
కార్తీక దీపం 2 సీరియల్‌లోని తాజా ఎపిసోడ్‌లో సుమిత్ర అత్త, దీప పెళ్లి గురించి కీలక నిర్ణయం తీసుకుంటుంది. కార్తీక్ నిజం ఏమిటో, సుమిత్ర అత్త ప్రవర్తన వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకోవడానికి ఈ ఎపిసోడ్ చూడండి.
Key Points
సుమిత్ర అత్త దీపను తన కూతురుగా అంగీకరిస్తుందా?
కార్తీక్ మరియు దీపల వివాహం జరుగుతుందా లేదా?
కాంచన దీప పెళ్లికి ఎంతో సంతోషిస్తుంది.
సుమిత్ర అత్త నిర్ణయం
కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఆగస్టు 13వ తేదీ ఎపిసోడ్ లో అమ్మ సైలెంట్ గా ఉండటం చూసి ఏమైందని ప్రశ్నిస్తాడు కార్తీక్. పెళ్లికి నాన్న ఒప్పుకోవడంతోనే అయిపోదు కదా. మిగతా విషయాలు మాట్లాడాలంటే ఎలాగో ఏంటో? వాళ్లు మన ఇంటికి రావాల్సిన అవసరం లేదు. మనం వెళ్లలేం అని కాంచన అంటుంది. అప్పుడే దశరథ్ ఎంట్రీ ఇస్తాడు. నీ పుట్టింటికి నువ్వు బంధువే కానీ చుట్టానివి కాదమ్మా. ఏదైనాా నేను ఇవ్వనని అననమ్మా అని దశరథ్ అంటాడు. శివన్నారాయణ, పారిజాతం కూడా కాంచన ఇంటికి వస్తారు.
అన్నయ్య వదిన రాలేదా? అని కాంచన అడగ్గానే మీ అన్నయ్యకేనా నీ మీద ప్రేమ ఉంది, మేం కూడా వచ్చామని సుమిత్ర ఎంట్రీ ఇస్తుంది. అది చూసి కాంచన ఫుల్ హ్యాపీ అవుతుంది. మేం వచ్చింది దీప, కార్తీక్ ల పెళ్లి గురించి మాట్లాడటానికి అని శివన్నారాయణ అంటాడు. ముహూర్తాలు, మిగతా విషయాల గురించి ఈ రోజు మాట్లాడుకుందామని శివన్నారాయణ అంటాడు. దీపను కాఫీ తెమ్మంటుంది సుమిత్ర. అమ్మ నాతో మాట్లాడిందని అనుకుంటూ దీప ఆనందపడుతుంది.
మీ అమ్మ కాఫీ ఇవ్వమని అంత ప్రేమగా అడిగితే ఇంకా నిలబడి చూస్తావేంటీ మరదలా? అని కార్తీక్ అంటాడు. అమ్మ ఏంట్రా, అమ్మగారు అనాలి కదా అని పారు ప్రశ్నిస్తుంది. కన్న కూతురు ఎక్కడైనా తల్లిని అమ్మగారు అని పిలుస్తుంది. దీప మా అత్తయ్య కన్న కూతురే. సుమిత్ర అత్త, దశరథ్ మామయ్య దీప అమ్మానాన్న స్థానంలో నిలబడి పెళ్లి జరిపించేందుకు ఒప్పుకొన్నారు కదా. అందుకే అమ్మా అన్నానని కార్తీక్ అంటాడు.
కార్తీక్ మరియు దీపల భవిష్యత్తు
అత్త ఇలా మారడం ఏంటీ అని కార్తీక్ డౌట్ పడతాడు. మరోవైపు సుమిత్రను చూసి కాంచన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ రోజు దీపను ఎంతో ప్రేమగా పిలిచి, కాఫీ తెమ్మన్నావు. దీప లోలోపల తెగ పొంగిపోయి ఉంటుంది. చాలా సంతోషంగా ఉన్నా వదిన. దీపకు తల్లి స్థానంలో నిలబడి పెళ్లికి ఒప్పుకుంటావని కలలో కూడా ఊహించలేను వదిన అని కాంచన అంటుంది. నేను ఎంత బాధలో ఉన్నానో నా ముఖం చూస్తే తెలియడం లేదు కదా అని సుమిత్ర ట్విస్ట్ ఇస్తుంది. వచ్చేముందు పౌడర్ తో పాటు నవ్వు కూడా అద్దుకుని వచ్చా. దీపను ఈ జన్మలో క్షమించను. మామయ్య గీసిన గీత నా భర్త దాటడు. నా భర్త గీతను నేను దాటను. నాన్న, అన్నయ్య మాటిస్తే నేను మాట ఇచ్చినట్లేనా అని సుమిత్ర అంటుంది.
