
కార్తీక దీపం 2 సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్‌లో గౌతమ్ ఇంట్లో జరిగిన సంఘటనల గురించి కార్తీక్, దీప మధ్య సంభాషణ జరుగుతుంది. జ్యోత్స్న తన ఎంగేజ్‌మెంట్‌ను ఆపేందుకు ప్లాన్ చేస్తుంది. కాశీ రూ.10 లక్షలు అప్పు తీర్చడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
Key Points
కాశీ రూ.10 లక్షలు అప్పు తీర్చిన విషయం అందరినీ షాక్‌కు గురిచేసింది.
జ్యోత్స్న తన ఎంగేజ్మెంట్ ఆపేందుకు కుట్రలు పన్నుతోంది.
కార్తీక్, దీప జ్యోత్స్న నిజ స్వరూపాన్ని బయటపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
దీపకు దాసు మామయ్య గురించి కార్తీక్ చెప్పిన విషయం ఆమెను షాక్‌కు గురిచేసింది.
కాశీ యొక్క రహస్యం బయటపడుతుందా?
కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ లో గౌతమ్ ఇంట్లో ఏం జరిగింది అని కార్తీక్ ను అడుగుతుంది దీప. జ్యోత్స్న ఒంటరిగా వచ్చిందనుకుని గౌతమ్ చేయి పట్టుకున్నాడు. బయటి నుంచి చూశాను. కాసేపు ఆగి ఉంటే జ్యోత్స్ననే చెప్పు తీసుకునే కొట్టేది. కానీ ఎంగేజ్మెంట్ ఆగిపోయేది. అయితే గౌతమ్ కాళ్లు పట్టుకునైనా ఎంగేజ్మెంట్ చేసుకునేవాడు అని కార్తీక్ అంటాడు. జ్యోత్స్నకు బుద్ధి లేదు అని దీప అంటే.. వేరే దారి లేదు అని కార్తీక్ చెప్తాడు.
మామయ్యకు జ్యోత్స్న గురించి తెలుసు. దాసు మామయ్యను చంపబోయింది జ్యోత్స్న అని మీ నాన్నకు తెలుసు అని కార్తీక్ చెప్పగానే దీప షాక్ అవుతుంది. నీకు ఎలా తెలుసు అంటే మామయ్యే చెప్పారని, నేను ఇంకా ఏం చెప్పలేదని కార్తీక్ అంటాడు. దాసు మామయ్యకు గతం గుర్తొస్తే నిజాలు తెలుసుకుని మామయ్య జ్యోత్స్ను ఏమైనా చేస్తాడు అని కార్తీక్ చెప్తాడు. దాసు బాబాయి ఎక్కడ ఉన్నాడు అని నీకు తెలుసా? అని దీప ప్రశ్నిస్తే.. రావాల్సిన సమయం వచ్చినప్పుడు దాసు వస్తాడు అని కార్తీక్ అంటాడు.
జ్యోత్స్న ఈ పెళ్లిని ఎలా ఆపాలనుకుంటుందో తెలుసు బావా అని దీప అంటే,లేదు అని కార్తీక్ ఆన్సర్ ఇస్తాడు. కానీ జ్యోత్స్న ప్లాన్ తెలుసుకోవాలని కార్తీక్ అంటాడు. జ్యోత్స్నకు నిజం చెప్పడం తప్పా వేరే దారి లేకుండా చేయాలి అని కార్తీక్ అంటాడు.
జ్యోత్స్న ఎంగేజ్మెంట్ నుంచి ఎలా తప్పించుకుంటుంది?
మరోవైపు స్వప్న, కాశీపై కౌంటర్లు వేస్తాడు శ్రీధర్ . పెళ్లాం మాట వినేవాడు మగాడు ఎలా అవుతాడు అని కాశీని ప్రశ్నిస్తాడు శ్రీధర్. రూ.10 లక్షలు అప్పు పెట్టుకుని ఎలా తింటున్నారని శ్రీధర్ అడుగుతాడు. అప్పు తీర్చేశానని కాశీ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. నీకు రూ.10 లక్షలు ఎవరిచ్చారని కాశీని అడుగుతారు. కానీ కొత్త ప్రాజెక్టు వచ్చిందని, అమౌంట్ ముందుగానే కావాలని చెప్పి తీసుకుని కట్టేశాను అని కాశీ చెప్తాడు. కానీ ఇది నమ్మబుద్ధి కావడం లేదని శ్రీధర్ అంటాడు.
