|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కార్తీక దీపం 2: జ్యోత్స్న షాక్! కార్తీక్ డ్రామా బట్టబయలు! దీపే అసలు వారసురాలు! ఊహించని ట్విస్ట్!

Published: 30-03-2026, 1:35 AM
కార్తీక దీపం 2: జ్యోత్స్న షాక్! కార్తీక్ డ్రామా బట్టబయలు! దీపే అసలు వారసురాలు! ఊహించని ట్విస్ట్!
  • బోన్ మ్యారో ఆపరేషన్, డీఎన్ఏ రిపోర్ట్స్‌తో కార్తీక్ నాటకం బయటపెట్టిన జ్యోత్స్న.
  • సుమిత్ర కూతురు దీప అని పారిజాతానికి చెప్పిన దాసు..కార్తీక్ షాక్!
  • ఆస్తి కోసం జ్యోత్స్న పెళ్లి ఆడుతున్న డ్రామాను కనిపెట్టిన కాంచన.
  • దీప మనవరాలని తెలిసి పారిజాతం ఆనందం..కార్తీక్ కు షాక్ తప్పదా?

కార్తీక దీపం 2 సీరియల్‌లో సంచలన ట్విస్ట్! కార్తీక్ ఆడుతున్న నాటకం జ్యోత్స్నకు తెలిసిపోయింది. అసలు వారసురాలు ఎవరో దాసు చెప్పడంతో కథ మరింత రసవత్తరంగా మారింది.

కార్తీక్ నాటకం బయటపెట్టిన జ్యోత్స్న!

Karthika Deepam 2 Serial March 30th Episode: కార్తీక దీపం 2 సీరియల్ మార్చి 30వ ఎపిసోడ్‌లో బోన్ మ్యారో ఆపరేషన్, డీఎన్ఏ రిపోర్ట్స్ తీసుకొచ్చి ఒకతను జ్యోత్స్నకు ఇస్తాడు. దాంతో తను సుమిత్ర కూతురు కాదని, కార్తీక్ నాటకం ఆడాడని కనిపెడుతుంది జ్యోత్స్న. పారిజాతం అసలు మనవరాలు దీప అని దాసు చెబుతాడు.

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో ఆస్తి విషయంలో జ్యోత్స్న పెళ్లి చేసుకోకుంటే కార్తీక్‌కు దక్కాలని క్లాజ్ పెట్టడంపై కాంచన అనుమానిస్తుంది. అలా కండిషన్ పెట్టకుంటే జ్యోత్స్న పెళ్లి చేసుకోదని, రిలాక్స్‌గా ఉంటూ అందరిని ఇబ్బందిపెడుతుందని, జ్యోత్స్న పెళ్లి చేసుకునేందుకే అలా దశరథ్ చేశాడని కార్తీక్ వివరిస్తాడు.

దాంతో కార్తీక, దీప రిలాక్స్ అవుతారు. పారిజాతం పిన్నితో చేరి జ్యోత్స్న చెడిపోయిందని కాంచన అంటే.. జ్యోత్స్నను తులసి మొక్కలా చేస్తాగా అని కార్తీక్ అంటాడు. ముందు పారుకు చెక్ పెట్టాలని కార్తీక్ అంటాడు. మరోవైపు జ్యోత్న్సకు డీఎన్ఏ రిపోర్ట్స్ తీసుకొచ్చి ఒకతను ఇస్తాడు. సుమిత్ర కూతురు జ్యోత్స్న కాదు, దీపే సుమిత్ర కూతురు. ఆమెకే బోన్ మ్యారో ఆపరేషన్ జరిగిందంటాడు. డబ్బు ఇచ్చి అతన్ని పంపించేస్తుంది జ్యోత్స్న.

దీప అసలు వారసురాలు అని దాసు వెల్లడి!

ఇంతలో జ్యోత్స్న భుజంపై పారిజాతం చేయి వేస్తుంది. దాంతో జ్యో షాక్ అవుతుంది. వాడికెందుకే డబ్బులిచ్చావ్ అని అడిగితే.. ఏదోటి చెప్పి కవర్ చేస్తుంది. కష్టాల్లో ఉన్నాడని సాయం చేశాడంటుంది జ్యో. ఇంతలో పారుకు దాసు కాల్ చేయడంతో వెళ్లిపోతుంది. నాకు అందరు దొరికారు. నా అనుమానమే నిజమైంది. దీపే సుమిత్ర కూతురు, డాక్టర్ అబద్థం చెప్పింది. బావకు దాసు నిజం చెప్పేశాడు. బావే ఈ నాటకం ఆడాడు. నాన్నకు ఈ నిజం తెలుసా. ఈ ఒక్క క్లారిటీ వస్తే ఏం చేయాలో తెలుస్తుంది అని జ్యోత్స్న అనుకుంటుంది.

బాగా ఆలోచించిన పారిజాతం నేను పని మనిషినే, దీప పని మనిషే అని, వారసురాలు కనిపించిందారా అని పారిజాతం తెగ మురిసిపోతుంది. కళ్లముందు బంగారాన్ని పెట్టుకుని బొగ్గు అనుకున్నా. దీప నిన్ను ఎన్ని చిత్రహింసలు పెట్టాను. అమ్మా దీప నేను వస్తున్నా అని పారు అంటుంది. దీప నీ మనవరాలు అని అందరికి తెలిస్తే నువ్వు పిల్లలను మార్చిన విషయం బయటపడుతుంది అని దాసు హెచ్చరిస్తాడు.

కార్తీక్, జ్యోత్స్నకు విషయం తెలియనివ్వకు. కార్తీక్ గాడిని ఎన్ని ఇబ్బందులు పెట్టావ్. వాడికి దొరికితే విడిచిపెడతాడా అని దాసు అంటాడు. అది నిజమే అన్న పారిజాతం దీపను చూడకుండా ఉండలేనని వెళ్తుంది పారిజాతం. జ్యోత్స్న తినకుండా ఆలోచిస్తుంటే దశరథ్ తినమంటాడు. మంచి సంబంధం చూస్తాం చేసుకో అని సుమిత్ర అంటుంది. జ్యోత్స్న చెప్పింది వినట్లేదని కోప్పడుతుంది సుమిత్ర .

పారిజాతం ప్లాన్స్ రివర్స్.. షాకింగ్ ట్విస్ట్!

దీప ను ఆప్యాయంగా పిలుస్తుంది పారిజాతం. తప్పిపోయిన కూతురు కోసం వెతికినట్లు అలా వెతుకుతావేంటీ అని అనసూయ అంటుంది. నా తప్పులు ప్రక్షాళన చేసుకోడానికి వచ్చాను. దీప దర్శనం ఇప్పించండి అని పారిజాతం ఆవేదనగా అడుగుతుంది. కార్తీక్ విజిల్ కొడతాడు. వంట గదిలో నుంచి పొగ వస్తుంది.

పారిజాతం విజిల్ కొట్టి దీపను పిలుస్తుంది. దీప రావడంతోనే పారిజాతం ప్రేమగా, ఆప్యాయతగా మనవరాల అని హగ్ చేసుకుంటుంది. మనవరాలనా అంటూ అంతా షాక్ అవుతారు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

కార్తీక దీపం 2లో సరికొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. రాబోయే ఎపిసోడ్స్‌లో ఏం జరుగుతుందో చూడాలంటే వేచి ఉండాల్సిందే. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.