|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: సీఈవో పదవికి ఓటింగ్-క్లీన్ స్వీప్‌తో గెలిచిన దీప- చివర్లో ట్విస్ట్-కొత్త క్యారెక్టర్ ఎంట్రీ

Published: 11-11-2025, 1:30 AM
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: సీఈవో పదవికి ఓటింగ్-క్లీన్ స్వీప్‌తో గెలిచిన దీప- చివర్లో ట్విస్ట్-కొత్త క్యారెక్టర్ ఎంట్రీ

కార్తీక దీపం 2 సీరియల్ నేటి ఎపిసోడ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. సీఈవో పదవికి జరిగిన ఓటింగ్‌లో దీప అద్భుత విజయం సాధించింది. ఆమె వ్యాపార నైపుణ్యాలను కార్తీక్ వివరించడంతో బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా దీప వైపు నిలిచారు. అయితే, చివర్లో దీప ఇచ్చిన ట్విస్ట్ అందరినీ ఆశ్చర్యపరిచింది.

Key Points

1

కార్తీక్ దీపను సీఈవో పదవికి ప్రపోజ్ చేయగా, జ్యోత్స్న అభ్యంతరం వ్యక్తం చేసింది.

2

దీప చిన్ననాటి వ్యాపార మెళకువలను కార్తీక్ వివరించడంతో బోర్డు సభ్యులు ఒప్పందారు.

4

చివర్లో దీప తాను సీఈవోగా ఉండలేనని అనూహ్యమైన ట్విస్ట్ ఇచ్చింది.

దీపను సీఈవోగా కార్తీక్ ఎందుకు ప్రపోజ్ చేశాడు?

కార్తీక దీపం 2 సీరియల్ నవంబర్ 11 ఎపిసోడ్‌లో సీఈవో పదవికి దీపను కార్తీక్ ప్రపోజ్ చేస్తే ఏం అర్హతలు ఉన్నాయని వాదిస్తుంది జ్యోత్స్న. దీప చిన్నతనం నుంచి చేసిన బిజినెస్ మెళకువల గురించి చెబుతాడు కార్తీక్. సీఈవో పదవికి ఓటింగ్ పెడితే దీప క్లీన్ స్వీప్‌తో గెలిచేస్తుంది. దీపను సీఈవోగా ప్రకటిస్తారు.

కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో కొత్త సీఈఓ గురించి బోర్డ్ మీటింగ్ జరుగుతుంది. కొత్త సీఈఓగా దీపను ప్రపోజ్ చేస్తున్నట్లు కార్తీక్ చెబుతాడు. ఈ నిర్ణయం తనకు నచ్చలేదని దీప వెళ్లిపోతుంది. కార్తీక్ వెళ్లి దీపతో మాట్లాడుతాడు. ఇంటికోసం నువ్వు కూడా బలంగా నిలబడాలని చెప్పానుగా. ఇదంతా మనదేగా. మనమే కాపాడుకోవాలని దీపను వెనక్కి తీసుకొస్తాడు కార్తీక్.

పల్లెటూరు మొద్దు పదాన్ని కార్తీక్ ఖండిస్తే జ్యోత్స్న వెనక్కి తీసుకుంటుంది. దీప ఏం చేయగలదు. ల్యాప్‌టాప్ ఆపరేట్ చేయరాదు, ఇంగ్లీష్ రాదు. అయినా బోర్డ్ మెంబర్స్ ఎలా సపోర్ట్ చేస్తారు అని జ్యోత్స్న అంటుంది. అసలు దీప ఎవరో తెలిస్తే తనకున్న అర్హతలు, యోగ్యత తెలుస్తుంది అని కార్తీక్ అంటాడు. దీప చిన్నతనం గురించి చెబుతాడు.

