
📌 Key Points
- కార్తీకి హిట్ అవసరం, అందుకే కళ్యాణ్ శంకర్‌తో కామెడీ చిత్రం!
- నాగవంశీ నిర్మాణంలో కార్తీ – కళ్యాణ్ శంకర్ సినిమా ఫిక్స్!
- సూర్యతో వెంకీ అట్లూరి సినిమా సెట్స్ మీదే ఈ కాంబో సెట్ అయింది.
- పీఎస్ మిత్రన్‌తో సర్ధార్ 2 షూటింగ్ పూర్తి కాగానే కళ్యాణ్ శంకర్ సినిమా స్టార్ట్!
తమిళ స్టార్ హీరో కార్తీకి టాలీవుడ్‌లో క్రేజ్ మామూలుగా లేదు. వరుస ఫ్లాపుల తర్వాత ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్‌తో కలిసి పనిచేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
కార్తీకి హిట్ కొట్టే దర్శకుడు దొరికేసినట్టేనా?
Karthi: తమిళ స్టార్ హీరో కార్తీ టైం ఏంటో అస్సులు బాలేదు. రీసెంట్ గా ఆయన చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నాయి. సర్దార్ తరువాత ఆయన చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ అయ్యాయి. ఇక ఇటీవల విడుదలైన వా వతియార్ కూడా సూపర్ ప్లాప్ అయ్యింది. దీంతో, ఇప్పుడు అర్జెంటుగా కార్తీకి ఒక హిట్ కావాలి. అందుకే, ఒక తెలుగు దర్శకుడితో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట.
అవును, ఆ దర్శకుడు మీరెవరో కాదు కళ్యాణ్ శంకర్. మ్యాడ్, మ్యాడ్ 2 చిత్రాలతో రెండు బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు ఈ దర్శకుడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ చిత్రాలు చేయడంలో మనోడు ఫేమస్. అందుకే, ఇప్పుడు హిట్ కావాలంటే కామెడీ సినిమానే కరక్ట్ అని భావిస్తున్నాడట కార్తీ(Karthi). అందుకే, కళ్యాణ్ శంకర్ ను కన్సీడర్ చేస్తున్నాడట. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్నాడట.
నాగవంశీ ప్లాన్ మాములుగా లేదుగా..!
నాగవంశీ ప్రస్తుతం కార్తీ అన్న సూర్యతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను లక్కీ భాస్కర్ ఫేమ్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో వచ్చిన కార్తీకి దర్శకుడు కళ్యాణ్ శంకర్ తో ఒక కథను చెప్పించాడట. ఆ కథ కార్తీకి బాగా నచ్చడంతో వెంటనే ఒకే చేశాడట. అలా కార్తీతో సినిమా సెట్ చేశాడట నాగ వంశీ. ఈ క్రేజీ ప్రాజెక్టుకి సంబందించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుందట.
సూర్య సెట్స్ మీదే కార్తీ సినిమా ఫిక్స్!
ప్రస్తుతం కార్తీ దర్శకుడు పీఎస్ మిత్రన్ తో సర్ధార్ 2 సినిమా చేస్తున్నాడు. బ్లాక్ బస్టర్ సర్ధార్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఇప్పటికే దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలైన వెంటనే కళ్యాణ్ శంకర్ తో సినిమాను స్టార్ట్ చేయనున్నాడట కార్తీ. మరి ఈ సినిమా కార్తీకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది అనేది చూడాలి.
కార్తీ, కళ్యాణ్ శంకర్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


