
వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరో కార్తీ, సర్దార్ 2 చిత్ర షూటింగ్ ముగింపు వేడుకలో తన సింప్లిసిటీని చాటుకున్నారు. చిత్ర యూనిట్‌కు స్వయంగా భోజనం వడ్డించి అందరినీ ఆకట్టుకున్నారు.
Key Points
కార్తీ సర్దార్ 2 చిత్ర షూటింగ్ ముగింపు వేడుకలో చిత్ర బృందానికి స్వయంగా భోజనం వడ్డించారు.
ఆయన సరళత, ప్రజా స్నేహం అభిమానులను ఆకట్టుకుంది.
హిట్ 3 చిత్రంలో కార్తీ ఎంట్రీతో హిట్ 4, ఖైదీ 2, ఖాకీ 2 చిత్రాలకు అంచనాలు పెరిగాయి.
సర్దార్ 2 చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
కార్తీ సింప్లిసిటీ అందరినీ ఆకట్టుకుంది
హీరో కార్తీ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ కార్తీకి మాస్ ఆడియన్స్ లో, యువతలో సపరేట్ ఫాలోయింగ్ ఉంది. ఆవారా, నా పేరు శివ, ఖాకీ, సర్దార్, ఖైదీ లాంటి చిత్రాలతో కార్తీ నటుడిగా ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు.
హీరో కార్తీ ప్రస్తుతం సర్దార్ 2 చిత్రంలో నటిస్తున్నారు. మూడేళ్ళ క్రితం పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన సర్దార్ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఇప్పుడు తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. షూటింగ్ చివరి రోజున కార్తీ తన సింప్లిసిటీ చాటుకున్నారు. ఎక్కడ ఉన్నా అందరిలో సామాన్యుడిగా కలిసి పోవడం కార్తీ స్టైల్.
సర్దార్ 2 చిత్ర షూటింగ్ ముగింపు వేడుక
సర్దార్ 2 షూటింగ్ చివరి రోజున చిత్ర సభ్యులందరికీ విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ విందులో హీరో కార్తీ చిత్ర యూనిట్ మొత్తాన్ని కూర్చుబెట్టి తానే స్వయంగా అందరికీ భోజనం వడ్డిస్తున్నారు. ఓపిగ్గా ఎంతో ప్రేమతో ఒక్కరికి కార్తీ భోజనం వడ్డించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కార్తీ సింప్లిసిటీని అభిమానులు కొనియాడుతున్నారు. రానున్న రోజులో కార్తీ నుంచి వరుసగా సీక్వెల్ చిత్రాలు రాబోతున్నాయి. నేచురల్ స్టార్ నాని హిట్ 3 చిత్రంలో చివర్లో కార్తీ ఎంట్రీ ఇచ్చారు అంటే హిట్ 4 మూవీలో హీరో కార్తీ అని అనౌన్స్ చేసేసినట్లే. అదే విధంగా ఖైదీ 2 కూడా రానుంది.
వరుస సీక్వెల్ చిత్రాలతో కార్తీ
ఈ చిత్రాలతో పాటు ఖాకీ 2 చిత్రానికి కూడా సన్నాహకాలు జరుగుతున్నాయి. సర్దార్ మొదటి భాగంలో ప్లాస్టిక్ బాటిల్స్ వాడకం ఎంత ప్రమాదకరమో చూపించారు.అదే విధంగా దేశభక్తి, స్పై సన్నివేశాలు కూడా ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచాయి. దీనితో సర్దార్ 2పై భారీ అంచనాలు ఉన్నాయి.
కార్తీ యొక్క సరళత, అభిమానులతో అనుబంధం అతనికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. రానున్న సీక్వెల్ చిత్రాలతో ఆయన విజయం సాధిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.