గౌతమ్ చేయి పట్టుకుంటే బావ వచ్చి కాపాడాడని పారిజాతంతో జ్యో చెప్తుంది. కార్తీక్, దీప క్యారెక్టరే నా బలం. మైండ్ గేమ్ ఆడి నన్ను ఇరికించాలని కలలు కంటుంటే కోట్లకు వారసురాలిగా ఉన్న నేను ఎలాంటి కలలు కనాలి. నేను బావను తప్పా ఎవరిని పెళ్లి చేసుకోను అని జ్యో అనగానే పారు షాక్ అవుతుంది. దీప ఉండదు, శౌర్య ఉండదు అని జ్యో కన్నింగ్ గా చెప్తుంది. గౌతమ్ తో పెళ్లిని ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తున్నా. నా నోటితో నేనే గౌతమ్ చెడ్డవాడని చెప్పించాలనుకుంటున్నారు. కానీ కాశీని అడ్డం పెట్టుకుని ఆపించాలని చూస్తున్నామని తెలియదు అని జ్యో అంటుంది.
కాశీని నమ్మలేం. ఈ లోపు దీపకు ఇంత కూడా అనుమానం రాకూడదు అని జ్యో అంటూ అటు తిరిగి చూడగానే దీప కనిపిస్తుంది. దీంతో పారు, జ్యో కంగారు పడతారు. దీప వినేసిందా అని జ్యో ఆందోళన చెందుతుంది. ఎందుకు వచ్చావంటే కాఫీ ఇవ్వడానికి అని చెప్తుంది దీప. మా మాటలు వినొద్దు అని పారు అంటుంది. ఏమున్నాయి ఆపడానికి ట్రై చేస్తున్నారా? అంటే నిశ్చితార్థానికి ఆటంకాలు ఆపడానికా? అని సెటైరికల్ గా అడుగుతుంది దీప. ఈ నిశ్చితార్థం ఆగదు అని దీప అంటుంది.
కార్తీక్ మరియు దీప ఎదుర్కొనే సవాళ్లు ఏమిటి?
గౌతమ్ చెత్త వెధవ. అమ్మాయిల జీవితాలతో ఆడుకునే దుర్మార్గుడు. వాడికి ఆడదానితో అవసరమే తప్పా మనసులో పని లేదు. మోసం చేయడం వాడి నైజం. వాడొక దరిద్రుడు, మోసగాడు. గౌతమ్ తో పెళ్లి చేస్తే అమ్మాయి గారి జీవితం నాశనం అవుతుందని అన్నాననుకోండి అది అడ్డు పటే మాట. కానీ నేను అలా అనను కదా. ఎందుకంటే అమ్మాయికి కాబోయే భర్త గౌతమ్ ఉత్తముడు. పద్ధతి తెలిసినవాడు అని దీప ప్లేట్ తిప్పేస్తుంది. దీంతో జ్యోత్స్నకు మండిపోతుంది.
ఎంగేజ్మెంట్ ఎలా ఆపాలో ఇంకో ప్లాన్ వేసుకోవాలి అని జ్యో పారుతో అంటుంది. కాశీ నమ్మితే ఏమైనా చేస్తాడని పారు చెప్తుంది. కాశీని అడ్డుపెట్టుకుని నిశ్చితార్థం ఆపి, ఆ నింద దీప మీద వేస్తే చాలు మనం అనుకున్నది జరుగుతుంది. కానీ బావను ఓ కంట కనిపెట్టాలని జ్యో అనుకుంటుంది. దీంతో కార్తీక్ కు పొలమారుతుంది. పారుతో ఆడుకుంటాడు కార్తీక్. పెద్ద సారు, చిన్న సారు అని అందరినీ పిలుస్తాడు కార్తీక్.
గుడ్ న్యూస్ చెప్పేది కాదు చూపించాల్సింది అని కార్తీక్.. ఇంటికి కాబోయే అల్లుడు కాబోయే భార్యకు నిశ్చితార్థం ఉంగరాలు పంపించాడని అంటాడు. భద్రాచలంలో సీతారాముల కల్యాణంలో ఈ ఉంగరాలు ఉంచి, ప్రత్యేకంగా తీసుకొచ్చారు గౌతమ్ వాళ్ల అమ్మ. వాళ్లే తీసుకు వచ్చి ఇస్తే బాగుండేది అని శివన్నారాయణ అంటే.. గతంలో ఏం జరిగిందో తెలిసిందే కదా అని కార్తీక్ అంటాడు. ఈ ఉంగరాలు జ్యోత్స్నకు చూపించమని సుమిత్రకు కార్తీక్ ఇవ్వడంతో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.
చివరికి జ్యోత్స్న యొక్క కుట్రలు బయటపడతాయా? కార్తీక్ మరియు దీప ఈ సమస్యలను ఎలా అధిగమిస్తారు అనేది తదుపరి ఎపిసోడ్‌లో తెలుస్తుంది. కథాంశం మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది.


