
26వ వారం తెలుగు టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ విడుదలయ్యాయి. కార్తీక దీపం 2 సీరియల్ రికార్డు స్థాయిలో రేటింగ్ సాధించింది. స్టార్ మా సీరియల్స్ టాప్‌లో నిలిచాయి.
Key Points
కార్తీక దీపం 2 సీరియల్ 14.40 టీఆర్పీ రేటింగ్‌తో రికార్డు సృష్టించింది.
స్టార్ మా సీరియల్స్ టాప్‌లో నిలిచి, ఇతర ఛానెళ్ల సీరియల్స్‌ను వెనక్కి నెట్టాయి.
ఇల్లు ఇల్లాలు పిల్లలు, ఇంటింటి రామాయణం, గుండె నిండా గుడి గంటలు సీరియల్స్ కూడా అధిక రేటింగ్స్ సాధించాయి.
బ్రహ్మముడి సీరియల్ పదో స్థానానికి పడిపోయింది.
కార్తీక దీపం 2 సీరియల్ రికార్డు రేటింగ్
తెలుగు టీవీ సీరియల్స్ కు సంబంధించి 26వ వారం టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి. వీటిలో స్టార్ మా సీరియల్స్ మరోసారి దుమ్మురేపాయి. చాలా రోజులుగా టాప్ లో ఉంటూ వస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ ఈవారం మరింత మెరుగైన రేటింగ్ తో గత రికార్డులను బ్రేక్ చేసింది.
ఈ ఏడాది 26వ వారానికి సంబంధించి తెలుగు టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. వీటిలో స్టార్ మాలో వచ్చే కార్తీక దీపం 2 సీరియల్ ఈసారి ఏకంగా 14.40 రేటింగ్ సాధించడం విశేషం. ఇదో రికార్డుగా చెప్పొచ్చు. కేవలం అర్బన్ రేటింగ్ కూడా దీనికి 11.44గా నమోదైంది. చాలా కాలంగా 12, 13 రేటింగ్స్ తో ఉంటూ వస్తున్న కార్తీకదీపం 2 సీరియల్ కు ఈ మధ్య కాలంలో ఫాలోయింగ్ ఎంత పెరిగిందో తాజా రేటింగ్ చూస్తూ తెలుస్తోంది.
స్టార్ మా సీరియల్స్ ఆధిపత్యం
ఇక రెండో స్థానంలో ఉన్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా 13.03 రేటింగ్ సాధించింది. కేవలం అర్బన్ రేటింగ్ చూస్తే 10.58గా ఉంది. మూడో స్థానంలో ఇంటింటి రామాయణం ఉంది. ఈ సీరియల్ రేటింగ్ కూడా ఈసారి పెరిగి 12.92గా నమోదైంది. నాలుగో స్థానంలో ఉన్న గుండె నిండా గుడి గంటలు 12.41 రేటింగ్ సాధించింది. ఐదో స్థానంలో చిన్ని (8.7), ఆరో స్థానంలో నువ్వుంటే నా జతగా (7.99) సీరియల్స్ నిలిచాయి. అయితే బ్రహ్మముడి (6.89) మాత్రం ఈవారం పదో స్థానానికి పడిపోయింది.
ఇక జీ తెలుగు సీరియల్స్ కూడా ఈ 26వ వారం కాస్త మెరుగైన రేటింగ్సే సాధించాయి. ఓవరాల్ గా చూస్తే టాప్ 10లో ఆ ఛానెల్ నుంచి 7, 8, 9 స్థానాల్లో మూడు సీరియల్స్ నిలిచాయి. జీ తెలుగులో అత్యధికంగా మేఘ సందేశం 7.60 రేటింగ్ సాధించగా.. చామంతి సీరియల్ 7.51తో ఉంది. ఇక 9వ స్థానంలో జగద్ధాత్రి 7.50తో నిలిచింది. మిగిలిన సీరియల్స్ విషయానికి వస్తే లక్ష్మీ నివాసం 6.80, అమ్మాయిగారు 5.72 రేటింగ్స్ సాధించాయి.
బ్రహ్మముడి సీరియల్ పతనం
ఈవారం జీ తెలుగు సీరియల్స్ కాస్త మెరుగ్గానే ఉన్నా.. టాప్ లో ఉన్న స్టార్ మా సీరియల్స్ కు మాత్రం దరిదాపుల్లో కూడా లేవు. ముఖ్యంగా కార్తీకదీపం 2, ఇల్లు ఇల్లాలు పిల్లలు, ఇంటింటి రామాయణం, గుండె నిండా గుడి గంటలు సీరియల్స్ కొన్నాళ్లుగా టీఆర్పీ రేటింగ్స్ లో టాప్ 4 నుంచి కదలడం లేదు. పైగా ప్రతి వారం తమ రేటింగ్స్ మెరుగు పరచుకుంటూనే ఉన్నాయి.
మొత్తంగా, ఈ వారం టీవీ సీరియల్స్ రేటింగ్స్‌లో స్టార్ మా ఛానెల్ సీరియల్స్ ఆధిపత్యం చూపించాయి. కార్తీక దీపం 2 సీరియల్ రికార్డు సృష్టించడం విశేషం.


