
కార్తీక దీపం 2 తాజా ఎపిసోడ్‌లో కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు వైరా కుట్ర పన్నగా, కార్తీక్ తెలివిగా అడ్డుకుంటాడు. మరోవైపు దీప ప్రెగ్నెన్సీపై పారు ఆసక్తికర చర్చ మొదలుపెడుతుంది. ఈ ఉత్కంఠభరిత ఘట్టాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
Key Points
కంపెనీ షేర్లు కొనేందుకు వైరా మీటింగ్‌లోకి ఎంట్రీ.
బోర్డు సభ్యుల మద్దతుతో వైరా ప్రణాళికను వెల్లడించాడు.
దీప గర్భవతి అనే ఆసక్తికర చర్చ ఇంట్లో మొదలైంది.
కార్తీక్ తెలివైన ప్రశ్నలతో వైరాను ఇరుకున పెట్టాడు.
కంపెనీ షేర్లపై వైరా కుట్ర
కార్తీక దీపం 2 శుక్రవారం ఎపిసోడ్ లో సీఈఓగా నేనొక నిర్ణయం తీసుకున్నాను అని జ్యోత్న్స చెప్పబోతుంది. అంతలో బోర్డ్ మెంబర్స్ మేము ఈ కంపెనీ షేర్లను వేరే వాళ్లకు అమ్మాలి అనుకుంటున్నాము అంటారు. అది విన్న శివన్నారాయణ, దశరథలు షాక్ అవుతారు. ఎవ్వరికి అమ్మాలి అనుకుంటున్నారు అని అడుగుతారు. ఆ వ్యక్తిని ఇక్కడికి ఇన్వైట్ చేశామంటారు బోర్డ్ మెంబర్స్. ఇంతలో వైరా ఎంట్రీ ఇస్తాడు. వైరాను చూసిన కార్తీక్ కు కాస్త డౌట్ వస్తుంది. వైరా లోపలికి ఎంట్రీ ఇవ్వగానే.. నువ్వు ఎందుకు వచ్చావని దశరథ ప్రశ్నిస్తాడు. మీ కంపెనీలో షేర్లు కొనేది నేనే అని చెబుతాడు వైరా.
మరోవైపు వంట చేయడానికి ప్రిపేర్ అవుతున్న దీప మామిడి కాయను కాస్త కట్ చేసి తింటుంది. చాలా పుల్లగా ఉందే అనుకుంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన పారు. ముఖం చూస్తే బాగా వెలిగిపోతోంది. నువ్వు నెల ఏమైనా తప్పావా దీప అంటుంది పారు. నేను నెలా తప్పలేదు. సంవత్సరం తప్పలేదు అంటుంది దీప. తప్పితే తప్పేం ఉందిలే అంటుంది పారు. అవతలి వాళ్ల పర్సనల్స్ గురించి మనం మాట్లాడకపోవడమే మంచిది అంటుంది సుమిత్ర. ఇప్పుడు కోపాలు ఉన్నాయని కానీ.. భవిష్యత్తులో అందరూ కలిసిపోవచ్చు. దీప సీమంతం నీ చేతుల మీదుగా మన ఇంట్లోనే జరగవచ్చు ఎవ్వరికి తెలుసు సుమిత్ర అంటుంది పారు. అందుకు సుమిత్ర అవన్నీ జరగకూడదని అయితే నేను కోరుకోను అని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోతుంది.
శివన్నారాయణకు చెప్పి తనని మీటింగ్ రూమ్ లోకి పిలిపించుకునేలా చేస్తాడు కార్తీక్. లోపలికి వచ్చిన కార్తీక్ ను మీ డ్రైవర్ లోపలికి ఎందుకు వచ్చాడు అని వైరా అడగ్గా.. కార్తీక్ ఈ కంపెనీకి మాజీ సీఈఓ. నా కూతురి కొడుకు అని చెబుతాడు శివన్నారాయణ. సీఈఓకు డ్రైవర్ పోస్ట్ ఇచ్చారా? డ్రైవర్ కి సీఈఓ పోస్ట్ ఇచ్చారా అని తక్కువచేసి మాట్లాడుతాడు వైరా.. ఆ విషయాలు మనం తర్వాత మాట్లాడుకుందాం కానీ.. ముందు వచ్చిన పని చూద్దాం అంటాడు కార్తీక్.
