|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్‌: గ‌ట్టిగానే ప్లాన్ చేసిన కార్తీక్ -జ్యోత్స్న బ్యాడ్‌టైమ్ స్టార్ట్ -భ‌ర్త ప్రేమ‌కు దీప ఫిదా

Published: 15-05-2025, 10:41 PM
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్‌: గ‌ట్టిగానే ప్లాన్ చేసిన కార్తీక్ -జ్యోత్స్న బ్యాడ్‌టైమ్ స్టార్ట్ -భ‌ర్త ప్రేమ‌కు దీప ఫిదా

కార్తీక దీపం 2 సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్‌లో జ్యోత్స్న కుట్రలు, కార్తీక్ ప్రతిస్పందనలు, దీప ప్రేమ ప్రధానంగా చూపించారు. దాసు గత విషయాలను వెల్లడించడంతో ఉత్కంఠ మరింత పెరుగుతుంది.

Key Points

1

కార్తీక్ జ్యోత్స్న ప్రణాళికలను ఎదుర్కొవడానికి సిద్ధమవుతున్నాడు.

2

దీప అసలు వారసురాలు అనే విషయం జ్యోత్స్నకు తెలిస్తే ఏం జరుగుతుందో చూడాలి.

4

దీప తన భర్త ప్రేమకు ఫిదా అవుతుంది.

జ్యోత్స్న యొక్క ప్రమాదకరమైన ప్రణాళికలు

చంపేస్తానంటూ త‌న‌కు జ్యోత్స్న వార్నింగ్ ఇచ్చిన విష‌యం కార్తీక్‌కు చెబుతాడు దాసు. నువ్వు సంత‌కం చేసిన అగ్రిమెంట్‌పై దీప నుంచి నువ్వు విడిపోవాల‌ని జ్యోత్స్న‌ రాస్తే ఏం చేస్తావ‌ని కార్తీక్‌ను అడుగుతాడు దాసు. నువ్వు నాతోనే ఉండాలి…నా మెడ‌లో తాళిక‌ట్టాల‌ని అగ్రిమెంట్‌లో జ్యోత్స్న రాసిన రాస్తుంద‌ని అంటాడు. నా కూతురు ఎంత చెడ్డదో నాకు తెలుసు అని దాసు అన‌డంతో కార్తీక్ షాక‌వుతాడు. దీప‌పై ప్ర‌తీకారం తీర్చుకోకుండా జ్యోత్స్న వ‌దిలిపెట్ట‌ద‌ని దాసు భ‌య‌ప‌డిపోతాడు.

నిన్ను వ‌దిలిపెట్ట‌ద‌ని చెబుతాడు. సుమిత్ర బాగానే పెంచిన…ఆ అమ్మ జ్యోత్స్న మైండ్‌ను చెడ‌గొట్టి ఆస్తి పిచ్చిని ప‌ట్టించింద‌ని కార్తీక్‌తో చెబుతాడు దాసు. దీపే అస‌లైన వార‌సురాలు అనే నిజం జ్యోత్స్న‌ కు తెలిస్తే ఏం చేయ‌డానికి రెడీ అవుతుంద‌ని, తొంద‌ర‌ప‌డ‌క‌పోతే ఎవ‌రో ఒక‌రిని న‌ష్ట‌పోతామ‌ని అంటాడు.

తొంద‌ర‌ప‌డితే అంద‌రిని న‌ష్ట‌పోతామ‌ని దాసుకు కార్తీక్ బ‌దులిస్తాడు. ఆస్తి కోసం క‌న్న తండ్రినే చంపాల‌నుకున్న జ్యోత్స్న సుమిత్ర‌, ద‌శ‌ర‌థ్‌ల‌ను వ‌దిలిపెట్ట‌ద‌ని చెబుతాడు. జ్యోత్స్న మెడ‌కు రెండు కేసులు చుట్టుకున్నాయ‌ని, ఒక‌టి దీప‌ది…రెండు లైసెన్స్‌డ్ గ‌న్‌లో బుల్లెట్ మిస్సింగ్‌. జ్యోత్స్న‌ను ఎదుర్కోవ‌డానికి నేను రెడీగా ఉన్నాన‌ని అంటాడు.

జ్యోత్స్న రూట్‌లోనే వెళ్లి ఆమెను మార్చి త‌న‌తోనే నిజాల‌న్ని బ‌య‌ట‌పెట్టిస్తాన‌ని అంటాడు. దీప‌ను ఆ ఇంటి వార‌సురాలిని చేసి త‌న కుటుంబాన్ని ఆమెకు బ‌హుమ‌తిగా ఇస్తాన‌ని చెబుతాడు. నీ కూతురిని నీకు ద‌గ్గ‌ర చేస్తాన‌ని దాసుకు మాటిస్తాడు. జ్యోత్స్న అగ్రిమెంట్‌లో ఏం రాసుకున్నా స‌మ‌స్య లేద‌ని, టెన్ష‌న్ ప‌డొద్ద‌ని దాసుకు స‌ర్ధిచెబుతాడు కార్తీక్‌.

