
కార్తీక దీపం 2 సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. కార్తీక్, జ్యోత్స్న మధ్య వాగ్వాదం, స్వప్న పశ్చాత్తాపం, దాసు కన్నీళ్లు, చాక్లెట్స్ దొంగతనం వంటి సంఘటనలు జరిగాయి. శివ నారాయణ మ్యాజిక్ కూడా ప్రేక్షకులను ఆకర్షించింది.
Key Points
కార్తీక్, జ్యోత్స్న మధ్య వాగ్వాదం!
స్వప్న తండ్రిని తిట్టినందుకు పశ్చాత్తాపం.
శౌర్య చాక్లెట్స్ దొంగతనం!
కార్తీక్ మరియు జ్యోత్స్న మధ్య ఘర్షణ
కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో జ్యోత్స్నకు దీప తన తాళి ఇవ్వడంపై కార్తీక్ పంచ్‌లు వేస్తాడు. ఈ మధ్య కాలంలో కనిపించని దీప దర్శనం ఇచ్చింది. తొందర్లోనే అందరికి అరిటాకు వేసి విందు భోజనం పెడతా. నేను అన్ని ఓడిన బాధలో ఉన్నాను. నువ్వు అని గెలిచిన ఆనందంలో ఉన్నావ్ అని జ్యోత్స్న అంటుంది.
నేను ఏం సంతోషంగా లేను. మనసులో మోయలేని బాధ ఎంతో ఉంది అని కార్తీక్ అంటే.. అది తీర్చుకునేందుగా శౌర్యను తీసుకొచ్చింది. చిన్న పిల్లను అడ్డు పెట్టుకుని భలే డ్రామాలు ఆడతావ్ బావ అని జ్యోత్స్న అంటుంది. ఏమేం డ్రామాలు ఆడాను. నాకు వచ్చేది ఏంటని కార్తీక్ అడుగుతాడు.
నేను తాళి తీసినప్పటి నుంచి, కంపెనీ నష్టాల్లోకి వచ్చాకా మా తాత యాంటీగా తయారయ్యాడు. నాగున్న సపోర్ట్ మా అమ్మ. ఇప్పుడు శౌర్యతో మా అమ్మను నీ వైపు లాక్కుని కంపెనీ సీఈఓ కావాలని చూస్తున్నావ్ అని జ్యో అంటే.. కార్తీక్ నవ్వుతాడు. ఇది పెద్ద జోక్ అని కార్తీక్ అంటాడు. మా అత్త గురించి నాకు తెలుసు. కానీ తాళీ తీయదు. ఎవరైనా తీయమంటే తీసి ఉండాలి. నిజాలు బయటపడ్డ రోజు అవతలి వాళ్ల కింద భూకంపాలే అని కార్తీక్ అంటాడు.
నువ్ మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నావ్ బావ అని జ్యో అంటే.. మనదంతా ఓపెన్ టైపే అని కార్తీక్ అంటాడు. తొందర్లోనే ఇది కనిపెట్టాలి అని జ్యోత్స్న వెళ్లిపోతుంది. మరదలికి డౌట్ వచ్చినట్లుంది. అది కూడా మంచిదే. అందరిని ఎలా కలపాలి అని కార్తీక్ ఆలోచిస్తాడు. మరోవైపు తండ్రిని తిట్టినందుకు స్పప్న ఏడుస్తుంటుంది.
స్వప్న యొక్క పశ్చాత్తాపం
చాలా గిల్టీగా అనిపించింది. చేతులు, కాళ్లు పట్టుకుని నాకోసం ఇంత చేశావా అని ఏడిస్తే అసహ్యంగా ఉంటుందనిపించిందని స్వప్న అంటుంది. ఇంతలో కాశీ పిలిస్తే తన ఫ్రెండ్‌కు తెలిసిన కంపెనీలో జాబ్ ఉందట. ఒంటరిగా ఎందుకులే అని నేను తోడు వస్తానని వెళ్తున్నా అని తల్లితో చెబుతుంది స్వప్న. కాశీ బైక్ స్టార్ట్ చేస్తే అవ్వదు. బైక్ రిపేర్‌కు వచ్చినట్లుంది. ఈ డబ్బులు తీసుకుని రిపేర్ చేయించుకుని వెళ్లమను అని కావేరికి ఇస్తాడు శ్రీధర్.
