
కార్తీక దీపం 2 సీరియల్ లోని ఈరోజు ఎపిసోడ్ లో, కాశీ అరెస్ట్ అయ్యాడు. శ్రీధర్ అతనిని కాపాడటానికి ఇష్టపడకపోవడంతో స్వప్న ఆందోళన చెందుతోంది. జ్యోత్స్నకు సుమిత్ర చెప్పిన షాకింగ్ వార్త ఏమిటో తెలుసుకుందాం.
Key Points
పోలీస్ స్టేషన్లో కాశీ అరెస్టు!
శ్రీధర్ పట్టించుకోకపోవడంతో స్వప్న ఆందోళన.
జ్యోత్స్నకు సుమిత్ర షాకింగ్ వార్త.
కార్తీక్ ప్రాణదాత ఎవరు? రహస్యం కొనసాగుతోంది.
కాశీ అరెస్టుతో కుటుంబంలో తీవ్ర ఉద్రిక్తత
కార్తీక దీపం 2 టుడే సెప్టెంబర్ 10వ తేదీ ఎపిసోడ్ లో నమ్మకం పోతే దోషిలాగే చూస్తారని జ్యోత్స్నకు చెప్తుంది సుమిత్ర. ఏరా డ్రైవర్, ఎంప్లాయిస్ ను ఇంటికి పంపించింది నువ్వే కదా అని కార్తీక్ తో పారిజాతం అంటుంది. సీఈఓ పోస్టుకు నువ్వు కర్చీఫ్ వేసుకున్నావని నాకు తెలుసు. ఈ వంకతో జ్యోత్స్నను ఓడించి సీఈఓ అయిపోదామనే కదా పెద్దాయనను బుట్టలో వేసుకున్నావని పారు అంటుంది.
జ్యోత్స్న నా మనవరాలు. దాన్ని గెలిపిస్తాను చూడు కార్తీక్ తో ఛాలెంజ్ చేస్తుంది పారిజాతం. జ్యోత్స్నను ఎలాగైనా కాపాడాలని పారు అనుకుంటుంది. నమ్మకం గురించి సుమిత్ర అన్న మాటలను గుర్తు చేసుకుంటున్న దీప దగ్గరకు కార్తీక్ వస్తాడు. అత్త మాటలకు అందరూ షాక్. నువ్వు చెప్పినట్లే అత్త చెప్పింది. మీరు తల్లీకూతురు కదా అని కార్తీక్ అంటాడు. చివర్లో నమ్మకం గురించి చెప్పిన మాటలు నాకు కూడా వర్తిస్తాయి బావ అని దీప చెప్తుంది. నేను కూడా నమ్మకం కోల్పోయానని దీప అంటుంది.
మా నాన్నను షూట్ చేయలేదు కానీ నింద మోస్తున్నానని దీప అంటే, అది నిరూపిస్తానని చెప్పాను కదా అని అంటాడు కార్తీక్. నిన్ను, అత్తను కలుపుతానని చెప్తాడు. అమ్మానాన్నను కూడా కలుపుతా అన్నావు. ఉదయాన్నే ఐడియా చెప్తానన్నావు, ఎక్కడుంది ఐడియా? అని ప్రశ్నిస్తుంది దీప. కాఫీ అడిగితే దీప ఇవ్వదు. మళ్లీ రా బావ అని ప్రేమగా పిలుస్తుంది. ఇద్దరు కాసేపు ప్రేమగా మాట్లాడుకుంటారు.
మరోవైపు కారుకు యాక్సిడెంట్ అయిందని కావేరీ, శ్రీధర్ కు స్వప్న చెప్తుంది. మేం చూస్తుండగానే యాక్సిడెంట్ అయింది. అతను హాస్పిటల్లో ఉన్నాడు. కండీషన్ సీరియస్ గా ఉంది. నిర్లక్ష్యంగా నడిపి యాక్సిడెంట్ చేసాడని కాశీని పోలీసులు అరెస్టు చేశారని స్వప్న ఏడుస్తూ చెప్పింది. అల్లుడిని కాపాడమని కావేరీ అంటే, ఎందుకు కాపాడాలని శ్రీధర్ అడుగుతాడు. కావేరీ, స్వప్న ఎంత అరిచినా శ్రీధర్ మౌనంగానే ఉంటాడు. మా ఆయన్ని కాపాడమని చెప్పు అని తల్లితో అంటుంది స్వప్న. అప్పుడే కార్తీక్ మాటలను గుర్తు చేసుకుంటాడు శ్రీధర్. అయినా మౌనంగానే ఉంటాడు.
శ్రీధర్ ప్రవర్తనతో స్వప్న, కావేరి ఆందోళన
ఈ చెల్లికి కష్టం వస్తే ఆదుకోవడానికి అన్నయ్య ఉన్నాడని కార్తీక్ కు కాల్ చేయడానికి స్వప్న ట్రై చేస్తుంది. కానీ ఫోన్ చేయడానికి వీల్లేదని ఫోన్ లాక్కుంటాడు శ్రీధర్. కావేరీ ఫోన్ కూడా లాక్కుంటాడు. అలాగే కావేరీ, స్వప్న ఎక్కడికి వెళ్లకుండా బయట నుంచి డోర్ లాక్ వేసి వెళ్లిపోతాడు శ్రీధర్. ఇప్పుడు కాశీని ఎలా కాపాడుకోవాలని ఏడుస్తుంది స్వప్న.