దీప‌ను వాళ్ల అమ్మ నాన్న‌ల ద‌గ్గ‌ర‌కు చేరిస్తే…నేను, మా అమ్మ చేసిన పాపాలు పోతాయ‌ని దాసు అంటాడు. నా జీవితంలో ఉన్న ఒకే ఒక వెలితి అని, అది నువ్వే తీర్చాల‌ని కార్తీక్‌తో చెబుతూ ఎమోష‌న‌ల్ అవుతాడు దాసు. జ్యోత్స్న తిక్క‌ను వ‌ద‌ల‌గొట్టి దానిని మ‌నిషిగా మార్చుతాన‌ని కార్తీక్ అంటాడు.

కార్తీక్‌, దాసు మాట్లాడుకోవ‌డం దీప‌ను చూస్తుంది. దాసు వెళ్లిపోగానే… బాబాయ్‌కి గ‌తం గుర్తొచ్చిందా?అని కార్తీక్‌ను అడుగుతుంది దీప‌. లేదంటూ కార్తీక్ అబ‌ద్ధం చెబుతాడు. మ‌రి బాబాయ్ మీతో ఇంత‌సేపు ఏం మాట్లాడాడ‌ని కార్తీక్‌ను అడుగుతుంది దీప‌. గ‌తం గుర్తుకురాక‌పోతే మ‌న ఇంటికి ఎలా వ‌చ్చాడంటూ లాజిక్‌లు మాట్లాడుతుంది దీప‌. వాళ్ల ఇళ్లు అనుకొని మ‌న ఇంటికి వ‌చ్చాడ‌ట‌. కొంద‌రు అంతే సొంత ఇంట్లో పెర‌గాల్సిన వాళ్లు ప‌రాయి ఇంట్లో పెరుగుతారు.

మ‌ళ్లీ వాళ్ల‌ను సొంత ఇంటికి చేర్చాలంటే క‌ష్ట‌ప‌డాల‌ని కార్తీక్ అంటాడు. దాసు బాబాయ్ నీ గురించే మాట్లాడాడ‌ని, నీకు ఇలా జ‌రిగిందే అని బాధ‌ప‌డ్డాడ‌ని దీప‌తో చెబుతాడు. నిన్ను నీ క‌న్న త‌ల్లిదండ్రుల‌కు చేర్చ‌డ‌మే ల‌క్ష్యంగా దాసు బ‌తుకుతున్నాడ‌ని మ‌న‌సులో అనుకుంటాడు కార్తీక్‌.

కార్తీక్ యొక్క వ్యూహాత్మక చర్యలు

దాసును ఒంట‌రిగా ఎలా పంపించారు? ఇంటికే వెళ‌తాడ‌ని గ్యారెంటీ ఏంటి? కాశీ వ‌చ్చేవ‌ర‌కు ఇక్క‌డే ఉంచితే అయిపోయేదిగా అని ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌లు వేస్తుంది దీప‌. ఆ ప్ర‌శ్న‌ల ధాటికి త‌ట్టుకోలేక దీప‌కు దండం పెడ‌తాడు కార్తీక్‌. మ‌రికాసేప‌ట్లో దాసు క్షేమంగా ఇంటికి చేరుకుంటాడ‌ని, మీ ప్ర‌శ్న‌ల‌తో న‌న్ను గ‌తం మ‌ర్చిపోయేలా చేయ‌ద్ద‌ని సెటైర్ వేస్తాడు.

ఇంకొద్ది రోజులు ఓపిక ప‌డితే నువ్వు జ్యోత్స్న స్థానంలో ఉంటావ‌ని, నువ్వు నీ ఇంటి వార‌సురాలిగా ఉంటావ‌ని మ‌న‌సులో దీప‌ను ఉద్దేశించి కార్తీక్ అనుకుంటాడు. ఈ సారి గ‌ట్టిగానే ప్లాన్ చేశాన‌ని, నిజాలు ఒప్పుకోవ‌డం మిన‌హా జ్యోత్స్న‌కు ఇంకో ఆప్ష‌న్ లేద‌ని అంటాడు.

