లో స్పందించింది. ‘‘జానీ మాస్టర్(Jani Master), సింగర్ కార్తీక్ (Karthik)వంటి వాళ్లకు ఇండస్ట్రీలో మరోసారి అవకాశాలు ఇవ్వడం అంటే లైంగిక వేధింపులకు మద్దతు తెలపడమే. డబ్బును అధికారాన్ని దుర్వినియోగం చేసే వారి చేతుల్లో పెట్టొద్దు. మనం నమ్మే కర్మ సిద్ధాంతం నిజమైతే.. కర్మ అసలు ఎవరినీ వదిలిపెట్టరు’’ అని రాసుకొచ్చింది. కాగా.. ఇటీవల కార్తీక్, జానీ మాస్టర్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
జానీ మాస్టర్ గతం, ప్రస్తుత పరిస్థితి
జానీ మాస్టర్ జైలు జీవితాన్ని కూడా గడిపారు. అసిసెంట్ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఆమె తనపై జరుగుతున్న అన్యాయాన్ని బయటపెట్టింది. దీంతో జానీ మాస్టర్‌పై కేసు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కొద్ది రోజుల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. ప్రస్తుతం మళ్లీస్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీ అయిపోతున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ పనుల్లో నిగ్నమైపోయారు. ఈ మూవీ షూటింగ్ శ్రీలంకలో జరుగుతున్నట్లు సమాచారం.
చిన్మయి చేసిన ఈ పోస్ట్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు, వాటి పరిణామాలు, బాధితుల ఆవేదనను మరోసారి తెరపైకి తెచ్చింది. గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న వారికి మళ్లీ అవకాశాలు ఇవ్వడంపై చర్చకు దారితీసింది.


