
📌 Key Points
- జ్యోత్స్న నుండి దీపకు షాకింగ్ ఆఫర్: బావను వదులుకుంటే నీ కూతురు అని ఒప్పుకుంటా!
- ఆఫర్‌ను తిరస్కరించిన దీప: నీ స్వార్థానికి నేను బలికాను అంటున్న దీప!
- చెంపదెబ్బ గురించి ఆరా తీసిన శివ నారాయణ, సుమిత్ర: ఏం జరిగిందని ప్రశ్నల వర్షం!
- పారిజాతం వార్నింగ్: దీప జోలికి వస్తే ఊరుకునేది లేదు అంటూ పారు ఫైర్!
కార్తీక దీపం 2 సీరియల్‌లో సరికొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. జ్యోత్స్న దీపకు ఒక ఆఫర్ ఇవ్వడం, దానికి దీప సమాధానం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అసలు ఏం జరిగిందో చూద్దాం!
జ్యోత్స్నకు దీప స్ట్రాంగ్ కౌంటర్!
Karthika Deepam 2 Serial April 14th Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఏప్రిల్ 14వ ఎపిసోడ్‌లో దీప, జ్యోత్స్న వాదించుకుంటారు. దీపకు జ్యోత్స్న ఆఫర్ ఇస్తుంది. కానీ, దీప ఒప్పుకోదు. ఇంటికెళ్లిన జ్యోత్స్న చెంపపై ఎర్రగా ఉండటంతో శివ నారాయణ, సుమిత్ర ఆరా తీస్తారు. జ్యోత్స్నకు పారిజాతం వార్నింగ్ ఇస్తుంది.
Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో దీపతో జ్యోత్స్న గొడవ పడుతుంది. బావకు భార్య అంటే నేనే, నిన్ను భార్యగా నేను ఒప్పుకోను అని జ్యోత్స్న అంటుంది. నేను నా బావతో నా మెడలో మూడు ముళ్లు కట్టించుకుంటాను, బావతో తాళి కట్టించుకోకుంటే నాపేరు జ్యోత్స్న కాదు అని జ్యో అంటుంది.
కరెక్టే.. నువ్వు కొట్టినదానికంటే ఈ మాటే ఎక్కువ మండుతుంది. సరే మనం ఒక డీల్‌కు వద్దాం. ఎక్సెంజ్ ఆఫర్ చేసుకుందాం. నువ్వే సుమిత్ర కూతురు అని చెప్పేస్తే.. ఇవన్నీ నువ్వే తీసేసుకో కానీ బావకు నాకు పెళ్లి చేయి, నాకు ఏం వద్దు. బావ ఉంటే చాలు అని జ్యోత్స్న అంటుంది. ఇక్కడ నీకంటూ ఉంది పేరు మాత్రమే. అన్నీ దీపవే అని కార్తీక్ అంటాడు.
చెంపదెబ్బపై తాత, తల్లి ఆరా!
నేను ఆఫర్ ఇచ్చింది దీపకు. కావాలంటే బోనస్‌గా బావకు నాకు పుట్టిన పాపకు నీ పేరు పెట్టుకుంటాం. నేను బావ దూరంగా వెళ్లి బతుకుతాం అని జ్యోత్స్న అంటుంది. దీప ఒప్పుకోదు. చచ్చిపోతుంది.. నేను కూతురు కాదని తెలిస్తే మీ అమ్మ చచ్చిపోతుంది. తెలియని వయసులో ఒక తల్లిని చంపుకున్నావ్. ఇప్పుడు తెలిసి చంపుకుంటున్నావ్. ఏం చేసిన నీ తల్లి బతకదు అని జ్యో అంటుంది.
ఇలా స్వార్థంగా ఆలోచిస్తే నష్టం నీకే. ఇంతవరకు వచ్చిన నేను నా ఇంట్లోకి రాలేనా అని దీప అంటే.. రానివ్వను అని జ్యో అంటుంది. మెడలో తాళి కాదు నా బావ చిటికనవేలు కూడా తాకనివ్వను అని దీప అంటే.. కార్తీక్ విజిల్ వేస్తాడు. మనిషిగా మారు అని దీప అంటే.. నాకు బావకు పెళ్లి గోవాలో చేస్తే ఎలా ఉంటుందంటావ్ అని జ్యో అంటుంది. గూబ పగిలిపోయేలా ఉంటుందని దీప అంటే.. అయితే అదిరిపోతుందని జ్యో అంటుంది.
ఇది మారదు బావ పదా అని దీప, కార్తీక్ వెళ్లిపోతారు. తర్వాత జ్యోత్స్న ఇంటికి వెళ్తుంది. అసలు ఏమైందని జ్యోత్స్నను నిలదీస్తుంది సుమిత్ర. ఏం కాలేదని, దీప వచ్చిందని బావ ఇంటికి వెళ్లిపోయాడని, తనే డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చినట్లు చెబుతుంది జ్యోత్స్న. చూశారా మావయ్య కార్తీక్ జ్యోత్స్నను వదిలేసి పోయాడట అని సుమిత్ర అంటే.. అసలు ఇంతదాకా తెచ్చుకోవడం ఎందుకు అని శివ నారాయణ అంటాడు.
దీప జోలికొస్తే ఖబడ్దార్ అంటున్న పారు!
అద్దంలో దీప కొట్టిన చెంపదెబ్బ చూస్తూ రగిలిపోతుంది. వెన్నె రాసుకోలేకపోయావా అని పారిజాతం వచ్చి అడుగుతుంది. అడ్డదిడ్డంగా జ్యో అనేసరికి ఇలా వాగితేనే దీప కొట్టినట్లుంది. నీకు కార్తీక్ వెర్రి పట్టుకుందని, జ్యో చేసిందంతా చెబుతుంది పారిజాతం. నీకు ఈ బుద్ధులన్నీ నేర్పించి చచ్చింది నేనే. అమ్మ తల్లి క్షమించు. కార్తీక్ దీప మొగుడు వాన్ని అలాగే వదిలేయు అని పారిజాతం అంటుంది.
అయినా జ్యోత్స్న వినదు. జరిగింది అంతా నేను మారుస్తాను. దీపను బ్రతకనివ్వను అని జ్యో అంటే.. అది నేనుండగా జరగదు. దీపను చంపడం కాదు కదా. దాని ఒంటిమీద నీ గోటి గీత పడిన నీ చేయి నరికిపారేస్తాను పారిజాతం వార్నింగ్ ఇస్తుంది. దాంతో జ్యో షాక్ అవుతుంది. దీబ గర్భగుడి అయితే.. నేని గాలిగోపురాన్ని. దీపను ఏం చేయాలంటే ఈ గోపురాన్ని దాటాలి అని పంచ్‌లు ఇస్తుంది పారిజాతం.
మరోవైపు కార్తీక్‌ను తిడుతుంది కాంచన. జ్యోత్స్న మీతో ఇంతలా ఆడుకుంటుంది. మీరెందుకు భరిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని కాంచన అంటుంది. ఇంతలో శౌర్య వచ్చి ఎక్కడికి వెళ్లారని అడుగుతుంది. ఎక్కడికి లేదే ముందు వాళ్లు ఫ్రెష్ అప్ కానీ. స్నానం చేసి వెళ్లండి. కార్తీక్ జ్యోత్స్నతో జాగ్రత్తరా అని కాంచన అంటుంది. అమ్మకు అనుమానం వచ్చినట్లుందని కార్తీక్ అనుకుంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
మొత్తానికి కార్తీక దీపం 2 సీరియల్ రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


