|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కార్తీక దీపం 2: జ్యోత్స్న కిడ్నాప్, 30 కోట్లు డిమాండ్! అమ్మ సెంటిమెంట్ అడ్డుపడుతుందా? షాకింగ్ ట్విస్ట్!

Published: 19-04-2026, 11:35 PM
కార్తీక దీపం 2: జ్యోత్స్న కిడ్నాప్, 30 కోట్లు డిమాండ్! అమ్మ సెంటిమెంట్ అడ్డుపడుతుందా? షాకింగ్ ట్విస్ట్!
  • వైరా కారులో వెళ్తున్న జ్యోత్స్నను కిడ్నాప్ చేసి, ఆమె ప్రాణాల కోసం 30 కోట్లు డిమాండ్ చేశాడు.
  • కూతురి కిడ్నాప్ గురించి సుమిత్రకు చెప్పలేక, దశరథ్ తీవ్ర ఆందోళనలో ఉన్నాడు, గుండె పగిలేలా ఉంది.
  • కార్తీక్, దీప కలిసి కిడ్నాప్ వెనుక ఉన్న నిజాలను కనుగొనే ప్రయత్నంలో, కథ మరింత ఉత్కంఠగా మారింది.
  • అమ్మ సెంటిమెంట్ కథను ఊహించని మలుపు తిప్పుతుందా? జ్యోత్స్న భవిష్యత్తు ఏంటి? సీరియల్ అభిమానులలో ఉత్కంఠ!

కార్తీక దీపం 2 సీరియల్ అభిమానులకు షాకింగ్ న్యూస్! కథ ఊహించని మలుపు తిరిగింది. జ్యోత్స్న కిడ్నాప్, భారీ డిమాండ్‌తో సీరియల్ ఉత్కంఠగా మారింది. అమ్మ సెంటిమెంట్ ఈ కథను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి.

వైరా ప్లాన్: జ్యోత్స్న కిడ్నాప్ వెనుక అసలు కథ!

Karthika Deepam 2 Serial April 20th Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఏప్రిల్ 20వ ఎపిసోడ్‌లో జ్యోత్స్న కారులో వెళ్తుంటే వైరా కిడ్నాప్ చేస్తాడు. ఇంటికి కాల్ చేసి సుమిత్రతో జ్యో మాట్లాడాలని చెబుతాడు. జ్యోత్స్న ప్రాణాలతో కావాలంటే 30 కోట్లు కావాలని డిమాండ్ చేస్తాడు. జ్యో 10 కోట్ల లాభం తీసుకుంటుంది.

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో జ్యోత్స్న కారులో వెళ్తుంటే రోడ్డు మీద కారు అడ్డంగా పెట్టి వైరా కనిపిస్తాడు. జ్యోత్స్న మాట్లాడుతున్న పట్టించుకోకుండా వచ్చి కారులో ఎక్కి కూర్చొంటాడు. జ్యోత్స్న గన్ గురి పెడుతుంది. దీంట్లో వెరైటీ ఏం లేదు అని అదే గన్ లాక్కుని జ్యోత్స్నకు గురి పెట్టి ఇది వెరైటీ అంటే అని వైరా అంటాడు. నీతో చాలా పని ఉంది అని వైరా అంటాడు.

కట్ చేస్తే జ్యోత్స్నను కుర్చీలో తాళ్లతో కట్టేసి ఉంచుతారు వైరా అండ్ గ్యాంగ్. నీకేం కావాలి అని జ్యో అంటే.. రూ. 20 కోట్లు కావాలి. పాకెట్ మనీ అని వైరా అడుగుతాడు. పిల్లలు చేసిన తప్పులకు పెద్దవాళ్లకు శిక్షలు వేయాలి. నీతో చేతులు కలిపి మీ డాడీ కంపెనీ మూయిద్దామనుకున్నా. కానీ, నా కింగ్‌డమ్‌నే కూల్చేశారు. మళ్లీ నా సామ్రాజ్యాం నిర్మించుకోవాలి. ఖర్చులకు 20 కోట్లు కావాలి. నువ్వు చస్తానంటే మీ డాడీ ఇవ్వడా అని వైరా అంటాడు.

30 కోట్ల డిమాండ్: దశరథ్ నిర్ణయం ఏంటి?

