
కార్తీక దీపం 2 సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్‌లో పారిజాతం చేసిన తప్పుకు శివ నారాయణ, కార్తీక్ మరియు శౌర్య ఎలా స్పందిస్తారో చూద్దాం. పారిజాతం యొక్క భావోద్వేగాలు, శౌర్య యొక్క సహాయం, మరియు కార్తీక్ యొక్క విమర్శలు ఈ ఎపిసోడ్‌ను ఆసక్తికరంగా మార్చాయి.
Key Points
పారిజాతం చాక్లెట్ దొంగతనం చేసింది.
శౌర్య పారిజాతంను సముదాయించింది.
కార్తీక్ పారిజాతంను స్వార్థపరురాలి అని నిందించాడు.
శివ నారాయణ శౌర్య డ్రాయింగ్‌ను చూసి ఆశ్చర్యపోయాడు.
పారిజాతం యొక్క చాక్లెట్ దొంగతనం
కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో పారిజాతంను శివ నారాయణ పిలుస్తాడు. శివ నారాయణ తిడితే మురిసిపోతుంది పారిజాతం. డ్రాయింగ్స్, పెన్స్ చంటిదానికి ఇవ్వు. తప్పు చేసిన దానితోనే సరిదిద్దించాలి. చాక్లెట్స్ దొంగతనం చేశావుగా వెళ్లి ఇవ్వు అని శివ నారాయణ అంటాడు. దాంతో శౌర్యకు పారిజాతం ముద్దుల తాతయ్య ఇవ్వమన్నాడు అని చెప్పి డ్రాయింగ్ బుక్స్ ఇస్తుంది.
నా దగ్గ రెండు చాక్లెట్స్ ఉన్నాయి. ఒకటి నీకు ఒకటి నాకు అని శౌర్య చెబుతుంది. దానికి ఇది ఎంత మంచిది అన్నట్లుగా పారిజాతం ఎమోషనల్ అవుతుంది. నేనేం ముద్దుల తాతయ్యకు చెప్పను. తిను అని చాక్లెట్ ఇస్తుంది శౌర్య. సారీనే అని చెప్పిన పారిజాతం కళ్లు చెమ్మగిల్లుతాయి. చాక్లెట్స్ ఇస్తే థ్యాంక్స్ చెబుతారు అని శౌర్య అంటే.. అది అంతేనే.. అని వెళ్లిపోతుంది పారిజాతం.
పారు వెనక్కి తిరగ్గానే కార్తీక్ ఉంటాడు. నువ్వు మంచిదానివే పారిజాతం. కానీ, స్వార్థపరురాలివి అని కార్తీక్ అంటే నావాళ్లు బాగుండాలని అనుకోవడం స్వార్థమా. నేను చేసిన పాపాలకు ఒక్కటంటే ఒక్కటి సాక్ష్యం చూపించు అని పారు అంటుంది. మనవాళ్లే ఉండాలనుకోవడం స్వార్థం. నీ పాపానికి నిలువెత్తు సాక్ష్యం ఇంట్లోనే తిరుగుతుంది అని కార్తీక్ అంటాడు.
ఏంట్రా అన్నావ్ అని పారు అంటుంది. మనం చేసిన పాపాలకు సాక్ష్యాలు మనచుట్టూ నీడల్లా తిరుగుతాయన్నాను అని కార్తీక్ చాక్లెట్ పట్టుకుని వెళ్లిపోతాడు. వీడు ఏదో పెద్ద మాటే అన్నాడు అని పారు అనుకుంటుంది. శౌర్య కేక్ బొమ్మ డ్రాయింగ్ వేస్తుంటుంది. ఇంతలో శివ నారాయణ వచ్చి ఏం చేస్తున్నావ్, ఏం డ్రాయింగ్ వేస్తున్నావ్ అని అడుగుతాడు. శౌర్య చూపించదు.
శౌర్య మరియు పారిజాతం మధ్య సంఘటనలు
అదంతా కార్తీక్ చూసి దీపకు దగ్గరికి వెళ్లి శౌర్యకు పెద్ద టాస్కే ఇచ్చావ్‌గా. అది బర్త్ డే అని ఎవరికి తెలియకుండా చాలా కష్టపడుతుంది అంటాడు. పొరపాటున శౌర్య బర్త్ డే విషయం బయటపడితే మనం ఎందుకు చెప్పలేదని తాత అడుగుతాడు అని కార్తీక్ అంటాడు. వంట అయిపోయింది. తాతను పర్మిషన్ అడిగి వెళ్లిపోదామని దీప అంటుంది. మరోవైపు శౌర్య వేసిన డ్రాయింగ్ శివ నారాయణ చూస్తాడు.