త‌లంటూ స్నానం చేసిన దీప జ‌ట్టును ఆవిరి ప‌ట్టి ఆర‌బెడ‌తాడు కార్తీక్‌. ఈ ప‌నుల‌న్నీ మీరు చేయ‌డం ఏంటి దీప అంటుంది. ఇప్పుడు నీ ప‌రిస్థితి బాగాలేదు. భార్య‌భ‌ర్త‌ల్లో ఒక‌రి బాధ్య‌త మ‌రొక‌రిది కాబ‌ట్టి…ఇప్పుడు నీ బాధ్య‌త నాది అని స‌మాధాన‌మిస్తాడు కార్తీక్‌. నిన్ను కంటికి రెప్ప‌లా..,.చంటి పాప‌లా చూసుకోవాల‌ని ఉంది అని కార్తీక్ అన‌గానే దీప ఎమోష‌న‌ల్ అవుతుంది. ఈ చంటి పాప కంటిరెప్ప‌ల్లో నీళ్లు క‌నిపించ‌కూడ‌ద‌ని దీప క‌న్నీళ్లు తుడుస్తాడు కార్తీక్‌.

నేనే అసూయ ప‌డేంత అదృష్టాన్ని నాకు ఇచ్చార‌ని, ఇంకో జ‌న్మ ఉందో లేదో తెలియ‌దు కానీ ఉంటే మీ కోసం మ‌ళ్లీ పుట్టాల‌ని ఉంద‌ని అంటుంది. ఈ జ‌న్మ‌లో నువ్వు పుట్టింది నాకోస‌మేన‌ని కార్తీక్ మ‌న‌సులో అనుకుంటాడు. ఇది నా మేన‌కోడ‌లు కాద‌ని, కాబోయే కోడ‌లు అని దీప పుట్టిన‌ప్పుడు కాంచ‌న అన్న మాట‌లు గుర్తుచేసుకుంటాడు కార్తీక్‌. మ‌నుషులు ఆశ‌లు వ‌దిలేసుకున్నా…కాలం గుర్తుపెట్టుకున్న మాట మూడుముళ్ల‌తో నిజ‌మైంద‌ని అంటాడు. నీది నాది ఈ జ‌న్మ‌లో బంధ‌మేన‌ని అంటాడు.

దీప‌కు జ‌డ‌వేస్తాన‌ని కార్తీక్ అంటాడు. వ‌ద్ద‌ని దీప అంటుంది. మ‌ర‌ద‌లికి జ‌డ వేస్తే త‌ప్పేంట‌ని కార్తీక్ నోరుజారుతాడు. మ‌ర‌ద‌లేంటి అని దీప అడుగుతుంది. చిన్న‌ప్పుడు మ‌ర‌ద‌లికి జ‌డ వేయాల‌ని అనుకున్నాన‌ని, కుద‌ర‌లేద‌ని కార్తీక్ టాపిక్ డైవ‌ర్ట్ చేస్తాడు. మ‌ర‌ద‌లు అంటే జ్యోత్స్నే కావాలా..నువ్వు కాకూడ‌దా అని చెబుతాడు. నువ్వు నా మేన‌మామ కూతురివేన‌ని కార్తీక్ వాదిస్తాడు.

మీ నాన్న మా అమ్మ‌కు అన్న‌య్యే క‌దా అని మాట్లాడుతాడు. మీ నాన్న‌ను మా అమ్మ అన్న‌య్య అనుకుంద‌ని, మీ నాన్న నాకు మావ‌య్య అయితే నువ్వు నాకు మ‌ద‌ర‌లివే అవుతావు క‌దా అని దీప‌తో అంటాడు కార్తీక్‌. దీప నోటితోనే మ‌ర‌ద‌లు అని ఒప్పిస్తాడు.

దీప త‌ల అటూ ఇటూ తిప్ప‌డంతో జడ స‌రిగ్గా కుద‌ర‌దు. బొంగ‌రంలా త‌ల‌తిప్పితే జ‌డ ఎలా వేయాలి అని దీప‌ను కోప్ప‌డుతాడు కార్తీక్‌. ఏంటి కోప్పుడుతున్నార‌ని దీప అడుగుతుంది. నేనింతే మ‌ర‌ద‌లు మీద కోప్ప‌డుతాన‌ని కార్తీక్ బ‌దులిస్తాడు.

దీప మరియు కార్తీక్ ప్రేమ

మ‌న మ‌ధ్య ప్రేమ‌లేగానీ దేనికి చోటు లేద‌ని కార్తీక్ బ‌దులిస్తాడు. మీ గురించి ఎన్ని చెప్పిన త‌క్కువే. మీ లాంటి భ‌ర్త‌ను పొందాల‌ని ప్ర‌తి ఆడ‌పిల్ల క‌ల‌లు కంటుంద‌ని దీప అంటుంది.