దీపను నా ఇంటి పని మనిషిగా వద్దన్నదాన్ని. కూతురు స్థానం ఇస్తానంటే మీరు ఎలా నమ్ముతారు. నీ భర్తను చంపాలనుకున్న మనిషిని నువ్వు క్షమిస్తావా? నీ కోడలిని కత్తితో పొడిచారు కదా ఆమెను క్షమిస్తావా? అని సుమిత్ర అడుగుతుంది. క్షమించను అని కాంచన అంటుంది. మరి నేనేలా నీ కోడలిని క్షమిస్తానని అనుకుంటున్నావ్. అలాంటిదాన్ని నేను కూతురు అనుకోవాలా? నా మెట్టినింటి గౌరవం కోసం వచ్చాను. నీ కోడలు కోసం రాలేదు. ఈ పెళ్లి జరగదు. నువ్వే ఆపాలి అని సుమిత్ర అనడంతో కాంచన షాక్ అవుతుంది.
దీప మెడలో జ్యోత్స్న తాళి తెంపడం తప్పే. కానీ దీపకు తల్లిగా ఉండటం కంటే ఇంకా ఏదైనా చేస్తా. నీ కాళ్లు పట్టుకోనా? నా కూతురిని కార్తీక్ కాళ్లు పట్టుకోమని చెప్పనా? అని సుమిత్ర అంటుంది. తాళి తెగింది దీపది. క్షమాపణకు బదులుగా కోరిక కోరారు. దానికి మీరు సరే అన్నారని కాంచన బాధ పడుతుంది. నువ్వెళ్లి పెళ్లి గుళ్లో పెట్టుకుంటాం. అన్నయ్య, వదిన అతిథులుగా వస్తే చాలని చెప్పమని కాంచనతో అంటుంది సుమిత్ర. కత్తి నా చేతికి ఇచ్చి నన్నే పొడుచుకోమంటున్నావా? అలా చెప్తే నాన్న నాతో ఇంకెప్పటికీ మాట్లాడడు వదిన అని కాంచన కన్నీళ్లు పెట్టుకుంటుంది.
కాంచన ప్రతిస్పందన
ఈ పాపాన్ని నా చేతులకు అంటించొద్దు అని కాంచన ఏడుస్తుంది. వెళ్లి ఈ పెళ్లి జరగదని చెప్తానని సుమిత్ర అంటుంది. నేను చెడ్డదాన్ని అయినా పర్వాలేదు కానీ పెళ్లి జరగదని అందరికీ అర్థమయ్యేలా చెప్తానని సుమిత్ర అంటే.. అప్పుడే వచ్చిన జ్యోత్స్న ఈ పెళ్లి జరగాలని అంటుంది. ఒకరోజు జరిగే పెళ్లిలో దీపకు తల్లిదండ్రుల స్థానంలో కూర్చోవాలి అంతే కదా. ఆ తర్వాత నువ్వు యజమానురాలు, దీప పనిమనిషి. నా విషయంలో ఉన్న బాధ ఈ పెళ్లితో పోతుంది. గతంలో దీప నీ ప్రాణాలు కాపాడింది కదా. ఇప్పుడు పెళ్లి చేసి రుణం తీర్చుకో. నా మంచి కోసం ఒక్క రోజు దీప నీ కూతురు అనుకో మమ్మీ అని రిక్వెస్ట్ చేస్తుంది జ్యోత్స్న.
సరే అనుకుంటానని సుమిత్ర చెప్తుంది. జ్యోత్స్న ఏంటీ ఇంత మంచిగా మారిపోయిందని కాంచన అనుకుంటుంది. అమ్మను చూస్తుంటే నా మీద కోపం పోయినట్లే ఉందని కార్తీక్ లో మెల్లగా మాట్లాడుతుంది దీప. ముందు వాళ్లు ఏం మాట్లాడుకున్నారో అమ్మని అడగాలి అని కార్తీక్ అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
చివరికి సుమిత్ర అత్త నిజమైన ముఖం బయటపడుతుంది. దీప భవిష్యత్తు ఏమవుతుందో తెలియదు. ఈ ఎపిసోడ్‌లో ఎన్నో ట్విస్టులు, టర్న్స్ ఉన్నాయి.


