|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కార్తీక దీపం 2: దీపను నిలదీసిన సుమిత్ర! గురువు షాకింగ్ కామెంట్స్! దశరథ్ కు దిమ్మతిరిగే షాక్!

Published: 15-03-2026, 11:05 PM
కార్తీక దీపం 2: దీపను నిలదీసిన సుమిత్ర! గురువు షాకింగ్ కామెంట్స్! దశరథ్ కు దిమ్మతిరిగే షాక్!
  • సుమిత్ర గదిలో దీప, కార్తీక్, దశరథ్ ల సందడి.. ఆరోగ్యం గురించి ఆరా!
  • జ్యోత్స్న ఎంట్రీతో దీప హాస్పిటల్ కి ఎందుకు వెళ్లిందో చెప్పిన జ్యోత్స్న.. షాక్ లో సుమిత్ర!
  • దీప ఎప్పుడూ ఒకరి చావు కోరుకుంటుంది.. ఒకప్పుడు డాడీని, ఇప్పుడు బిడ్డను చంపాలనుకుంటుంది – జ్యోత్స్న ఫైర్
  • కార్తీక్ సీరియస్ వార్నింగ్.. కాంచన సంతోషాన్ని దూరం చేస్తోంది అంటూ జ్యోత్స్న ఆవేదన!

కార్తీక దీపం 2 సీరియల్ లో సరికొత్త ట్విస్ట్. దీపను సుమిత్ర నిలదీయడంతో కథనం మరింత ఆసక్తికరంగా మారింది. గురువుగారి సంచలన వ్యాఖ్యలు, దశరథ్ కు ఊహించని షాక్ తో ఏం జరగబోతుందో చూడాలి.

దీపను ప్రశ్నించిన సుమిత్ర!

కార్తీక దీపం 2 సీరియల్ సోమవారం ఎపిసోడ్ లో.. సుమిత్రను చూడ్డానికి తన గదిలోకి వెళ్తారు దీప, కార్తీక్, దశరథ. మీకు ఎలా ఉందమ్మా అని సుమిత్రను అడుగుతుంది దీప. నాకు బాగానే ఉంది.. కానీ నువ్వు ఎందుకు హాస్పిటల్ నుంచి వచ్చావు. డాక్టర్లు బిడ్డ క్షేమంగా ఉందని చెప్పారా అని అడుగుతుంది సుమిత్ర. నువ్వు ఎన్నిసార్లు అడిగినా తను బిడ్డ గురించి చెప్పదు మమ్మీ.. అంటూ గదిలోకి వస్తుంది జ్యోత్స్న. తను ఆ బిడ్డను వదిలించుకోవడానికే హాస్పిటల్ కి వెళ్లింది అని చెప్తుంది. షాక్ అవుతుంది సుమిత్ర.

ఏంటి దీప ఇది. నువ్వు ఆ పని ఎలా చేయగలుగుతున్నావు అని ప్రశ్నిస్తుంది సుమిత్ర. ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని జ్యోత్స్నకు ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. ఈ దీప ఎప్పుడూ ఎవరో ఒకరి చావును కోరుకుంటూనే ఉంటుంది. ఒకప్పుడు మా డాడీని చంపాలనుకుంది. ఇప్పుడు బిడ్డను చంపాలనుకుంటోంది అంటుంది జ్యోత్స్న. అవును మేము లారీలతో, కార్లతో తొక్కించి మనుషులు చంపుతుంటాం అంటాడు కార్తీక్.

కాంచన అత్తకున్న ఒకే ఒక సంతోషాన్ని దీప దూరం చేస్తోంది. నువ్వు అయినా చెప్పు మమ్మీ బిడ్డను వదులుకోవద్దు అని అంటుంది జ్యోత్స్న. కన్న బిడ్డను ఎవరైనా కాదనుకుంటారా.. జ్యోత్స్నను నా నుంచి ఎవరైనా దూరం చేస్తే నేను ఊరుకుంటానా.. నా ప్రాణం పోతుంది. నువ్వెలా ఇలా చేయగలుగుతున్నావు. నీకు అంత కష్టం ఏం వచ్చిందని ఎమోషనల్ అవుతుంది సుమిత్ర. అందరిని అక్కడినుంచి వెళ్లిపోమని సుమిత్రను పడుకోబెడతాడు దశరథ.

