
కార్తీక దీపం 2 సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతుంది. దాసు అనుకోకుండా వచ్చి గౌతమ్‌పై చెడు విషయాలు బయటపెడతాడు. జ్యోత్స్న నిజ స్వభావం బయటపడటం, సుమిత్రకు ఆಘాతం కలుగుతుంది.
Key Points
దాసు ఎంట్రీతో కార్తీక దీపం 2 లో కొత్త ట్విస్ట్!
గౌతమ్‌కు జ్యోత్స్న నిజ స్వరూపం బయటపడటం
గౌతమ్‌కు రమ్య అనే గర్భవతితో ఉన్న సంబంధం బయటపడటం
సుమిత్ర కుప్పకూలిన దృశ్యం
దాసు యొక్క ఆకస్మిక ప్రవేశం
కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో జ్యోత్స వేలికి ఉంగరం తొడగమని గౌతమ్‌కు పంతులు చెబుతాడు. జ్యోత్స్న ఏం చేస్తుందో అని దీప, కార్తీక్ టెన్షన్ పడుతుంది. నేను చెడ్డదాన్ని అయినా పర్వాలేదు. ఒక అమ్మాయి జీవితం నాశనం అవుతుంటే చూడలేను. మా అమ్మ గీసిన గీత దాటుతాను అని దీప అంటుంది.
మన దగ్గర ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బీ ఉంటుంది మరదలా అని కార్తీక్ అంటాడు. ఇంతలో శివ నారాయణ వచ్చి ఆపరా అని అరుస్తాడు. దాంతో గౌతమ్ ఆగిపోతాడు. వెళ్లి గౌతమ్‌ను కొడతాడు శివ నారాయణ. నా మనవరాలితోనే ఆడుకోవాలని చూస్తావా అని అలాగే కొడతాడు. ఈ వెధవని షూట్ చేసి పడేయాలి అని దశరథ్‌ను పిలిస్తే.. ఆ వెనుకే దాసు వస్తాడు.
ఈ గౌతమ్ ఎలాంటివాడో మీరే చూడండి అని కాశీ తీసిన వీడియోలను దాసు చూపిస్తాడు. గ్రానీ కొడుకు వచ్చి ఈ వీడియోలు చూపించడం ఏంటీ, కాశీ గాడు ఇచ్చాడా అని జ్యో, పారు డౌట్ పడతారు. అదంతా ఏఐ వీడియోలు. దీనికి లైవ్ సాక్ష్యం ఏమైనా ఉందా అని గౌతమ్ అంటాడు. రమ్య అని దాసు పిలిస్తే ఓ గర్భవతి వస్తుంది. ఆమెను చూసి అంతా షాక్ అవుతారు.
జ్యోత్స్న మరియు గౌతమ్ మధ్య సంఘర్షణ
ఇదివరకు దీప చెప్పింది ఆమె గురించి అని సుమిత్ర గుర్తు చేసుకుంటుంది. గౌతమ్ ప్రేమించి కడుపు చేసి వదిలేసిన వ్యక్తి అని దాసు చెబుతాడు. ఇదవరకు వచ్చి అదంతా అబద్ధం అని చెప్పావు అని సుమిత్ర అంటే.. ఆరోజు చెప్పిందంతా అబద్ధం అని రమ్య అంటుంది. ఇప్పుడు చెబుతుంది నిజమని గ్యారెంటీ ఏంటీ అని గౌతమ్ తండ్రి అంటే.. పోలీస్ స్టేషన్ సమక్షంలో డీఎన్ఏ టెస్ట్ చేయిద్దాం. గౌతమ్ నువ్ సిద్ధమేనా అని దాసు అంటాడు.
ఎవరు చెప్పిన నేను నమ్మలేదు గౌతమ్. చెప్పు డీఎన్ఏ టెస్ట్‌కు రెడీ అని జ్యోత్స్న అంతా అంటారు. ఒప్పుకో బ్రో తప్పు చేయనప్పుడు తగ్గొద్దు అని కార్తీక్ అంటాడు. నేను ఎవరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అసలు నాకే పెళ్లే వద్దు. పదండి డాడ్ అని గౌతమ్ అంటాడు. దొరికిపోయాక మెల్లిగా జారుకుంటున్నావా అని దశరథ్ ఒక్కటి కొడతాడు.
మంచివాడివి అనుకున్నాం కదరా అని సుమిత్ర కూడా కొడుతుంది. నీ కూతురు ఏదో ఆణిముత్యం అన్నట్లు మాట్లాడుతున్నావ్. తనేం చేయలేదా తప్పులు అని గౌతమ్ అంటే జ్యో అరుస్తుంది. నేను చెడ్డవాన్ని అయితే నువ్ చెడ్డదానివే. దీప మన విషయంలో దీప అడ్డుపడుతుంది అని గౌతమ్ చెప్పబోతుంటే కార్తీక్ కొడతాడు. ఇప్పుడు మా ఇంటి అమ్మాయిని తప్పుపడుతున్నావా అని కార్తీక్ అంటాడు.
సుమిత్ర యొక్క భావోద్వేగ విస్ఫోటనం
అసలు విషయం నీకు తెలియదు కార్తీక్ అని గౌతమ్ చెప్పబోతుంటే కార్తీక్ చెప్పనివ్వడు. మీ అందరిని వదలను అని గౌతమ్ అంటాడు. ఎంగేజ్‌మెంట్ రింగ్స్ తీసుకొచ్చి ఇస్తాడు కార్తీక్. దాంతో జ్యోత్స్న ఊపిరి పీల్చుకుంటుంది. ఇలా ఈసారి జ్యోత్స్న నిజ స్వరూపం చెప్పనివ్వకుండా కార్తీక్, దాసు కాపడతారు. దీపను సుమిత్ర చూస్తుంది. ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది.
దీప గీత దాటి వస్తుంది. విపరీతమైన ఒత్తిడికి గురై ఊపిరి తీసుకోవడం కష్టమైంది. ఇలాంటి సమయంలోనే గుండెపోటు వస్తుంది. త్వరగా రియాక్ట్ అయి మంచి పని చేశారు. కాసేపు మాట్లాడనివ్వకండి అని డాక్టర్ వెళ్లిపోతుంది. దాంతో అందరిని వెళ్లిపోమ్మంటాడు శివ నారాయణ. దీప, కార్తీక్ ఇంటికి వెళ్తారు. జరిగింది అంతా కాంచనకు చెబుతారు. తర్వాత సుమిత్ర అన్న మాటలు, జరిగింది గుర్తు చేసుకుంటుంది దీప.
కార్తీక్ వచ్చి దీపను ఓదారుస్తాడు. ఇద్దరు సుమిత్ర బాధ గురించి మాట్లాడుకుంటారు. ఇంతలో శౌర్య వచ్చి మీ అమ్మనా. అంటే నాకు అమ్మమ్మ ఉందా. నాకు కూడా చూపించొచ్చు కదా. అమ్మమ్మ ఇక్కడ ఎందుకు లేదు అని శౌర్య అడుగుతుంది. ఏం చెప్పాలా అని దీప ఆలోచిస్తుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ఈ ఎపిసోడ్‌లో చోటుచేసుకున్న సంఘటనలు కథానాయికల జీవితాల్లో కొత్త మలుపు తీసుకువస్తాయి. జ్యోత్స్న నిజ స్వరూపం బయటపడటం, సుమిత్ర కుప్పకూలడం వల్ల కథాంశం మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది.