కార్తీక్ వేసిన జ‌డ‌ను చూసి దీప మురిసిపోతుంది.చాలా బాగా వేశార‌ని అంటాడు. ఆత్మ సౌంద‌ర్యంలో నిన్ను మించిన అంద‌గ‌త్తెను చూడ‌లేద‌ని దీప‌ను పొగ‌డుతాడు కార్తీక్‌. ఎవ‌రు ఏం అనుకున్నా…ఎన్ని అనుకున్నా…మ‌నం ఇలాగే జంగ గోరింక‌ల్లా ఉంద‌ని అంటాడు. నువ్వు పూర్తిగా కోలుకునే వ‌ర‌కు నీ ప‌నుల‌న్నీ నేనే చూసుకుంటాన‌ని దీప‌తో అంటాడు కార్తీక్‌.

నాన్న తొంద‌ర‌గా రా అని శౌర్య కేక‌లు వేయ‌డంలో కార్తీక్ కంగారుగా బ‌య‌ట‌కు వ‌స్తాడు. గార్డెన్‌లో ర‌క్తం మ‌ర‌క‌ల‌తో ఉన్న క‌త్తి క‌నిపిస్తుంది. దీప‌ను ముసుగు మ‌నిషి పొడిచిన క‌త్తి అదేన‌ని కార్తీక్ అనుకుంటాడు. పోలీసుల‌కు ఇన్ఫ‌ర్మేష‌న్ ఇస్తాడు.

దీప‌పై హ‌త్యాప్ర‌య‌త్నం చేసిన వాడిని ప‌ట్టుకోవ‌డానికి మంచి ఆధార‌మ‌ని పోలీస్ ఆఫీస‌ర్ చెబుతాడు. దీప‌ను చంప‌డానికి వాడిన క‌త్తి ఇదే అయ్యుంటుంద‌ని అంటాడు. కొన్నిసార్లు కేసును మిస్‌లీడ్ చేయ‌డానికి వేరేవాళ్ల ఫింగ‌ర్ ప్రింట్స్ ఉన్న క‌త్తిని కావాల‌నే వ‌దిలేసి వెళ‌తాడ‌ని పోలీస్ ఆఫీస‌ర్ అంటాడు. కిల్ల‌ర్ ఇలా క‌త్తిని పారేసుకొని వెళ్ల‌డం జ‌ర‌గ‌ద‌ని అంటాడు.

మీకు ఎవ‌రిమీదైనా అనుమానం ఉందా అని కార్తీక్‌ను అడుగుతాడు పోలీస్ ఆఫీస‌ర్. ఉంది అని కార్తీక్ బ‌దులిస్తాడు. జ్యోత్స్న‌, గౌత‌మ్‌ల‌పై త‌న‌కు అనుమానం ఉంద‌ని పోలీస్ ఆఫీస‌ర్‌తో చెబుతాడు కార్తీక్‌. వీళ్లు కాకుండా మూడో వ్య‌క్తి ఎవ‌రికో నా భార్య‌పై ప‌గ ఉంద‌ని అంటాడు. అత‌డిని జ్యోత్స్న‌, గౌత‌మ్‌లే పంపించి ఉండొచ్చ‌ని చెబుతాడు. పోలీస్ ఆఫీస‌ర్‌తో కార్తీక్ మాట్లాడ‌టం దీప వింటుంది.

ఎస్ఐతో జ్యోత్స్న పేరు ఎందుకు చెప్పార‌ని కార్తీక్‌ను నిల‌దీస్తుంది దీప‌. పోలీసులు జ్యోత్స్న ఇంటికి వెళితే గొడ‌వ‌లు మ‌రింత పెద్ద‌వి అవుతాయ‌ని భ‌య‌ప‌డుతుంది. పోలీసుల‌ను ఆ ఇంటికి వెళ్ల‌కుండా ఆప‌మ‌ని అంటుంది. అస‌లు నేర‌స్తుల‌ను వ‌దిలిపెట్ట‌మ‌ని అంటావా అని దీప‌తో అడుగుతాడు కార్తీక్‌. జ్యోత్స్న‌ను మీరు వ‌దిలిపెట్టిన నేను మాత్రం వ‌దిలిపెట్ట‌న‌ని దీప అంటుంది. అక్క‌డితో నేటి కార్తీక దీపం 2 సీరియ‌ల్ ముగిసింది.

కార్తీక్ జ్యోత్స్నను ఎదుర్కొని దీపకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాడు. దీప తన భర్త ప్రేమకు ఫిదా అవుతుంది. కుటుంబం మళ్ళీ ఏకమవుతుందా అనేది ఆసక్తికరమైన అంశం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.