
📌 Key Points
- జ్యోత్స్న పదే పదే కార్తీక్‌నే పెళ్లి చేసుకుంటానని చెప్పి సుమిత్రను షాక్ చేసింది!
- దీప తాళి పట్టుకున్న జ్యో! సుమిత్ర ఆగ్రహం, ఇంట్లో నుంచి గెంటేస్తానని వార్నింగ్.
- శ్రీధర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు! ప్రాణాపాయ స్థితిలో ఉండగా కొత్త హీరో రక్షించాడు.
- కార్తీక్, దీపలకు కొత్త టాస్క్! నెల రోజుల్లో జ్యోత్స్న పెళ్లి చేయాలని కార్తీక్ నిర్ణయం.
కార్తీక దీపం 2 సీరియల్ లో ఊహించని మలుపులు! జ్యోత్స్న సంచలన నిర్ణయం, సుమిత్ర ఆగ్రహం, శ్రీధర్‌కు గుండెపోటుతో ఎపిసోడ్ మరింత ఉత్కంఠగా మారింది. ఆపదలో ఆదుకున్న కొత్త హీరో ఎవరు? ఈరోజు ఎపిసోడ్ అసలు మిస్ అవ్వద్దు!
జ్యో సంచలన డిమాండ్.. సుమిత్రకు షాక్!
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే మే 1 ఎపిసోడ్ లో కార్తీక్ నే పెళ్లి చేసుకుంటానని జ్యోత్స్న పదే పదే చెప్తుంది. దీంతో సుమిత్ర సీరియస్ అవుతుంది. ఇంట్లో నుంచి గెంటేస్తానంటుంది. మరోవైపు శ్రీధర్ కు హార్ట్ స్ట్రోక్ వస్తుంది.
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో జ్యోత్స్న మనసులో ఉన్నదాన్ని బయటపెట్టేలా కార్తీక్ చేస్తాడు. బావనే పెళ్లి చేసుకుంటానని జ్యో తెగేసి చెప్తుంది. దీప మెడలోని తాళిని పట్టుకుంటుంది. దీంతో జ్యోను దీప, సుమిత్ర కొడతారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే మే 1 ఎపిసోడ్ లో చూసేయండి.
కార్తీక్ కు సుమిత్ర థ్యాంక్స్ చెప్తుంది. తన కూతురిపై ఓ క్లారిటీ వచ్చిందని సుమిత్ర అంటుంది. నెల రోజుల్లో జ్యోత్స్న పెళ్లి చేయడం మనందరికీ టాస్క్ అని కార్తీక్ చెప్తాడు.
శ్రీధర్‌కు హార్ట్ స్ట్రోక్.. ప్రాణాపాయంలో!
టూర్ కు వెళ్తానన్న స్వప్న
జ్యోత్స్న ఏం చిన్నపిల్ల కాదు. మీరు చెప్పారని తను మిస్ హైదరాబాద్, కంపెనీకి సీఈఓ అయిందా? ఇవన్నీ తన ఇష్టప్రకారమే జరిగాయి కదా అని దీప చెప్తుంది. అర్థమయ్యేలా చెప్పాలని దీప అంటుంది. ఇదంతా మా కర్మ అని సుమిత్ర బాధపడుతుంది.
ఆపదలో ఆదుకున్న మిస్టరీ హీరో ఎంట్రీ!
అప్పుడే కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తాడు. క్యాబ్ లో హాస్పిటల్ కు తీసుకెళ్దామని కారు డోర్ ను బలంగా తెరిచి శ్రీధర్ ప్రాణాలు కాపాడతాడు. హాస్పిటల్ నుంచి కాల్ రావడంతో కార్తీక్ కంగారుగా వెళ్తాడు. బెడ్ మీద తండ్రిని చూసి బాధపడతాడు. జరగిన విషయాన్ని శ్రీధర్ చెప్తాడు.
నిన్ను సేవ్ చేసిన మనిషికి థ్యాంక్స్ చెప్పాలని కార్తీక్ బయటకు వెళ్తాడు. అక్కడే ఆ వ్యక్తిని ఢీ కొడతాడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
కార్తీక దీపం 2 లో ఈ డ్రామా ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. జ్యోత్స్న భవిష్యత్తు, శ్రీధర్ ఆరోగ్యం, కొత్త హీరో పాత్ర.. అన్నీ ఆసక్తికరంగా మారాయి. మరిన్ని సంచలన అప్‌డేట్స్ కోసం మా ఛానెల్‌ను చూస్తూనే ఉండండి!