సీఈవో ఓటింగ్‌లో దీప క్లీన్ స్వీప్ విజయం

తన తండ్రి హోటల్‌లో పెట్టిన స్కీమ్స్, నడిపించిన తీరు అన్ని చెబుతాడు కార్తీక్. దివాళ తీసిన సత్యరాజ్ హోటల్‌ సక్సెస్ కావడానికి కారణం దీప. అవార్డ్ ఇద్దరం కలిసే తీసుకున్నాం. అది రావడానికి కారణం దీపే. ప్రతి విషయంలో దీపకు లోతైనా అవగాహన ఉంది. ఇవి సరిపోవా అని కార్తీక్ అంటాడు. సరిపోవు. నేను దీపను సీఈఓగా ఒప్పుకోను అని జ్యో అంటుంది.

ఈ ఓటింగ్‌లో దీప, జ్యోత్స్న, కార్తీక్, సుమిత్ర , పారిజాతంకు ఓట్ లేదు. కేవలం మనం ఏడుగురం మాత్రమే ఓటింగ్ వేయాలి. నా నిర్ణయం చివరిలో చెబుతాను. మీరంతా రాయండి అని శివ నారాయణ అంటాడు. సుమిత్ర వాలకం చూస్తుంటే దీపే గెలవాలని కోరుకుంటున్నట్లుందని పారు అనుకుంటుంది. శివ నారాయణ ఓట్లు లెక్కిస్తాడు.

ఆరు ఓట్లు యూనానమస్‌గా దీపకే పడతాయి. ఆరు ఓట్లు పడ్డాక నా ఓటుతో పనేముంది. నెక్ట్స్ సీఈఓ కార్తీక్ భార్య దీపే అని శివ నారాయణ ప్రకటిస్తాడు. అలా సీఈఓ ఓటింగ్‌లో దీప క్లీన్ స్వీప్ చేస్తుంది. అంతా చప్పట్లు కొడతారు. సొంత వాళ్లే మోసం చేశారు అని పారు అనుకుంటుంది. డాడీ నువ్వు కూడా దీపకే వేశావుగా. ఇది గుర్తు పెట్టుకుంటాను అని జ్యో అనుకుంటుంది.

చివరిలో అనూహ్యమైన ట్విస్ట్: దీప నిర్ణయం

అలా చెప్పలేకపోతున్నందుకు క్షమించండి అని చివరిలో ట్విస్ట్ ఇస్తుంది దీప. దాంతో పారు కూర్చుంటుంది. తాను సీఈఓగా ఉండలేనని, అందరిని క్షమించమని, నాకు ఈ స్థానం వద్దని అంటుంది దీప. నిజానికి ఇక్కడ నువ్వు ఉండాలి. నిన్ను రెండుసార్లు అవమానించారు. నిన్ను అవమానించిన స్థానంలో నేను ఉండలేను. నేను సీఈఓగా ఉంటే నీ స్థానం ఏంటీ అని దీప అంటుంది.

డ్రైవర్ పోస్టేగా అని జ్యో అంటుంది. విన్నావుగా.. నిన్వు అవమానించిన పోస్ట్‌లో నేనుండలేను, నాకు నువ్వు చాలు, ఇవేవి వద్దు అని దీప అంటుంది. దానికి షభాష్ అని శివ నారాయణ చప్పట్లు కొడతాడు. అర్హత లేకున్న అధికారం కోసం ఆశపడేవారు ఒకవైపు, అధికారం వచ్చిన ఆశపడని మరొకరు. కార్తీక్ నీ భార్యకు నువ్వైనా చెప్పు అని శివ నారాయణ అంటాడు.

మరి సీఈఓ ఎవరు అని జ్యోత్స్న అంటే.. ప్రతి ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉందని శివ నారాయణ అంటాడు. మరోవైపు బ్లాక్ సూట్‌లో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

మొత్తానికి, దీప విజయం సాధించినప్పటికీ, సీఈవో పదవిపై ఆమె తీసుకున్న అనూహ్య నిర్ణయం కథనంలో కొత్త మలుపులు తిప్పనుంది. రాబోయే ఎపిసోడ్‌లలో ఈ ట్విస్ట్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.