నా పేరు చెప్పకుండా డబ్బులు అడిగితే బతుకుతావ్. లేదు అంటే చస్తావ్ అని వైరా బెదిరిస్తాడు. సరే అనకపోతే అని జ్యో అంటే.. చంపేద్దాం బాస్ అని అసిస్టెంట్ అంటాడు. దశరథ్‌కు వైరా కాల్ చేసి నీ కూతురుని మేము కిడ్నాప్ చేశాం అని వైరా చెబుతాడు. అదే బయటకు అంటాడు దశరథ్. ఆ మాటలు అంతా వింటారు. కానీ, దశరథ్ నమ్మడు. వీడియో పంపస్తాను అని వైరా కాల్ కట్ చేస్తాడు.

సుమిత్రకు జ్యోత్స్న కిడ్నాప్ అయిందని ఎలా చెప్పాలి, నిజం చెబితే సుమిత్రనే హాస్పిటల్‌‌కు తీసుకువెళ్లాల్సి వస్తుందని దశరథ్ కంగారుపడతాడు. కార్తీక్, దీప పక్కకు వెళ్లి మాట్లాడుకుంటారు. పారిజాతం వచ్చి కిడ్నాప్ ఎవరు చేశార్రా అని అడిగితే కార్తీక్ సెటైర్లు వేస్తాడు. ఇంతలో కార్తీక్‌కు దాసు కాల్ చేస్తాడు. దాసుకు జ్యోత్స్న కిడ్నాప్ అయిన విషయం కార్తీక్ చెబుతాడు. దాంతో ఇంటికి వస్తానంటాడు దాసు.

కిడ్నాప్ ఎవరు చేసే అవకాశం ఉండి ఉంటుందని దశరథ్, శివ నారాయణ, కార్తీక్ ఆలోచిస్తారు. ముందు సుమిత్రకు ఎలా చెప్పాలో అది ఆలోచించండని దశరథ్ అనేలోపు ఏంటండి అది అని సుమిత్ర ఎంట్రీ ఇస్తుంది. సుమిత్రను కూర్చోబెట్టి నీకో విషయం చెబుతా కంగారు పడకంటాడు కార్తీక్. ఇంతలోనే జ్యోత్స్న ఎక్కడ అని అడుగుతుంది. దశరథ్ ఫోన్ తీసుకుని జ్యోత్స్న కిడ్నాప్ వీడియో చూపిస్తాడు కార్తీక్.

అమ్మ సెంటిమెంట్: కథకు కొత్త మలుపు!

వీడియో కాల్ కట్ చేస్తాడు వైరా. దాంతో మరింత టెన్షన్ పడుతుంది సుమిత్ర. వైరా నార్మల్ కాల్ చేస్తాడు. కార్తీక్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు. నీకు ఏం కావాలో చెప్పు అని సుమిత్ర అంటే.. ఒక 30 కోట్లు కావాలని వైరా డిమాండ్ చేస్తాడు. మొత్తమంతా క్యాష్ కావాలి. అది ఎక్కడికి తేవాలో చెబుతాను. నేను కాల్ చేసాక క్యాష్ రెడీ అని చెప్పాలి. లేకుంటే నీ కూతురుని చంపేసి పార్సల్ చేస్తాను అని వైరా బెదిరిస్తాడు.

తర్వాత అమ్మ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందంటావా అని వైరా అడిగితే.. నువ్వు 30 కాదు 50 అడిగిన ఇస్తారు అని జ్యో అంటుంది. నువ్వు నాకంటే జాదులా ఉన్నావ్. నిన్ను అడ్డం పెట్టుకుని 20 కోట్లు లాగుదామనుకున్నా. కానీ, నన్ను అడ్డం పెట్టుకుని నువ్వు (జ్యోత్స్న) 10 కోట్లు లాభం పొందుతున్నావ్ అని వైరా అంటాడు. నీకు నాకు ఇద్దరికి డబ్బులు కావాలి. నువ్వు కిడ్నాప్ చేశావని నేనెందుకు వర్రీ అవడం. నీతో కలిసిపోతే నాకు లాభమే కదా అని జ్యోత్స్న అంటుంది.

అలా మరోసారి జ్యోత్స్న వైరా ఒక్కటవుతారు. అమ్మ సుమిత్ర సెంటిమెంట్ అడ్డు పెట్టుకుని జ్యోత్స్న 10 కోట్లు, వైరా 20 కోట్లు రాబట్టేలా ప్లాన్ చేస్తుంది జ్యోత్స్న. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

కార్తీక దీపం 2లో రాబోయే మలుపులు ఊహించనివి! జ్యోత్స్న ప్రాణాలకు ముప్పు పొంచి ఉందా? వైరా ప్లాన్ సక్సెస్ అవుతుందా? ఈ ఉత్కంఠకు తెరపడాలంటే మరిన్ని అప్‌డేట్‌ల కోసం చూస్తూనే ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.