
📌 Key Points
- కార్తీక్ మాస్ వార్నింగ్: జ్యోత్స్న పాపాలకు పాడె కట్టేందుకు సిద్ధం!
- శౌర్య కిడ్నాప్: దీప, కార్తీక్ ఆందోళనతో హాస్పిటల్ నుండి పరుగులు!
- సుమిత్ర ఆపరేషన్: కార్తీక్ మాటలతో ధైర్యం చెప్పిన దీప!
- హోమం చేస్తున్న దశరథ్: కార్తీక్ ఫ్యామిలీకి కొత్త టెన్షన్!
కార్తీక దీపం 2 సీరియల్ లో సరికొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. శౌర్య కిడ్నాప్ అవ్వడంతో దీప, కార్తీక్ ఆందోళన చెందుతున్నారు. జ్యోత్స్నకు కార్తీక్ గట్టి వార్నింగ్ ఇవ్వడంతో కథ ఉత్కంఠగా మారింది.
శౌర్య కిడ్నాప్ వెనుక ఎవరు?
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 18 ఎపిసోడ్ లో అసలు గుట్టు ఎక్కడ తెలుస్తుందోనని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. దీప, కార్తీక్ ను హాస్పిటల్ నుంచి బయటకు రప్పించేందుకు శౌర్యను కిడ్నాప్ చేయిస్తుంది. ఈ విషయం తెలిసి కార్తీక్, దీప కంగారు పడతారు. మరోవైపు దశరథ హోమం చేస్తాడు.
కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 18 ఎపిసోడ్ లో.. చేస్తున్న పాపాలు ఇక్కడితో ఆపేయమని జ్యోత్స్నను దాసు అడుగుతాడు. నువ్వు ఊహించిన దానికంటే నా చేతలు భయంకరంగా ఉంటాయి. నువ్వు ఏం చేయలేవ్? నేను దశరథ కూతురిని అని చెప్పి జ్యోత్స్న వెళ్లిపోతుంది.
జ్యోత్స్నకు కార్తీక్ స్ట్రాంగ్ వార్నింగ్!
తప్పులు చేసింది ఎవరైనా సరే వెంటనే సరిచేసుకోవాలి. లేదంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. మీరు తప్పులు చేయరు పారు. కానీ కొంతమంది తప్పులు చేస్తున్నామనుకుని పాపాలు చేస్తారు. నేను బరిలోకి దిగితే వాళ్ల పాపాలకు పాడె కట్టినట్లేనని జ్యోత్స్నకు పరోక్షంగా కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు. అత్త నీకు ఏ భయం లేదు, ఏం జరిగిన సరే నీ కూతురే నిన్ను కాపాడుతుందని సుమిత్రకు చెప్పి కార్తీక్ బయటకు వెళ్తాడు.
సుమిత్ర ఆపరేషన్లో ట్విస్ట్ ఏంటి?
సుమిత్రను ఆపరేషన్ కు రెడీ చేయడానికి, దీప ఇక్కడ ఉండటానికి సంబంధం ఏంటి డాక్టర్ అని పారిజాతం అడగడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
కార్తీక దీపం 2 సీరియల్ రోజురోజుకు ఉత్కంఠగా మారుతోంది. శౌర్య కిడ్నాప్, కార్తీక్ వార్నింగ్ లతో కథనం ఆసక్తికరంగా సాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!


