
📌 Key Points
- దీప ఒట్టుతో ఆగ్రహించిన తండ్రి దశరథ్, కూతురుకు జరిగిన అన్యాయం తట్టుకోలేకపోయాడు!
- దాసును క్షమించిన దశరథ్, కార్తీక్ చెప్పిన నిజాలు విని చలించిపోయాడు!
- జ్యోత్స్న గుండెల్లో రైళ్లు, కార్తీక్, దీప గుడికి వెళ్లారని తెలిసి వణికిపోయింది!
- శివ నారాయణ ప్లాన్ రివీల్, శ్రీధర్ అకౌంట్స్ చూసి షాక్ అయిన జ్యోత్స్న!
కార్తీక దీపం 2 సీరియల్‌లో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. దీప తన తండ్రిని ప్రమాణం చేసి ఆపడం, దాసును దశరథ్ క్షమించడం, జ్యోత్స్న భయంతో వణికిపోవడం వంటి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈరోజు ఎపిసోడ్‌లో ఉన్నాయి.
ఒట్టుతో తండ్రిని ఆపిన దీప!
కార్తీక దీపం 2 సీరియల్ ఫిబ్రవరి 21వ ఎపిసోడ్‌లో దశరథ్ నిజం చెప్పేందుకు వెళ్తుంటే తాను చచ్చినంత ఒట్టు అని ఆపుతుంది దీప. దాంతో ఆగిపోతాడు దశరథ్. దాసును దశరథ అసహ్యించుకుంటే తను పడిన వేదన గురించి కార్తీక్ చెబుతాడు. కార్తీక్, దీప గుడికి వెళ్లారని, దశరథ ఇంట్లో లేడని తెలిసి జ్యోత్స్న వణికిపోతుంది.
కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నువ్వు నన్ను నమ్మిన నమ్మకపోయిన నేనే నీ మనవరాలిని అని తెలుస్తుంది. కానీ, ఆలోపు కథ ముగుసిపోతుంది. దాని నుంచి మనం బయటపడాలంటే దాసు బావను కలవకూడదు. కార్తీక్ బావ ఎక్కడ ఉన్నాలో తెలుసుకోవాలి అని జ్యోత్స్న అంటుంది.
దాంతో జ్యో ఊయల కుప్పకూలి కూర్చొంటుంది. తెగ వణికిపోతుంటుంది జ్యోత్స్న. నువ్వు చెప్పిన ఆట ఇది కాదు కదా అని పారిజాతం అంటుంది. మరోవైపు దశరథ ఆవేశంగా వస్తుంటే కార్తీక్, దీప ఆపుతారు. తొందరపడి ఏ తప్పు చేయకూడదు. సుమిత్ర అత్తకు జ్యో అంటే ప్రాణం. ఇప్పుడు నీ కూతురు కాదంటే తట్టుకోగలదా. రిపోర్ట్స్ మ్యాచ్ కాకుంటే దీపతో చేయించి అవి జ్యోవి అని చెప్పించా. డాక్టర్ కూడా మన మనిషే అని కార్తీక్ అంటాడు.
దాసును క్షమించిన దశరథ్!
నేను వినను. సుమిత్రకు నేను ఏదోలా చెప్పుకుంటా అని దశరథ అంటాడు. దాసు ఆపాలని చూస్తే నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది. అంతా కలిసి నా కూతురుకు అన్యాయం చేశారు. ఏం జరిగితే అది జరగని. నేను విషయం చెబుతాను దశరథ్ అంటాడు. మనకు నిజం తెలిసిందని తెలిస్తే జ్యో ఎంతకైన తెగిస్తుంది. ఇప్పుడు శౌర్య నా కూతురు కాదంటే నాకు ఎలా ఉంటుందని సుమిత్ర గురించి చెబుతుంది దీప .
దాంతో ఒట్టుపై కోప్పడుతాడు దశరథ్ . నిన్ను ఒకసారి దూరం చేసుకుంది చాలు. మరోసారి దూరం చేసుకోలేను. నీ ఒట్టుకు కట్టుబడి ఉంటాను. కానీ, ప్రళయాన్ని ఏ ఒట్టు ఆపదు. నీకు ఏదైనా జరిగితే నేను ఊరుకోను అని దశరథ్ అంటాడు. దాసును దశరథ్ తిడితే.. కాళ్లు పట్టుకుంటాడు. అయినా అసహ్యించుకుంటాడు దశరథ్.
దాసు సైడ్ నుంచి జరిగినవన్నీ చెబుతాడు కార్తీక్. చావు అంచుల వరకు, జ్యో కిడ్నాప్ అన్ని చెబుతాడు కార్తీక్. నీకు సొంత తమ్ముడు ఉన్న ఇంతలా ఆలోచించడు. దాసు మావయ్యకు కూడా అన్యాయం జరిగింది. తన కూతురుని తనకు దూరం చేసింది పారు. దాసు మావ ఈ కథను మొదలైనప్పటి నుంచి మోస్తున్నాడు. పారిజాతం కన్నవాడికి కూడా అన్యాయం చేసిందని కార్తీక్ అంటాడు.
భయంతో వణికిపోయిన జ్యోత్స్న!
మరోవైపు శ్రీధర్ అకౌంట్స్ చూపిస్తాడు శివ నారాయణ. అది చూసిన జ్యోత్స్న దశరథ్ గురించి ఆలోచిస్తుంది. శ్రీధర్ శివ నారాయణ ఇద్దరు కాశీ, స్వప్న గురించి మాట్లాడుకుంటారు. స్వప్నను సూటిపోటి మాటలతో బాధపెట్టలేను. పంతం కోసం ప్రాణం వదిలేయగలదు. ఈ జెనరేషన్ పిల్లలు తనకు నచ్చని పని జరిగితే సూసైడ్ చేసుకుంటున్నారు అని శ్రీధర్ అంటాడు.
నాకంటే మెచ్యూర్‌గా ఆలోచించావ్ అని శివ నారాయణ మెచ్చుకుంటాడు. ఇదంతా నా కొడుకును చూసే నేర్చుకున్నా అని శ్రీధర్ అంటాడు. జ్యో దగ్గరికి వచ్చి పారు నేనే ఒంటరిదాన్ని అయిపోయాను అంటుంది. నువ్వే నాకు పెద్ద శత్రువులా మారావని జ్యో అంటుంది. నిజం తెలిస్తే నాకే ఎఫెక్ట్ సరే పదా. దాసును కనిపెట్టి ఆపాలి అని పారిజాతం అంటుంది.
వద్దు. నాన్న ఇప్పుడే సంతోషంగా ఉన్నారు. ఇప్పుడే చెప్పి బాధపెట్టకు అని కార్తీక్‌తో దీప అంటుంది. కార్తీక్ ఆగిపోతాడు. తన ఆనందాన్ని అంతా పంతులుకు చెబుతాడు దశరథ్. దాసు వెళ్తానంటాడు. మన ఇంటికి వెళ్దాం పద దీప అని దశరథ్ అంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
కార్తీక దీపం 2 సీరియల్ రోజురోజుకు ఉత్కంఠగా మారుతోంది. రాబోయే ఎపిసోడ్లలో ఏం జరుగుతుందో చూడాలి. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!