దీప తల్లికానుందా? ఆసక్తికర చర్చ
బోర్డు మెంబర్స్ తో మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు కార్తీక్. కొన్నేళ్ల క్రితం అమీర్ పేట్ లో ఓ చిన్న కాకా హోటల్ ఉండేది. అక్కడికి వచ్చిన ఓ పెద్ద మనిషి టిఫిన్ చేసి బాగుందని.. ఆ హోటల్ ఓనర్ ను పార్ట్ నర్ చేసుకున్నాడు అంటాడు. ఆ హోటల్ నాదే సార్ అని ఒక బోర్డ్ మెంబర్ అంటాడు. మీకు పార్ట్ నర్ షిప్ ఇచ్చి ఈ స్టేటస్ ఇచ్చింది శివన్నారాయణ అని కార్తీక్ అంటాడు. మీ తాత గారు ఛాన్స్ ఇచ్చారని మీ మరదలు కంపెనీని రోడ్డుకు ఈడుస్తున్నా మేము చూస్తు ఊరుకోవాలా అంటాడు ఇంకొక బోర్డు మెంబర్. కంపెనీ రూల్స్ ప్రకారం మీరు షేర్లు అమ్ముతున్నట్లు ఛైర్మన్ కు చెప్పారా? బోర్డు మెంబర్స్ లో ఎవరూ కొనమని అంటేనే కదా బయటివాళ్లకు అమ్మాలి? శివన్నారాయణ కొనను అన్నారా? అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. రూల్స్ పాటించకుండా ఇలా చేయడం క్రైమ్ అంటాడు. మీ మీద యాక్షన్ తీసుకోవచ్చని వారిని కాస్త బెదిరిస్తాడు.
మీరు సీఈఓగా ఉన్నప్పుడు లాభాలు వచ్చేవి కానీ ఇప్పుడు లేరు కదా అని బోర్డు మెంబర్ భరణి అంటాడు. లేడని ఎవరు చెప్పారు? వాడు ఎప్పుడూ మాతోనే ఉన్నాడు. ఇక మీదట కూడా ఉంటాడు. కొన్ని కారణాల వల్ల కంపెనీకి దూరంగా ఉన్నాడు అంతే అంటాడు శివన్నారాయణ. కార్తీక్ సార్ ఉంటే మాకు ఇబ్బంది లేదు అంటాడు భరణి. దానికి వైరా గట్టిగా అరుస్తాడు. షేర్లు నాకు అమ్ముతామని మాట ఇచ్చారు అంటాడు. ముందు మీరు బయటకు వెళ్లండి అంటాడు కార్తీక్. నేను నీతో మాట్లాడాలి కార్తీక్ అంటాడు వైరా. ఇక్కడ కాదు బయట మాట్లాడుకుందాం అంటాడు కార్తీక్. బయట వెయిట్ చేస్తాను అని వెళ్లిపోతాడు వైరా.
వైరాను తెలివిగా ఎదుర్కొన్న కార్తీక్
ఇదంతా చూసి కోపంతో ఊగిపోతుంది జ్యోత్న్స. అందరి ముందు నన్ను డమ్మీని చేశారు. తిరిగి తల ఎత్తుకోకుండా చేశారని అక్కడినుంచి వెళ్లిపోతుంది. కార్తీక్ కు థ్యాంక్స్ చెప్తాడు శివన్నారాయణ. వైరా షేర్స్ ఎందుకు కొనాలనున్నాడో? కొంటే వాడు ఏం చేస్తాడో నాకు బాగు తెలుసు అని అంటాడు దశరథ. లీగల్ గా మనం వారిపై చర్య తీసుకునే అవకాశం నిజంగానే ఉందా అని కార్తీక్ ని అడుగుతాడు శివన్నారాయణ. లేదు తాత వారిని కాస్త భయపెట్టాలని అలా చెప్పాను అంతే అంటాడు కార్తీక్.
కార్తీక్ కోసం బయట వెయిట్ చేస్తున్న వైరాను చూసి వెళ్లిపోయారు అనుకున్నానే అంటాడు కార్తీక్. నా అవసరం కాబట్టి ఎంతసేపైనా వెయిట్ చేస్తాను అంటాడు వైరా. లైఫ్ గేమ్ లాంటిది. నేను దశరథతో తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. నువ్వు అడ్డుపడకపోవడమే మంచిది అని వైరా అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
వైరా షేర్ల కుట్రను కార్తీక్ సమర్ధవంతంగా తిప్పికొట్టాడు. దీప ప్రెగ్నెన్సీ అంశం సీరియల్‌కు మరింత మలుపునిచ్చింది. ఈ ఎపిసోడ్ రాబోయే కథనంపై ఉత్కంఠను పెంచింది.