కావేరి స్వప్నకు ఇస్తుంది. స్వప్న కాశీకి ఇస్తుంది. కాశీ ఒక్కడే వెళ్లిపోతాడు. అదంతా చూసిన దాసు ఇబ్బంది పడితే.. అల్లుడికి మామ డబ్బులిస్తే దానం అవ్వదు. ప్రేమే అవుతుంది అని స్వప్న చెప్పి వెళ్లిపోతుంది. దాంతో కన్నీరు పెట్టుకుంటాడు దాసు. మరోవైపు శౌర్య పూలు కోస్తుంటే.. తనకు దశరథ్ ఇచ్చిన చాక్లెట్స్ ఎవరో దొంగతనం చేస్తారు.
ఇంతలో అక్కడికి శివ నారాయణ వస్తాడు. శౌర్య వచ్చి చూస్తే చాక్లెట్స్ కనిపించవు. నా చాక్లెట్స్ బాక్స్ నువ్వే తీశావ్ అని శివ నారాయణను నిలదీస్తుంది శౌర్య. నీ చాక్లెట్స్ ఎవరు తీశారో నాకు తెలుసు అని చెప్పిన శివ నారాయణ అటు ఇటు చూస్తుంటే పారిజాతం గమనిస్తూ కనిపిస్తుంది. వెంటనే పారిజాతంను పిలిచి నీ చీర బాగుంది, చీర కొంగు బాగుందని చెబుతాడు.
దాంతో పారు మురిసిపోతుంది. నా చాక్లెట్స్ గురించి అడుగుతావనుకుంటే చీర గురించి అంటావేంటీ అని శౌర్య అంటుంది. అక్కడే ఉంది మ్యాజిక్కు అని శివ నారాయణ అంటాడు. నీకు మ్యాజిక్ తెలుసా అని శౌర్య అంటే.. అవును ఆబ్రకదబ్ర అని చెప్పి నీ జోగిరాణి పైట కొంగులో ఉండదంటాడు శివ నారాయణ. పారిజాతం లేదంటుంది. ఇంతలో బెత్తం పట్టుకుని కార్తీక్ వస్తాడు. ఈ మ్యాజిక్ సరిపోతుందేమో అని కార్తీక్ అంటాడు.
దాసు యొక్క దుఃఖం
చూపించు జోగురాణి అని కొంగును శౌర్య తీసేసరికి చాక్లెట్ బాక్స్ కిందపడుతుంది. శౌర్యను లోపలికి వెళ్లి ఆడుకోమ్మని పంపిస్తాడు శివ నారాయణ. ఇప్పుడు నిన్ను ఏమనాలి అని పారును తిడతాడు. నోరు చేదుగా ఉందని బాక్స్ తీసుకుంటే దొంగతనం అంటగడతారేంటీ అని పారు అంటుంది. షుగర్ ఉండి ఎలా తింటావ్. పారు ఆరోగ్యం నీ బాధ్యతే కార్తీక్ అని చెప్పి వెళ్లిపోతాడు శివ నారాయణ.
నా ఉసురు మీ అందరికి తగులుతుందని పారిజాతం వెళ్లిపోతుంది. దీనికే నీ ఉసురు తగిలితే నువ్ చేసిన పాపాలకు నీకు ఎంత ఉసురు తగలాలి అని కార్తీక్ అనుకుంటాడు. మరోవైపు శ్రీధర్‌లో ఇంత మార్పు ఏంటో అర్థం కావట్లేదు అని తల్లితో అంటుంది స్వప్న. గొప్పలు కూడా చెప్పుకోవట్లేదు. సైలెంట్‌గా ఉంటున్నాడని ఆశ్చర్యపోతారు. ఈ మార్పుకు కారణం కార్తీకే అనుకుంటారు.
యాక్సిడెంట్ విషయం కార్తీక్‌కు మనమే చెబుతాం అని కావేరి అనుకుంటుంది. నో డౌట్ నాన్నను మార్చింది నువ్వే అన్నయ్య అని స్పప్న అనుకుంటుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ఈరోజు ఎపిసోడ్‌లో చోటుచేసుకున్న సంఘటనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శ్రీధర్ మార్పు, స్వప్న పశ్చాత్తాపం, దాసు దుఃఖం వంటివి ప్రేక్షకుల హృదయాలను కదిలించాయి. మరిన్ని ఉత్కంఠభరితమైన ట్విస్టుల కోసం వేచి చూద్దాం.