సుమిత్ర దగ్గరకు పారిజాతం, జ్యోత్స్న వెళ్లి రెచ్చగొట్టాలని చూస్తారు. కూతురు తరపున నిలబడి మామయ్యను నిలదీయాల్సింది పోయి నువ్వు కూడా ఆయన మాటలకే వత్తాసు పలుకుతున్నావా? అని ప్రశ్నిస్తుంది పారు. నెల రోజుల్లో ఎలా సరిదిద్దుకోవాలో అని తను ఆలోచించాలి, మీరెందుకు అడుగుతున్నారని సుమిత్ర అంటుంది. కొన్ని సార్లు వదిలేయడం కూడా బాధ్యతేనని సుమిత్ర చెప్తుంది. పోయే పోస్టును కాపాడుకోవడం కాదు. కంపెనీని లాభాల్లోకి తీసుకురావాలి. తప్పు చేస్తే ఒప్పుకోవాలి. కొన్ని సార్లు తప్పులకు చాలా పెద్ద శిక్షలుంటాయని సుమిత్ర అంటుంది.
జ్యోత్స్న కు ఏదైనా కావాలనుకుంటే ముందు, వెనుక ఆలోచించదు. ఈ పద్ధతి చిన్నప్పటి నుంచి ఉంది. మనలో మనమైనా నిజాలు మాట్లాడుకోవాలి. ఇది కలువ పూల కోసం కార్తీక్ ను కోనేట్లో దింపిన సంగతి మీకు గుర్తులేదా? కార్తీక్ కు నీరంటే భయమైనా బలవంతంగా దింపింది. నేను వెళ్లేలోపు నా కూతురు వయసున్నా ఓ పాప వచ్చి కార్తీక్ ను కాపాడింది. ఆ పాపే కాపడకపోయి ఉంటే కార్తీక్ బతికేవాడా? నా కూతురు కారణంగా మేనల్లుడి ప్రాణాలు పోయాయంటే నేను బతకగలనా? అలాంటి వాళ్ల మంచి మనల్ని కాపాడుతుంది అని సుమిత్ర అంటుంది.
కార్తీక్ ప్రాణరక్షకుడు ఎవరు? రహస్యం వెల్లడి అవుతుందా?
చాలా బాగా చెప్పారు చిన్న మేడం అని అప్పటివరకూ వింటున్న కార్తీక్ మధ్యలోకి వస్తాడు. ఎప్పటి నుంచో అత్తకు నేనో మాట చెప్పాలనుకుంటున్నా. చిన్నప్పుడు నా ప్రాణాలు కాపాడిన నా ప్రాణ దాత గురించి. తన గుర్తుగా నా దగ్గర ఉండిపోయిన లాకెట్ కూడా మర్చిపోలేదని పాకెట్ లో నుంచి తీస్తాడు కార్తీక్. ఇది నాకు నా ప్రాణ దాత లాకెట్. ప్రాణం పోసిన మనిషిని దేవుడితో సమానం అంటారని కార్తీక్ అంటాడు. ఆ అమ్మాయి కనిపిస్తే లాకెట్ ఇచ్చి రుణం తీర్చుకుంటానని చిన్నప్పుడే చెప్పాడు అత్తయ్య అని సుమిత్ర చెప్తుంది.
వాళ్లు మళ్లీ కనబడతారా ఏంటీ? అని జ్యో, పారు ప్రశ్నిస్తారు. కనపడితే నేనే థ్యాంక్స్ చెప్పి సాయం చేస్తా. ఈ లాకెట్ ను నేనే మెడలో వేస్తానని సుమిత్ర అంటుంది. ఆ పాప ఎవరో తెలిసింది. కలిసింది కూడా. ఆ టైమ్ లో లాకెట్ దగ్గర లేదు అని కార్తీక్ అంటాడు. ఇప్పుడు ఆమె ఎక్కడుందని సుమిత్ర అంటే, మా ఇంట్లోనే అంటే మా వీధిలోనే ఉందని చెప్తాడు కార్తీక్. నాకు కలవాలని ఉంది. మనమే తన దగ్గరకు వెళ్లాలని సుమిత్ర అంటుంది.
ఆ వీధికి వెళ్తే మీ ఆడపడుచును కలవాలి. ఆమె మాట్లాడదు. కేవలం అమ్మాయిని కలిసి వస్తే గొడవ పెద్దదవుతుందని పారిజాతం అంటుంది. కాలజ్ణాణమేదే చేత్తో రాసినట్లు ఊహించి చెప్పాల్సిన అవసరం లేదు పారు. అత్త నువ్వు చెప్పు నా ప్రాణ దాత దగ్గరకు ఎప్పుడు వెళ్దామని అడిగితే తర్వాత వెళ్దామని సుమిత్ర వెళ్లిపోతుంది. జ్యోత్స్న థ్యాంక్స్ చెప్తా అంటే నువ్వు ఇప్పుడు కూడా చెప్పలేవు అని కార్తీక్ వెళ్లిపోతాడు. ఆ ప్రాణ దాత ఎవరై ఉంటారు అని జ్యో అనుకుంటుంది. దీంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ఈ ఎపిసోడ్ లో చాలా ఆసక్తికరమైన ట్విస్ట్ లు ఉన్నాయి. కాశీ అరెస్ట్, శ్రీధర్ నిర్లక్ష్యం, మరియు కార్తీక్ ప్రాణదాత ఎవరు అనేది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కథలో తదుపరి మలుపు ఏమిటో చూడాలని ఆసక్తిగా ఉంది.


