
📌 Key Points
- దశరథ్ జ్యోత్స్నతో “నువ్వు నా కూతురివి కాదు” అని అనడం.
- కాంచన శ్రీధర్‌ను అంగీకరించనని తెలపడంతో శివనారాయణ గుక్కపెట్టి ఏడ్చాడు.
- శ్రీధర్ రెండో పెళ్లి గురించి కాంచన, శివనారాయణ మధ్య వాదన.
- దశరథ్ ‘దీప మా ఇంటికి రానవసరం లేదు’ అనడం జ్యోత్స్నను షాక్‌కు గురి చేసింది.
కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‌లో అనూహ్య మలుపులు చోటుచేసుకున్నాయి. దశరథ్, జ్యోత్స్నల మధ్య తీవ్ర వాగ్వాదం జరగగా, శివనారాయణ గుక్కపెట్టి ఏడ్చాడు. కాంచన తన వైఖరి మార్చుకోకపోవడంతో అందరూ షాక్ అయ్యారు. దీప భవిష్యత్తుపై అత్తమామల నిర్ణయం ఆసక్తి రేపుతోంది.
దశరథ్-జ్యోత్స్నల మధ్య మాటల యుద్ధం
కార్తీక దీపం 2 సీరియల్ డిసెంబర్ 4 ఎపిసోడ్‌లో దీప ఇంటికి దశరథ్‌తో వెళ్తుండగా జ్యోత్స కోపంగా ఉంటుంది. కారు ఆపి జ్యోత్స్నతో మాట్లాడిన దశరథ నువ్వు నా కూతురువి కాదు అంటాడు. మరోవైపు శ్రీధర్‌ను అంగీకరించమని శివ నారాయణ చెబుతాడు. భర్తను చచ్చుపడిపోయిన తన కాళ్లతో పోలుస్తుంది కాంచన. దాంతో శివ నారాయణ ఏడుస్తాడు.
కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో దశరథ్, జ్యోత్స్న కారులో దీప ఇంటికి వెళ్తుంటారు. జ్యోత్స్న కోపంగా ఉంటుంది. దీప అంటే నచ్చదంటుంది. కారు ఆపమంటాడు దశరథ్. వెళ్లి రెండు ఐస్‌క్రీమ్స్ తీసుకొచ్చి జ్యోత్స్నకు ఇస్తాడు దశరథ్. ఇద్దరు ఐస్‌క్రీమ్ తింటారు. మనం కాసేపు తండ్రికూతుళ్లలా మాట్లాడుకుందామా అని దశరథ్ అంటే మనం తండ్రి కూతుళ్లమే అని జ్యో అంటుంది.
శ్రీధర్‌ను అంగీకరించని కాంచన: శివనారాయణ వేదన
మీ ఆశలు నేను నిలబెడతాను అని జ్యో అంటే.. అలా అయితే నేను చెప్పినట్లుగా పెళ్లికి ఒప్పుకో అని దశరథ్ అంటాడు. మీరు కోరుకునే భవిష్యత్తు నాకు పెళ్లితోనే దొరుకుతుందనుకుంటే మీరు అనుకుందే చేయండి. నేను పెళ్లికి రెడీ అని జ్యో అంటుంది. ఇప్పుడే ఈ గుడ్ న్యూస్ అమ్మకు చెబుతానను దశరథ్ అంటే ఇంటికి వెళ్లాక చెప్పండి అని ఆపుతుంది జ్యోత్స్న .
కాంచన మాత్రం శ్రీధర్ రెండో పెళ్లి గురించి మాట్లాడుతుంది. ఈ దూరం ఎన్నాళ్లు అని శివ నారాయణ అంటే.. నేను ప్రాణాలతో ఉన్నన్నినాళ్లు అని కాంచన బదులిస్తుంది. ఇద్దరు షాక్ అవుతారు. తండ్రిగా నిన్ను శాసించే హక్కు నాకుంది. నువ్వు శ్రీధర్‌ను అంగీకరించాలని శివ నారాయణ అంటాడు. కాంచన మౌనంగా ఉంటే ఒప్పుకుందని శ్రీధర్‌కు కాల్ చేయమని కార్తీక్‌తో చెబుతాడు శివ నారాయణ .
దీపకు పుట్టింటి నుండి ఎలాంటి మద్దతు?
దాంతో శివ నారాయణ ఏడుస్తూ కుమిలిపోతాడు. కార్తీక్ ఓదారుస్తాడు. జీవితంలో రాని కాళ్లకు.. జీవితం నుంచి పంపించేసిన భర్తకు ముడిపెడతావా అని ఏడుస్తూ అంటాడు శివ నారాయణ. అంతేగా నాన్న. కాళ్ల మీద, భర్త మీద ఆశలు వదిలేసుకున్నాను. నా దృష్టిలో రెండు ఒక్కటే అని కాంచన చెబుతుంది. కాంచన మాటలకు శివ నారాయణ గుక్కపెట్టి ఏడుస్తుంటాడు.
మావయ్య గారు ఓ మాట చెప్పారు. అది చెప్పడానికే వచ్చామని సుమిత్ర అంటే.. రేపటి నుంచి దీప మా ఇంటికి రానవసరం లేదని దశరథ్ అంటాడు. దాంతో జ్యో షాక్ అవుతుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ఈ ఎపిసోడ్‌లో కుటుంబ బంధాలు, భావోద్వేగాలు ఉద్వేగభరితంగా చూపబడ్డాయి. దశరథ్ నిర్ణయంతో దీప భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. శివనారాయణ, కాంచనల మధ్య దూరం మరింత పెరిగింది. తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.