ఆ డ్రాయింగ్‌కు అర్థం ఏంటే అని అడుగుతాడు. శౌర్య చెప్పదు. ఆ డ్రాయింగ్ నచ్చిందని గిఫ్ట్‌గా ఇవ్వమని అడుగుతాడు శివ నారాయణ. దానికి సరే అని శౌర్య అంటుంది. ఇది వట్టి గీతలు కాదు శౌర్య మనసులో ఉన్న కోరికలు. ఇది చెప్పాల్సినవాళ్లతోనే చెప్పిస్తాను అని శివ నారాయణ వెళ్లిపోతాడు. మరోవైపు దొండకాయలను పారిజాతం ఏడుస్తూ తింటుంది.
శివ నారాయణ వచ్చి శౌర్య డ్రాయింగ్ చూపించి.. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. శౌర్య ఎందుకు స్కూల్‌కు వెళ్లలేదో తెలుసుకోవాలి. తెలుసుకుంటే పదివేలు ఇస్తానని పారిజాతానికి ఆఫర్ ఇస్తాడు శివ నారాయణ. నా చతురత చూపిస్తాను. మీరు ఇచ్చే పదివేల నజరానా అందుకుంటాను అని కాంచనకు కాల్ చేస్తుంది పారిజాతం. పిన్నితో మాట్లాడితే లేనిపోని గొడవలు వస్తాయని కాంచన లిఫ్ట్ చేయదు.
దాంతో శివ నారాయణ 20 వేలు ఆఫర్ ఇస్తాడు. మళ్లీ కాంచనకు కాల్ చేస్తుంది పారిజాతం. దాంతో లిఫ్ట్ చేస్తుంది కాంచన. పారు ఏదోదే మాట్లాడితే కాల్ ఎందుకు చేశారో చెప్పమని కాంచన అంటుంది. శౌర్య ఇంటికి వచ్చింది. కార్పొరేట్ స్కూల్‌లో చేర్పించారు. స్కూల్ ఫీజు కట్టకపోయేసరికి గెంటేసినట్లున్నారు. మన స్థోమతకు తగినట్లు వీధి బడుల్లో చేర్పించండి అని పారిజాతం రెచ్చగొడుతుంది.
కార్తీక్ మరియు పారిజాతం మధ్య వాదన
నా కొడుకు శౌర్యను స్కూల్ మానిపించింది ఫీజ్ కట్టలేక కాదు. ఇవాళ దాని పుట్టినరోజు అని కాంచన నిజం చెబుతుంది. అయ్యో దీప చెప్పకన్నదే. చెప్పేశాను అని మళ్లీ కంగారుపడుతుంది కాంచన. మరి పుట్టినరోజు అయితే ఒంటి మీద బట్టలు లేవు. వాటికి కూడా డబ్బులు లేవా అని పారు అంటే.. ఏం చేయాలో చేయకూడదో మాకు తెలుసు అని కాల్ కట్ చేస్తుంది కాంచన .
నిజం తెలుసుకునే పద్ధతి ఇదా అని శివ నారాయణ అంటే.. కొన్నిసార్లు నోరు వాడాలండి అని పారు అంటుంది. శివ నారాయణ ఇచ్చిన 20 వేలు తీసుకుని సంబరపడిపోతుంది పారిజాతం. కార్తీక్‌కు కాల్ చేసి పారిజాతం అడిగితే నిజం చెప్పానని కాంచన చెబుతుంది. ఉన్నట్టుండి శౌర్య గురించి అడగడం ఏంటీ. మీరు త్వరగా ఇంటికి రండి అని కాంచన చెబుతుంది.
దీప గురించి కార్తీక్ వెతుకుతాడు. ఇంతలో శౌర్య వచ్చి నిన్ను ముద్దుల తాత పిలుస్తున్నాడు అని చెబుతుంది. కార్తీక్ వెళ్తాడు. ఏంటీ పంచాయితీ పెట్టారు అని అనుకుంటాడు కార్తీక్. ఎందుకు పిలిచారు అని కార్తీక్ అడుగుతాడు. దీపను పాయసం పెట్టమంటే మా ఆయనకు పని ఉంది మధ్యాహ్నాం వెళ్తామని చెప్పింది ఎందుకు అని శివ నారాయణ అడుగుతాడు.
నేను, నా కూతురు, భార్యకు పని ఉంది. అందుకే పెద్ద కారణం ఏం లేదని కార్తీక్ అంటాడు. అవునా. అయితే వెళ్లిపోండి అని చెబుతాడు శివ నారాయణ. కార్తీక్ వాళ్లు వెళ్తుంటే ఒక్క నిమిషం ఆగమని శివ నారాయణ చెబుతాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ఈ ఎపిసోడ్‌లో పారిజాతం యొక్క తప్పులకు శిక్ష, శౌర్య యొక్క మంచితనం, మరియు కార్తీక్ యొక్క ఆరోపణలు ప్రధానంగా కనిపించాయి. కథనం ఆసక్తికరంగా ముగిసింది.


