
📌 Key Points
- దాసు కిడ్నాప్ చేసింది జ్యోత్స్న అని తెలుసుకున్న పారిజాతం, ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధం!
- గుడికి రానని దీప తెగేసి చెప్పడంతో షాక్ తిన్న కాంచన, ఇంట్లో గొడవలు మొదలు!
- రెండో బిడ్డను కార్తీక్ బాబు బాగా చూసుకుంటాడని దీపకు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన మేనత్త!
- దీప ప్రవర్తనతో విసిగిపోయిన కాంచన, కార్తీక్ ను నిలదీస్తూ ప్రశ్నల వర్షం కురిపించింది!
కార్తీక దీపం 2 సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. జ్యోత్స్న ఆట కట్టించడానికి పారిజాతం రంగంలోకి దిగగా, దీప సంచలన నిర్ణయం అందరినీ షాక్‌కి గురిచేసింది. అసలేం జరుగుతుందో చూద్దాం!
దాసు కిడ్నాప్ వెనుక జ్యోత్స్న!
కార్తీక దీపం 2 సీరియల్ ఫిబ్రవరి 14వ ఎపిసోడ్‌లో గుడికి రానని దీప అంటుంది. దాంతో కాంచన కోప్పడుతుంది. ఇంట్లోంచి వెళ్లిపోతానంటుంది. బిడ్డకు ఏం కాదని మాటివ్వమని దీపను కాంచన అడిగితే.. తండ్రితో కలిసి ఉంటానని మాటివ్వమని తల్లిని కోరుతాడు కార్తీక్. మరోవైపు జ్యోత్స్నకు పారిజాతం పెద్ద ఝలక్ ఇస్తుంది.
కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో దాసును కిడ్నాప్ చేసింది జ్యోత్స్ననే అని పారిజాతంకు తెలిసిపోతుంది. నీ పని చెప్తానే సుమిత్ర కూతురా అని పారు అనుకుంటుంది. మరోవైపు దీప ఆలోచిస్తుంటే రెండో బిడ్డను పెంచేందుకు పెద్దగా ఆలోచించకు, కార్తీక్ బాబు ఇద్దరు బిడ్డలను బాగా చూసుకుంటాడని దీప మేనత్త అంటుంది.
మీ ఇద్దరితో మాట్లాడాలిరా అని కాంచన అంటుంది. మరోవైపు దాసు ఎక్కడికి వెళ్లాడు అని జ్యోత్స్న కంగారుపడుతుంది. నా కొడుకునే కిడ్నాప్ చేస్తావా. నీకు ఝలక్ ఇస్తానే సుమిత్ర కూతురా అని పారిజాతం అనుకుని కంగారుకంగారుగా వస్తుంది. నా కొడుకును కిడ్నాప్ చేశారు అని పారు చెప్పి జ్యోత్స్న మొహంలో కంగారు చూస్తుంది.
గుడికి రానన్న దీప సంచలన నిర్ణయం
దాసును కార్తీక్, దీప కిడ్నాప్ చేశారని, నేను చూశానని, ఓ ఇంట్లో దాచిపెట్టారని, ఇద్దరు రౌడీలు కాపలాగా ఉన్నారని, కార్తీక్ గాడిపై డౌట్ వచ్చి వాడిని ఫాలో అయ్యాను, అక్కడ దాసు ఉన్నాడని పారిజాతం అంటుంది. దాసును బావ ఎందుకు కిడ్నాప్ చేస్తాడు అని జ్యోత్స్న అడుగుతుంది. మరి ఇంకెవరు చేశారు అని జ్యోత్స్నను లాగిపెట్టి కొడుతుంది పారిజాతం.
మొన్నటివరకు దీప బాధపడుతుందంటే అత్త కోసం అన్నావ్. ఇప్పుడు ఎందుకు బాధపడుతుంది. దీప ఏడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు పూజకు రానంటుంది, దాచుకోలేని బాధ ఏముంది అని కార్తీక్‌ను నిలదీస్తుంది కాంచన. దీప ప్రవర్తన భయమేస్తుందని కాంచన అంటుంది. నాకు ఏ బాధ లేదని మళ్లీ ఏడుస్తుంది దీప.
నీ బిడ్డకు ఏం కాదని మాటిచ్చావ్. ఆ మాటకు కట్టుబడి ఉంటానని మాటివ్వు అని దీప చేయి పట్టుకుని అడుగుతుంది కాంచన. దానికి దీప ఏడుస్తుంటుంది. దాంతో అది డైవర్ట్ చేసేందుకు కాంచన చేయి పట్టుకుని నువ్వు అన్ని మర్చిపోయి నాన్నతో కలిసి ఉంటానని మాటివ్వు అమ్మ. నువ్వు మాటిస్తే దీప నీకు మాటిచ్చినట్లే అని అంటాడు కార్తీక్. దాంతో కాంచన తెగ షాక్ అయిపోతుంది.
ఇంట్లోంచి వెళ్లిపోతానన్న కాంచన
నాన్న అసలు వారసురాలు ఎవరో చెప్పడానికి వచ్చాడు. అది తెలిస్తే తాత నిన్ను షూట్ చేస్తాడు. దాసు నిజం చెప్పి ఉంటే నాకే కదా నీకు కూడా డేంజరే. అందుకే ఇద్దరి కోసం కిడ్నాప్ చేయించాను. ఇప్పుడు ఎక్కడో ఉన్నాడో తెలియదు. వెళ్తే బావ దగ్గరికి వెళ్తాడు. దాంతో పోలీసులతో బావ వస్తాడు. అప్పుడు మనం జైలుకు వెళ్తామని జ్యోత్స్న అంటుంది.
దాసు నిజం చెప్పిన ఏమైనా నువ్వే సొంత కూతురువని తెలుస్తుంది. ఎటు చూసిన నష్టం జరిగేది నాకే. నువ్వు నిజమైన వారసురాలివి కాకుంటే రెండోసారి కూడా రిపోర్ట్స్ మ్యాచ్ కావు. అలా అయ్యాయంటే డాక్టర్‌తో నువ్వు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుండాలి. అలా జరగలేదు అంటే ఆ రిపోర్ట్స్ నిజమే. నువ్వు ఏం చేయకుండా డాక్టర్ మార్చి ఎందుకు చెబుతుంది అని పారిజాతం అంటుంది.
మరి నేను మాట తప్పిన మనిషిగా జీవితాంతం ఉండాల్సిందేనా. నేను మోసం చేసినట్లేగా. అలా జరిగితే అత్త ఇంట్లోంచి వెళ్లిపోతుంది. అప్పుడు నా తరఫున కూడా అత్తతో మాట్లాడాలి. పుట్టబోయే బిడ్డపై ఆశలు చంపుకోమని చెప్పాలని దీప అంటుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
కార్తీక దీపం 2లో రోజుకో కొత్త ట్విస్ట్! దీప నిర్ణయం వెనుక అసలు కారణం ఏమిటి? పారిజాతం పగ ఎలా తీర్చుకుంటుంది? మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి!


