
స్టార్ మాలో ప్రసారమయ్యే కార్తీక దీపం 2 సీరియల్‌లో సుమిత్ర పాత్రలో నటించిన సీతా అయాస్, తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రెండు పెళ్లిళ్లు, ఆరోగ్య సమస్యల గురించి ఆమె పంచుకున్న విషయాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
Key Points
కార్తీక దీపం 2 సీరియల్‌లో సుమిత్ర పాత్రలో నటించిన సీతా అయాస్‌కు నిజ జీవితంలో పిల్లలు లేరు.
రెండు పెళ్ళిళ్లు, రెండు సార్లు గర్భస్రావం అనంతరం గర్భాశయం తొలగించుకోవడం వల్ల పిల్లలు లేరని సీతా అయాస్ వెల్లడించారు.
మూడేళ్ల వయసు నుంచే నటనలో ఉన్న సీతా అయాస్ తన వైవాహిక జీవితం, ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడారు.
సీతా అయాస్ నటనకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది.
సీతా అయాస్ వైవాహిక జీవితం
స్టార్ మా ఛానెల్‌లో దూసుకుపోతున్న సీరియల్స్‌లో నెంబర్ వన్ ప్లేసులో కార్తీక దీపం 2 సీరియల్ ఉంటుంది. ఇదివరకు వచ్చిన కార్తీక దీపం సీరియల్ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సీరియల్ తెచ్చుకున్నంత రేంజ్‌లో మరే ఇతర ధారావాహిక క్రేజ్ సాధించలేకపోయింది.
ఇక గత కొంతకాలంగా కార్తీక దీపం సీరియల్‌కు సీక్వెల్‌గా కార్తీక దీపం నవ వసంతం పేరుతో ధారావాహిక ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా టెలీకాస్ట్ అయిన కార్తీక దీపం 2 స్టార్ మాలోని ఇతర సీరియల్స్‌ను దాటేసి టీఆర్‌పీ రేటింగ్‌లో దూసుకుపోతోంది.
ఒక స్టార్ మాలోనే కాకుండా బుల్లితెర సీరియల్స్‌లోనే టాప్‌లో సత్తా చాటుతోంది కార్తీక దీపం 2 సీరియల్. అయితే, కార్తీక దీపం 2లోని ముఖ్య పాత్రల్లో సుమిత్ర ఒకటి. కార్తీక్‌కు అత్తగా, దీపకు కన్నతల్లిగా, అలాగే జ్యోత్స్నకు తల్లిగా ఈ పాత్ర ఉంటుంది. అలాగే, తన కూతురు జ్యోత్స్న జీవితాన్ని నాశనం చేయడానికే ఉందని దీప తన కన్నకూతురు అని తెలియక ద్వేషించే పాత్ర సుమిత్రది.
ఆరోగ్య సమస్యలు మరియు గర్భస్రావాలు
ఆ సుమిత్ర పాత్రలో ఎంతో ఒదిగిపోయి నటించారు సీతా అయాస్. సుమిత్ర రోల్‌కు ఫర్‌ఫెక్ట్ అనేలా సీతా అయాస్ నటన ఉంటుంది. ఈ సీరియల్‌లో దీప, జ్యోత్స్నకు తల్లిగా నటించిన సీతా అయాస్‌కు నిజ జీవితంలో మాత్రం పిల్లలు లేరు. అందుకు గల కారణాలను ఓ ఇంటర్వ్యూలో సీతా అయాస్ తెలిపినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.
“మూడేళ్ల వయసు నుంచి యాక్టింగ్ చేస్తున్నాను. గతంలో పెళ్లి అయి విడాకులు కూడా అయిపోయాయి. వేరే మతానికి చెందిన వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్నా. ఆయన కూడా ఇది రెండో పెళ్లే. మొదటి వైవాహిక బంధంలో భర్తతో ఎక్కువగా కలిసి ఉండలేదు. ఎప్పుడు పుట్టింట్లోనే ఉండేదాన్ని” అని సీతా అయాస్ తెలిపారు.
“నాకు పిల్లలు ఎందుకు లేరు అంటే గర్భాశయంలో కణుతులు ఏర్పడ్డాయి. మొదటి భర్తతో ఉన్నప్పుడే ఈ సమస్య తెలిసింది. తీరా రెండో పెళ్లి అయ్యాక ఆ కణతి పరిమాణం పెరిగి గడ్డ వల్ల వేరే సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరించారు. అప్పటికే రెండు సార్లు అబార్షన్ అయింది. దాంతో నేను గర్భాశయాన్నే తొలగించుకోవాల్సి వచ్చింది. అందుకే మాకు పిల్లలు లేరు” అని సీత అయాస్ చెప్పుకొచ్చారు.
పిల్లలు లేకపోవడంపై సీతా అయాస్ వివరణ
అలా తనకు ఇప్పటికీ పిల్లలు లేకపోవడానికి గల కారణాలను సీతా అయాస్ అలియాస్ సుమిత్ర వివరించారు. ఇదిలా ఉంటే, చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ కెరీర్‌ను ప్రారంభించారు సీతా. మొండి మొగుడు పెంకి పెళ్లాం, వజ్రం, రావణ బ్రహ్మ వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు.
అలాగే, తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, మలయాళ సినిమాల్లో కూడా నటించారు నటి సీతా అయాస్. అలా సుమారుగా 60కిపైగా సినిమాల్లో నటించారు సీతా అయాస్ అలియాస్ కార్తీక దీపం 2 సుమిత్ర.
చిన్నతనం నుంచి నటనలో ఉన్న సీతా అయాస్, తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్య సమస్యలు, వృత్తిపరమైన విజయాల గురించి తెలియజేశారు. ఆమె ధైర్యసాహసాలకు ప్రేక్షకులు అభినందనలు తెలియజేస్తున్నారు.