గురువు గారి సంచలన వ్యాఖ్యలు!

మీరు అయినా దీపతో చెప్పండి. తన కడుపులో బిడ్డ బ్రతకాలి అని దశరథతో చెప్తుంది సుమిత్ర. బిడ్డ బ్రతకాలి అనేది అందరి కోరిక సుమిత్ర. నా ప్రయత్నం నేను చేస్తాను. అందుకోసం నేను ఒక దగ్గరికి వెళ్లాలి నువ్వు పడుకో అని చెప్పి వెళ్తాడు దశరథ. గదిలో నుంచి బయటకు వచ్చిన దీప, కార్తీక్ తో ఇక్కడ అమ్మ ఎంత బాధపడుతుందో అత్త అంతకంటే ఎక్కువ బాధపడుతుంటుంది. ఒకసారి అత్త దగ్గరికి వెళ్లి మాట్లాడు అంటుంది.

దీప మాటలను గుర్తుచేసుకొని బాధపడుతుంటుంది కాంచన. ఇంటికి వెళ్దామా అంటాడు శ్రీధర్. ఇంతలో కార్తీక్ వచ్చి అమ్మ నీతో మాట్లాడాలి అంటాడు. నేను వాడితో మాట్లాడనని చెప్పండి అని శ్రీధర్ తో అంటుంది కాంచన. నువ్వు కాసేపు ఆగు.. వాడు ఏం చెప్తున్నాడో వినాలి కదా.. నేను వింటాను అంటాడు శ్రీధర్. నువ్వు వదిలేసుకున్నంత ఈజీగా నేను నా పిల్లల్ని వదులుకోలేనురా అని కార్తీక్ ని ఉద్దేశించి అంటాడు శ్రీధర్.

నా కొడుకు ఏదైనా పనిచేస్తే ఆలోచించే చేస్తాడు అనే నమ్మకం నాకు ఉండేది. కానీ ఈ రోజు నువ్వు తీసుకున్న నిర్ణయం నిన్ను ఆకాశం అంత ఎత్తునుంతి కిందకు పడేసింది. మళ్లీ పిల్లలు పుట్టరని తెలిసి కూడా నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావంటే దాని వెనుక ఏదో బలమైన కారణం ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఆ కారణం ఏంటో చెప్పు కార్తీక్ అంటాడు శ్రీధర్. ఏం లేదు, ఉంటే నువ్వు కనిపెట్టు మాస్టారు అంటాడు కార్తీక్. కచ్చితంగా తెలుసుకుంటాను అని కాంచనను తీసుకొని వెళ్లిపోతాడు శ్రీధర్.

దశరథ్ కు ఊహించని షాక్!

మరోవైపు గురువు గారిని కలవడానికి గుడికి వెళ్తాడు దశరథ. మీరు నిజాన్ని ముందే గ్రహించారు. కానీ నాకు ఆలస్యంగా తెలిసింది. ఈ జాతకం ఉన్న వ్యక్తి భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పండి అని దీప జాతకాన్ని చూపిస్తాడు దశరథ. ఈ జాతకం కలిగిన వ్యక్తి పెద్ద ప్రమాదం అంచున ఉంది. తన ఉనికే తనకు ప్రమాదం. రాబోయే ప్రమాదం నుంచి తను తప్పించుకోలేదు అంటాడు గురువు. షాక్ అవుతాడు దశరథ.

మరోవైపు దీప, కార్తీక్ మాట్లాడుకుంటూ ఉంటారు. అవసరం నాది కానీ.. నిందలు నువ్వు పడుతున్నావు బావ అని బాధపడుతుంది దీప. అత్తకు ఆపరేషన్ జరిగేంత వరకు ఎన్ని అవమానాలైనా మోయాలి. మనం తీసుకున్న నిర్ణయం మీద మనకే నమ్మకం లేకపోతే ఎలా.. అయినా మనం ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నామో వాళ్లందరికీ తెలియదు కదా అంటాడు కార్తీక్. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

కార్తీక దీపం 2 సీరియల్ లో ఎన్నో మలుపులు తిరుగుతున్న కథనం ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.